Jump to content

డైసీ షా

వికీపీడియా నుండి
డైసీ షా
2020లో డైసీ షా
జననం (1984-08-25) 1984 ఆగస్టు 25 (వయసు 40)
వృత్తి
  • నటి
  • మోడల్
  • డ్యాన్సర్
  • కొరియోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు2003 – ప్రస్తుతం

డైసీ షా (జననం 1984 ఆగస్టు 25) భారతీయ నటి, మోడల్, నృత్యకారిణి. ప్రధానంగా ఆమె హిందీ, కన్నడ చిత్రాలలో నటిస్తుంది. ఆమె కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద సహాయకురాలిగా పనిచేసింది. డ్యాన్సర్‌ నుండి నటిగా మారిన తను 2011లో విడుదలైన కన్నడ సినిమా భద్రలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత 2014లో హిందీ చిత్రం జై హోలో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. హిందీ, కన్నడ భాషా చిత్రాలతో పాటు డైసీ షా తమిళం, మరాఠి, గుజరాతీ చిత్రాల్లోనూ నటించింది.[1]

బాల్యం, విద్య

[మార్చు]

మహారాష్ట్రలోని ముంబైలో గుజరాతీ కుటుంబంలో డైసీ షా పుట్టి పెరిగింది. ఆమె 10వ తరగతి చదువుతున్నప్పుడు స్థానిక మాల్‌లో జరిగిన ఎంఎస్ డోంబివిలి పోటీలో మిస్ ఫోటోజెనిక్ అవార్డును గెలుచుకుంది. ఆమె ముంబైలోని ఖల్సా కాలేజీ నుంచి ఆర్ట్స్ డిగ్రీని పొందింది.[2]

కెరీర్

[మార్చు]

డైసీ షా జమీన్ (2003), ఖాకీ (2004) వంటి చిత్రాలలో కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యకు అసిస్టెంట్‌గా పనిచేసింది.[3] ఆ తరువాత మోడలింగ్, ఫోటో షూట్‌లు, ప్రింట్ యాడ్స్ చేయడం ప్రారంభించింది. చింగారి సినిమా కోసం కన్నడ దర్శకుడు హర్ష ఆమెను సంప్రదించాడు. కన్నడ వెర్షన్ బాడీగార్డ్‌లో అమ్ముగా నటించింది. ఆ తర్వాత ఆమె కన్నడ చిత్రం బచ్చన్, హిందీ చిత్రం బ్లడీ ఇస్ష్క్‌లో రెండు ఐటెం సాంగ్స్ చేసింది. సన్నీ డియోల్, టబు నటించిన హిందీ చిత్రం ఖుదా కసమ్‌లో ఆమె ఐటెం సాంగ్ ("నీలి లుగాడి") కూడా చేసింది. 2014లో ఆమె వాణిజ్యపరంగా విజయవంతమైన జై హోలో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఆమె 2018 చిత్రం రేస్ 3 (2018)లో సంజన పాత్రను పోషించి మెప్పించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Title Role Language Notes
2007 పోరి తమిళం
2009 మలై మలై తమిళం స్పెషల్ అప్పియరెన్స్
2010 వందే మాతరం మలయాళం/తమిళం స్పెషల్ అప్పియరెన్స్
ఖుదా కసమ్ హిందీ పాట: "నీలి లుగాడి"
2011 భద్ర కన్నడ
బాడీగార్డ్
2013 గజేంద్ర
బ్లడీ ఇస్ష్క్ హిందీ స్పెషల్ అప్పియరెన్స్
బచ్చన్ కన్నడ పాట: "మైసూర్ పాకల్లి"
2014 జై హో హిందీ
స్పార్క్ హిందీ పాట: "మేరీ జవానీ సోడే కి బోటల్"
అక్రమణ కన్నడ
2015 హేట్ స్టోరీ 3 హిందీ
2017 రామరతన్ హిందీ
2018 రేస్ 3 హిందీ
2019 గుజరాత్ 11 గుజరాతీ గుజరాతీ సినిమాలో అరంగేట్రం
2022 దగ్డీ చాల్ 2 మరాఠీ "రఘు పింజ్రియాత్ ఆలా" పాటలో స్పెషల్ అప్పియరెన్స్
మిస్ట్రీ ఆఫ్ టాటూ TBA హిందీ

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
Year Award Category Work Result Ref
2015 బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్ అత్యంత వినోదాత్మక చిత్రం - స్త్రీ జై హో నామినేటెడ్ [4][5]
2021 ఫిలింఫేర్ అవార్డ్స్ - తూర్పు యాక్ట్రెస్ విత్ ఎ కాజ్ విజేత [6]

మూలాలు

[మార్చు]
  1. "Daisy Shah: అసలే ఫిట్ బాడీ.. డైసీ బీచ్‌లో పోజులు! Daisy Shah latest photo collection". web.archive.org. 2023-01-07. Archived from the original on 2023-01-07. Retrieved 2023-01-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Britto, Anita (19 January 2014). "I am working with my first crush: Daisy Shah". Mid Day. Retrieved 15 June 2016.
  3. "Bigg Boss contestant Sana to star opposite Salman Khan?". Hindustan Times (in ఇంగ్లీష్). 16 March 2013. Retrieved 17 April 2021.
  4. "BIG STAR Entertainment Awards 2014 Winners List". Pinkvilla.com. 18 December 2014. Archived from the original on 19 డిసెంబరు 2014. Retrieved 25 December 2014.
  5. "Winners of Big Star Entertainment Awards 2014". Indicine.com. 19 December 2014. Archived from the original on 9 January 2019. Retrieved 25 December 2014.
  6. "Filmfare Awards East (2021)". IMDB.
"https://te.wikipedia.org/w/index.php?title=డైసీ_షా&oldid=3849123" నుండి వెలికితీశారు