డొనాల్డ్ నూత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డొనాల్డ్ ఎర్విన్ నుత్
అక్టోబర్ 25, 2005 ఓపెన్ కాంటెంట్ అలయన్స్ రిసెప్షన్ వద్ద డొనాల్డ్ నుత్
జననం (1938-01-10) 1938 జనవరి 10 (వయసు 86)
మిల్వౌకీ, విస్కిన్సన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
నివాసంఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
జాతీయతఅమెరికా సంయుక్త రాష్ట్రం పౌరుడు
రంగములుగణితం
కంప్యూటర్ సైన్స్
వృత్తిసంస్థలుస్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుకేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
పరిశోధనా సలహాదారుడు(లు)మార్షల్ హాల్ జూనియర్
డాక్టొరల్ విద్యార్థులులియోనిడాస్ జె. గుయిబాస్
మైకెల్ ఫ్రెడ్మాన్
స్కాట్ కిం
వాగం ప్రెట్
రాబర్ట్ సెడ్జ్విక్
జెఫ్రీ విట్టర్
ఆండ్రై బోర్డర్
బెర్నార్డ్ మార్సెల్ మాంట్ రేనాడ్
ప్రసిద్ధిది ఆర్ట్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్
టెక్స్, మెటాఫాంట్
నుత్ మోరిస్ ప్రాట్ అల్గారిథిం
నుత్ బెండిక్స్ కంప్లీషన్ అల్గారిథిం
మిమిక్స్
ముఖ్యమైన పురస్కారాలుట్యూరింగ్ అవార్డ్ (1974)
జాన్ వాన్ న్యూమాన్ మెడల్ (1995)
హార్వీ బహుమతి (1995)
క్యోటో బహుమతి (1996)

డొనాల్డ్ ఎర్విన్ నూత్ (/[invalid input: 'icon']kəˈnθ/[1] kə-NOOTH-'; జనవరి 10, 1938న జన్మించిన వీరు, కంప్యూటర్ శాస్త్రవేత్త, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విశ్రాంత ప్రొఫెసర్.[2]

ఇతను ది ఆర్ట్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనే కంప్యూటర్ శాస్త్ర పుస్తకాల యొక్క రచయత. ఈ పుస్తకాలను కంప్యూటర్ శాస్త్రంలో మైలురాళ్లగా భావిస్తారు.[3] ఇతన్ని అల్గారిథం విశ్లేషణ పితగా పిలుస్తారు. ఇతను అల్గారిథముల క్లిష్టతను కొలచే లోతైన విశ్లేషణా పద్ధతుల అభివృద్ధికి పాటుపడ్డాడు. ఇంకా అల్గారిథముల క్లిష్టతను కొలిచే గణిత పాటవాన్ని స్థిరీకరించాడు. ఈ క్రమంలో బిగ్ ఓ పద్ధతిని ప్రఖ్యాతం చేశాడు.

కంప్యూటర్ శాస్త్ర సిద్ధాంతంలోని చాలా శాఖలలో విశేషమైన కృషి చేయటంతో పాటు, నూత్ కంప్యూటర్ టైప్ సెట్టింగ్ అయిన టెక్స్, దానికి సంబంధించిన మెటాఫాంట్ లను, వాటిని ఉపయోగించి ఒక కంప్యూటర్ మోడర్న్ అనే ఖతి వ్యవస్థను రూపొందించాడు.

విద్వాంసునిగా, రచయతగా నూత్, [4] లిటరేట్ ప్రోగ్రామింగును ప్రఖ్యాతం చెయ్యడానికి వెబ్ అనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషను, మిక్స్ అనే కంప్యూటర్ హార్డ్ వేర్ వాస్తు సూచనలను రూపొందించారు.

తొలి జీవితం[మార్చు]

మిల్వౌకీ, విస్కిన్సిన్లో నూత్ జన్మించాడు. నూత్ నాన్నకు ముద్రణా వ్యాపారం ఉంది. ఇంకా నూత్ నాన్న మిల్కౌకీ లూథరన్ హై స్కూల్ లో బుక్ కీపింగ్ చెప్పాడు. ఇదే పాఠశాలలో నూత్ చేరాడు. పాఠశాలలో నూత్ వివధ బహుమతులు గెల్చుకున్నాడు. తన తెలివితేటలు అసాధారణంగా ఉపయోగించి బహుమతులు గెల్చుకునేవాడు. ఉదాహరణకు "Ziegler's Giant Bar" అనే పదాల్లోని అక్షరాలను ఉపయోగించి 4500 పదాలు పేర్చి ఎనిమిదవ తరగతిలో ఒక పోటీలో నెగ్గాడు. ఈ పోటీలో మరో విశేషం, న్యాయనిర్ణేతల వద్ద కేవలం 2500 పదాల చిట్టా మాత్రమే ఉంది. ఈ పోటీలో నెగ్గి పాఠశాలకు ఒక టెలీవిజన్, సహాధ్యాయులందరికీ ఒక కాండీ గెలుపొందాడు.[5]

చదువు సంధ్యలు[మార్చు]

కొద్దిగా క్లిష్టమైన నిర్ణయమైనా, నూత్ సంగీతం కాకుండా భౌతిక శాస్త్రాన్ని ప్రధాన విషయంగా కేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తీసుకున్నాడు. ఇంకా నూత్ థీటా చి ఫ్రెటర్నిటీ యొక్క బీటాను చాప్టర్ లో చేరాడు. ఈ కేస్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నప్పుడే నూత్ ఐబియం650 మెయిన్ ఫ్రేం తొలిసారిగా దర్శించాడు. ఈ కంప్యూటర్ సహాయపుటలు చదివిన తరువాత దాని అసెబ్లీ, కంపైలర్ కోడ్ లు ఆ కంప్యూటరుతో పాటు వచ్చిన వాటికన్నా తను బాగా వ్రాయగలనని నమ్మి, తిరిగి రాయాలని సంకల్పించుకున్నాడు.[6] 1958లో తన పాఠశాల బాస్కెట్ బాల్ ఆటగాళ్ల ఒక్కొక్కరి విలువ ఆధారంగా బాస్కెట్ బాల్ ఆటలో తన పాఠశాల గెలవడం కోసం ఒక ప్రోగ్రాం వ్రాశాడు. ఆ కాలంలో అది చాలా నవ్యమైన ఆలోచన. న్యూస్ వీక్ ప్రత్యేకమైన వ్యాసం ప్రచురించింది. వాల్టర్ క్రాన్కైట్ తన సిబియస్ సాయంత్రం వార్తలలో దాన్ని కవర్ చేశాడు.[6] ఇంజినీరంగ్, సైన్స్ రివ్యూ పత్రిక ప్రారంభ ఎడిటర్లలో నూత్ ఒకరు. ఈ పత్రిక అమెరికా దేశ ఉత్తమ సాంకేతిక పత్రిక అవార్డును 1959లో పొందింది.[7] ఆ తరువాత నూత్ భౌతిక శాస్త్రాన్నుండి గణితానికి మారాడు. 1960లో తన గ్రాడ్యుయేషన్ పట్టా, మాస్టర్ ఆప్ సైన్స్ డిగ్రీ కూడా పొందాడు.[6]

మార్షల్ హాల్ వద్ద 1963లో నూత్, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పీహెచ్ డీ పట్టా పుచ్చుకున్నాడు, [8] ఆ తరువాత అసోషిటేయ్ ప్రొఫెసర్ గా పని చెయ్యడం మొదలు పెట్టి, ఇంకా ది ఆర్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ పుస్తకాలు వ్రాయడం కూడా ఆరంభించారు. తొలుత కంపైలర్స్ గురించి పుస్తకం వ్రాయడానికి ఒప్పుకొని, ఆ తరువాత బహుళ పర్వాల పుస్తకంగా అది రూపొందించారు. మొదట ఒక పుస్తకం అనుకున్నాడు, తరువాత ఆరు పుస్తకాలుగా, ఆ తరువాత ఏడు పుస్తకాలుగా రూపొందించారు. 1968లో మొదటి పర్వం ప్రచురించాడు. అదే సంవత్సరం యన్ యస్ ఏలో వచ్చిన ఉద్యోగాన్ని కాదని స్టాన్ ఫర్డ్ వివిలో చేరాడు.

రచనలు[మార్చు]

ది ఆర్ట్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్[మార్చు]

ప్రోగ్రామింగు గురించి, అల్గారిథముల గురించి, వాటి విశ్లేషణ గురించి నూత్ వ్రాసిన ఏడు పర్వాల పరంపర ఈ ఆర్ట్ ఆఫ్ కంప్యూర్ ప్రోగ్రామింగ్. వీటిలోని అల్గారిధముల విశ్లేషణ, బిగ్ ఓ పద్ధతి స్టాండర్డ్ గా రూపొందాయి. 1976లో మూడు పర్వాలు ప్రచురించాక, ఆనాటి కంప్యూటరు ప్రచురణ పద్ధతులు, ముద్రణా పద్ధతులు నాణ్యంగా లేవు అని నూత్ వాటిని వృద్ధి పరచడానికి పరిశోధనా, వృద్ధి చేసి టెక్స్, మెటాఫాంట్ అనే పద్ధతులు అందించారు.[9]

ఇతర రచనలు[మార్చు]

ఇంకా సర్రియల్ నంబర్స్ అనే పుస్తకాన్ని కూడా రచించాడు.[10] ఇది ఒక గణిత నవలిక. జాన్ హార్టన్ కాన్వే యొక్క సమితి సిద్దాంతం ఆధారంగా వ్రాసింది. కేవలం విషయాన్ని వివరించడంతో సరిపెట్టకుండా ఈ పుస్తకంలో అసలు గణితం ఎలా వృద్ధి చెందిందో వివరించారు. ఈ పుస్తకాన్ని విద్యార్థుల్లో సృజనాత్మకతను, పరిశోధనను పెంపొందించడానికి ఉద్దేశించినది.

మత నమ్మకాలు, రచనలు[మార్చు]

కంప్యూటర్ సైన్స్ రచనలే కాకుండా, నూత్ ఒక లూతరేయన్.[11] నూత్ బైబిల్ పాఠ్యం ఇల్లుమినేటెడ్ అనే ఆంగ్ల పుస్తకాన్ని కూడా రచించాడు.[12] ఈ పుస్తకంలో బైబిల్ ను సిస్టమేటిక్ సాంప్లింగ్ పద్ధతి ద్వారా విశ్లేషించాడు. ప్రతి భాగంలోనూ మూడవ అధ్యాయం, 16వ వాక్యాన్ని విశ్లేషించాడు. ఇంకా ఈ పుస్తకం అందమైన కాలీగ్రాఫిక్ ఆర్ట్ కూడా కలిసి ఉంటుంది. ఈ కాలీగ్రాఫిక్ ఆర్ట్ ను హెర్మన్ జాప్ఫ్ ఆధ్వర్యంలోని బృందం తయారు చేసింది.

కలగూరగంప[మార్చు]

వేగుకు దూరంగా[మార్చు]

జనవరి1, 1990 న నూత్ ఇహ నుండి తన వేగులు చూడటం మానేశానని ప్రకటించాడు. తద్వారా తను చెయ్యవలసిన పనులపై మరింత సమయం వెచ్చించదల్చుకున్నాడు.[13]

ఆరోగ్య ఆందోళనలు[మార్చు]

2006వ సంవత్సరంలో నూత్ ప్రొస్టేట్ కాన్సర్ ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. డిసెంబర్ అదే సంవత్సరం ఆపరేషన్ చేశారు. ఇంకా కొద్ది మొత్తంలో రేడియేషన్ చికిత్స పాటించారు. కాన్సర్ వ్యాప్తి తక్కువ స్థాయిలోనే ఉంది.[14]

కంప్యూటర్ అంతరాలోనలు[మార్చు]

నూత్ స్టాండ్ ఫర్డ్ వివిలో సంవత్సరానికి కొన్ని పర్యాయములు అనధికార ఉపన్యాసాలు ఇచ్చారు. వీటిని ఇతను కంప్యూటర్ అంతరాలోచనలు అని పిలిచారు. బ్రిటన్ లోని ఆక్స్ పర్డ్ వివి కంప్యూటింగ్ లాబరేటరీలో విజిటింగ్ ప్రొఫసర్. ఆక్స్ ఫర్డ్ మాగ్దలీన్ కాలేజీలో గౌరవ ఫెలో.[15]

మూలాలు[మార్చు]

 1. Knuth, Don. "Knuth: Frequently Asked Questions". Don Knuth's home page. Stanford University. Archived from the original on 2008-03-06. Retrieved 2010-11-02. How do you pronounce your last name? Ka-NOOTH.
 2. Donald Knuth's Homepage at Stanford Archived 2004-07-14 at the Wayback Machine.
 3. The Art of Computer Programming Archived 2009-02-26 at the Wayback Machine (Stanford University).
 4. "Knuth's CV". Archived from the original on 2012-02-18. Retrieved 2012-02-21.
 5. Dennis Elliott Shasha; Cathy A. Lazere (1998). Out of their minds: the lives and discoveries of 15 great computer scientists. Springer. p. 90. ISBN 978-0-387-98269-4.
 6. 6.0 6.1 6.2 Thomas Koshy (2004). Discrete mathematics with applications. Academic Press. p. 244. ISBN 9780124211803. Retrieved 30 July 2011.
 7. "History of Beta Nu Chapter". Archived from the original on 2012-06-10. Retrieved 2012-02-26.
 8. Finite Semifields and Projective Planes – Donald Knuth's Ph.D. dissertation
 9. Knuth, Donald E. "The Art of Computer Programming (TAOCP)". Archived from the original on 2008-09-04. Retrieved 2011-11-04.
 10. Knuth, Donald (1974). Surreal numbers : how two ex-students turned on to pure mathematics and found total happiness : a mathematical novelette. Addison-Wesley. ISBN 978-0-201-03812-5.
 11. Love at First Byte Archived 2006-06-04 at the Wayback Machine. Stanford Magazine, May/June 2006.
 12. Knuth, Donald (1991). 3:16 : Bible texts illuminated. A-R Eds. ISBN 978-0-89579-252-5.
 13. Knuth, Donald Knuth versus Email Archived 2007-08-11 at the Wayback Machine last changed on 2005-09-23, Retrieved on 2008-12-29.
 14. Great Lives – Donald Knuth, Coping with cancer[permanent dead link].
 15. "Professor Donald Knuth". Magdalen College. Archived from the original on 2011-01-04. Retrieved 2010-12-06.

[[వర్గం: