Jump to content

డైక్లోరిన్ ట్రైఆక్సైడ్

వికీపీడియా నుండి
డైక్లోరిన్ ట్రైఆక్సైడ్[1]
పేర్లు
IUPAC నామము
dichlorine trioxide
ఇతర పేర్లు
chlorine trioxide
chlorine chlorate
chlorine(I,V) oxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [17496-59-2]
పబ్ కెమ్ 167661
SMILES ClOCl(=O)=O
ధర్మములు
Cl2O3
మోలార్ ద్రవ్యరాశి 118.903 g/mol
స్వరూపం dark brown solid
ద్రవీభవన స్థానం explodes below 0 °C
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ అనునది ఒక క్లోరిన్ సమ్మేళనం, రెండు క్లోరిన్ పరమాణువులు,మూడు ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన ఏర్పడు అకర్బన సంయోగపదార్థం.ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేత పదం Cl2O3 డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ ముదురు/చిక్కని బ్రౌన్ రంగులో ఉండు ఘనపదార్థం.దీనిని మొదటి సారి 1967 సంవత్సరంలో కనుగొన్నారు.డై క్లోరిన్ ట్రైఆక్సైడ్ సంయోగ పదార్థం 0 °C కన్న తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా విస్పొటనం (explosive ) చెందు స్వభావాన్ని,లక్షణాన్ని కలిగి ఉన్నది.[2] డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ యొక్క అణుభారం 118.903 గ్రాములు/మోల్.

డైక్లోరిన్‌హెక్సాక్సైడ్(Cl2O6),క్లోరిన్(Cl2) మరియుఆక్సిజన్(O2)లను తక్కువ ఉష్ణోగ్రత వద్ద కాంతివిశ్లేషణం ప్రకాశ విశ్లేషణ(photolysis)చెయ్యడం వలన డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ సంయోగపదార్థం ఏర్పడును. ఈ రసాయన సంయోగ పదార్థం యొక్క అణుసౌష్టవం OCl-ClO2 వలె ఉండునని విశ్వసించడమైనది[3] .డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ యొక్క ఐసొమర్ Cl-O-ClO2 అయ్యిండే అవకాశం కలదు.ఈ ఐసొమర్ ,సిద్దాంతరీత్యా క్లోరస్ ఆమ్లం యొక్క నిర్జలస్థితి.

మూలాలు

[మార్చు]
  1. Lide, David R. (1998). Handbook of Chemistry and Physics (87 ed.). Boca Raton, FL: CRC Press. pp. 4–51. ISBN 0-8493-0594-2.
  2. N. N. Greenwood and A. Earnshaw, (1997). Chemistry of the Elements. Butterworth-Heinemann. ISBN 978-0750633659.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
  3. Egon Wiberg, Arnold Frederick Holleman (2001) Inorganic Chemistry, Elsevier ISBN 0-12-352651-5