డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్
డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ | |
---|---|
జననం | 16 May 1831 వై.బాల |
మరణం | 1900 జనవరి 22 | (వయసు 68)
జాతీయత | బ్రిటిష్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | Microphone, Semiconductor, Diode, Invention of radio, Crystal radio detector, Crystal radio, Radio transmitter, Radio receiver, Teleprinter, Hughes Medal |
డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ (మే 16, 1831 - జనవరి 22, 1900) అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఒక శాస్త్రవేత్త, సంగీత కారుడు. హ్యూగ్స్ మైక్రోఫోన్, టెలిప్రింటర్, రేడియో, క్రిస్టల్ రేడియో, వంటి ఆవిష్కరణలకు సహ ఆవిష్కర్త.ఆయన వైణికుడు, సంగీతంలో ఆచార్యుడు.
జీవిత విశేషాలు
[మార్చు]హ్యూగ్స్ వేల్స్ దేశంలో "బాల" ప్రాంతంలో 1831 లో జన్మించాడు.7 సంవత్సరాల వయసులో అతని కుటుంబం యునైటెడ్ స్టేట్స్ కు వలస వెళ్ళింది.[1] ఆయన ఒక ప్రయోగాత్మక భౌతిక శాస్త్రవేత్త. ఆయన విద్యుత్తు మారియు విద్యుత్ సంకేతాలు వంటి రంగాలలో కృషిచేశాడు. ఆయన అభివృద్ధి చెందిన మైక్రోఫోన్ను కనుగొన్నాడు. ఆ మైక్రోఫోన్ థామస్ అల్వా ఎడిసన్ కనుగొన్న కార్బన్ మైక్రోఫోన్ ట్రాన్సిమిటర్ కు మార్పులు చేసి సరికొత్త మైక్రోఫోన్ కనుగొన్నాడు.ఆయన "మైక్రోఫోన్" అనే పదాన్ని బలహీనమైన శబ్ద తరంగాలనుంది బెల్ టెలిఫోన్ రిసీవర్ వరకు ప్రసారణ సామర్థాన్ని పెంచే విధంగా వివరించి అభివృద్ధి చేశాడు. అతడు ప్రేరణ సమతౌల్యం (induction balance) ను కనుగొన్నాడు. ఇది ప్రస్తుతం మెటల్ డిటెక్టర్లలో ఉపయోగపడుతుంది. హ్యూగ్స్ ప్రయోగం ఒక ప్రయోగం అయినప్పటికీ అయన కొంత గణిత శిక్షణ పొందాడు. అతని స్నేహితుడు విలియం హెన్రీ ప్రీస్ ఒక గణిత శాస్త్రవేత్త.
డేవిడ్ హ్యూస్ పై మొదటి జీవితచరిత్ర పుస్తకం ఇవోర్ హ్యూస్, డేవిడ్ ఎల్లిస్ ఎవాన్స్ చే వ్రాయబడి 2011 లో ప్రచురించబడింది.[2]
సంగీతం
[మార్చు]హ్యూగ్స్ ఒక సంగీతకారుల కుటుంబంలోనివాడు. అయన 6 సంవత్సరాల వయసులో వీణ పై సంగీత రాగాలను పలికించే సామర్థాన్ని పొందాడు. అతి పిన్న వయసులో వైణికునిగా రాణించి అమెరికాలో ఉన్న ప్రముఖ పియానో విద్వాంసుడు, సెయింట్స్ జోసెఫ్ కాలేజ్, బార్డ్‌స్టోన్ లో ప్రొఫెసర్ అయిన "హెర్ హాస్ట్" చే మన్ననలు పొందాడు.
ప్రింటింగ్ టెలిగ్రాఫ్
[మార్చు]హ్యూగ్స్ "ప్రింటింగ్ టెలిగ్రాఫ్ వ్యవస్థ"కు యునైటెడ్ స్టేట్స్ లో 1855 లో రూపకల్పన చేశాడు[3]. రెండు సంవత్సరముల లోపల అనేక చిన్న టెలిగ్రాఫ్ కంపెనీలు, వెస్టర్న్ యూనియన్ కంపెనీతో సహా అన్నీ కలసి ఒక పెద్ద కార్పొరేషన్ గా యేర్పడ్డాయి. అది వెస్టర్న్ యూనియన్ టెలిగ్రాఫ్ కంపెనీ. అది హ్యూగ్స్ వ్యవస్థ ద్వారా టెలిగ్రాఫ్ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది. హ్యూగ్స్ వ్యవస్థ అంతార్జాతీయ ప్రమాణాలకు ఎదిగింది.
సూచికలు
[మార్చు]- ↑ Anon. "88. David Edward Hughes". 100 Welsh Heroes. Culturenet Cymru. Archived from the original on 2009-05-14. Retrieved June 30, 2009.
- ↑ "Images From The Past". Archived from the original on 2012-10-27. Retrieved 2013-05-13.
- ↑ "David Edward Hughes". Clarkson University. April 14, 2007. Archived from the original on 2008-04-22. Retrieved 2013-05-13.