డ్రీం థియేటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డ్రీం థియేటర్
Dream Theater
DreamTheater2011.jpg
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుమెజెస్టి (1985–86)
మూలంబోస్టన్, మసాచూసెట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
సంగీత శైలిప్రొగ్రెస్సివ్ మెటల్, ప్రొగ్రెస్సివ్ రాక్
క్రియాశీల కాలం1985–ప్రస్తుతమ్
లేబుళ్ళురోడ్ రన్నర్, వార్నర్ బ్రొస్, అట్లాంటిక్, ఎలెక్ట్రా, ఈస్ట్ వెస్ట్, అట్కొ
సంబంధిత చర్యలులిక్విడ్ టెన్షన్ ఎక్స్పెరిమెంట్, ఎక్స్ప్లోరర్స్ క్లబ్, ముల్ ముజ్జ్లర్, ఓఎస్ఐ, ప్లాటిపస్
వెబ్‌సైటుwww.dreamtheater.net
సభ్యులుజాన్ మ్యుంగ్
జాన్ పెట్రుచీ
జేమ్స్ లాబ్రీ
జొర్డాన్ రుదెస్స్
మైక్ మాంగినీ
పూర్వపు సభ్యులుమైక్ పొర్ట్నాయ్
కెవిన్ మూర్
క్రిస్ కాలిన్స్
చార్లీ డోమినిచి
డెరెక్ షేరినియన్

డ్రీం థియేటర్ (ఆంగ్లం: Dream Theater) అనేది ఒక అమెరికన్ ప్రొగ్రెస్సివ్ మెటల్/రాక్ బృందం. దీనిని జాన్ పెట్రుచీ, జాన్ మ్యుంగ్, మైక్ పొర్ట్నాయ్ 1985 లో బెర్క్లీ కాలేజ్ అఫ్ మ్యూజిక్, మసాచూసెట్స్లో చదువుతుండంగా మెజెస్టి అనె పీరుతొ ప్రారంభించారు. వాళ్ళు తరువాత చదువు నుంచి తప్పుకొని డ్రిం థియేటర్ కానున్న బ్యాండ్ పై దృష్టి పెట్టారు. ఈ బృందం యొక్క లైనప్ లో అనేక మార్పులు వచ్చినా ఈ ముగ్గురు వాస్తవ సభ్యులు మాత్రం విడిపోలేదు. కానీ సెప్టంబర్ 8 2010న జొర్డాన్ రుదెస్స్, జేమ్స్ లాబ్రీ బృందంలో ఉండగా పొర్ట్నాయ్ దీనిని వదిలి వెళ్ళిపోయారు. అక్టోబరు 2011 లో బృందం పోర్త్నోయ్ స్థానంలో ఒక డ్రమ్మర్ కోసం ఆడిషన్లు జరిపారు. మైక్ మాంగినీ 2011 ఏప్రిల్ 29న కొత్త శాశ్వత డ్రమ్మర్ గా ప్రకటించబడ్డారు.

బృందం దాని వాయిద్యకారుల సాంకేతిక నైపుణ్యానికి చాలా ప్రసిద్ధి చెందింది. వీరు సంగీత బోధన పత్రికల నుండి అనేక అవార్డులు గెలుచుకున్నారు. గిటారిస్ట్ జాన్ పెట్రుచ్చి G3 యాత్రలో మూడవ సంగీతకారుడిగా ఆరు సార్లు నామకరించబడ్డారు, ఇది ఏ ఇతర ఆహ్వానించబడిన సంగీతకారుడీ కన్నా మెరుగైనది.

చరిత్ర[మార్చు]

ఆరంభ సంవత్సరాలు(1985-1990)[మార్చు]

ఏర్పాటు[మార్చు]

[[బొమ్మ:Dream theater in 1985.jpg|framed|left|స్థాపక సభ్యులు (ఎడమ నుండి కుడివైపుకు) 1985 లో జాన్ మ్యుంగ్, మైక్ పొర్ట్నాయ్, జాన్ పెట్రుచీ]]

1985 లో బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్,మసాచుసేట్ట్స్ హాజరవుతున్న సమయంలో గిటారిస్ట్ జాన్ పెట్రుచ్చి, బాసిస్ట్ జాన్ మ్యుంగ్, డ్రమ్మర్ మైక్ పోర్త్నోయ్ ఒక బ్యాండ్ను ఏర్పాటు చెద్దామనే నిర్ణయాం పై డ్రీం ధియేటర్ స్థాపించబడింది.ఆ ముగ్గురూ బెర్క్లీ వద్ద ఉన్న అభ్యాసన గదులలో రష్, ఐరన్ మైడెన్ పాటలను ఆలపిస్తూ ప్రారంభించారు. మ్యుంగ్, పెట్రుచ్చి, పోర్త్నోయ్ తమ కొత్తగా ఏర్పడ్డ సమూహానికి మెజెస్టి అను పేరున ఏకమయ్యారు. "ది స్కోరు సో ఫార్ ..." డాక్యుమెంటరీ ప్రకారం, వారు బెర్క్లీ ప్రదర్శన కేంద్రం వద్ద రష్ కార్యక్రమం కోసం టికెట్లు వరుసలో నిలబడి వుండగా ఒక బూమ్ బాక్స్ లో ఆ బ్యాండ్ యొక్క పాటలు వింటున్నారు. ఆ సమయంలో పోర్త్నోయ్ "బాస్టిల్ డే" ( కేరెస్స్ ఆఫ్ స్టీల్ ఆల్బం నుండి) అనే పాట యొక్క ముగింపు "ఘనమైన" (majestic) విధంగా వ్యాఖ్యానించాడు. అప్పుడే మెజెస్టి బృందం పేరుగా ఉండాలని నిర్ణయించారు వారు.[1]

అప్పుడు ఆ ముగ్గురూ బృందంలో మిగతా స్థానాలను పూరించడానికి బయలుదేరారు. పెట్రుచ్చి తన పాఠశాల బ్యాండ్-సహచరుడు కెవిన్ మూర్ని కీబోర్డ్ వాయించమని కోరారు. అతను స్థానం అంగీకరించిన తరువాత తన ఇంటి వద్ద నుండి మరొక స్నేహితుడు క్రిస్ కాలిన్స్ ని బృందం సభ్యులు క్వీన్స్రిక్ యొక్క "క్వీన్ అఫ్ ది రీచ్" పాడుతుండగా విన్న తర్వాత, ప్రధాన గాయకుడిగా నియమించారు.[2] ఈ సమయంలో కళాశాలలో సంగీత్ం మరింత నేర్చుకొలేమని భావిస్తూ, పోర్త్నోయ్, పెట్రుచ్చి, మ్యుంగ్ యొక్క తీవ్రమైన షెడ్యూల్, వారి సంగీతం పై దృష్టి కారణంగా వారి అధ్యయనాలు విడిచిపెట్టవలసి వచ్చింది. మూర్ కూడా బృందం పై దృష్టి పెట్టేందుకు తన కళాశాల SUNY ఫ్రేడోనియాను విడిచిపెట్టాడు.

1986 యొక్క ప్రారంభ నెలలు న్యూయార్క్ నగర ప్రాంతం చుట్టుప్రక్కల అనేక కార్యక్రమాల తేదీలతో నిండిపోయాయి. ఈ సమయంలో బ్యాండ్ ది మెజెస్టి డేమోస్ పేరుతో ప్రదర్శనల యొక్క ఒక సేకరణను రికార్డ్ చేసింది. మొదటి అమలులో ఉన్న 1000 కపీలు 6 నెలల్లో అమ్ముడుపొయ్యాయ్ . ఈ క్యాసెట్ యొక్క డబ్బింగ్ కాపీలు ప్రోగ్రెస్సివ్ మెటల్ దృశ్యంలో ప్రజాదరణ చెందాయి. మైక్ పోర్త్నోయ్ యొక్క "YtseJam" రికార్డ్స్ ద్వారా అధికారికంగా CD విడుదల అయినప్పటికీ, మెజెస్టి డేమోస్ ఇప్పటికీ వాటి యొక్క అసలైన టేప్ ఫార్మాట్లో నేడు అందుబాటులో ఉన్నాయి. నవంబరు 1986 లో, కలిసి రాయడం, నిర్వహించిన కొన్ని నెలల తర్వాత, క్రిస్ కొల్లిన్స్ తొలగించబడ్డాడు. స్థానానికి భర్తీ ప్రయత్నిస్తున్న ఒక సంవత్సరం తరువాత, బృందంలో అందరికంటే చాలా పెద్ద అయిన, ఎక్కువ అనుభవం కలిగివున్న చార్లీ డోమినిచి విజయవంతంగా సమూహం కొరకు ఎంపిక చెయ్యబడ్డాడు. డోమినిచి నియామకం వలన మెజెస్టికి వచ్చిన స్థిరత్వంతో వారు న్యూయార్క్ నగర ప్రంతంలో ప్రదర్శనల సంఖ్యను పెంచటం ప్రారంభించారు, దీనితో గణనీయమైన స్పందన పొందారు. దోమినిచి నియామకం త్వరలోనే మెజెస్తి అనె పేరు కలిగిన ఒక లాస్ వేగాస్ సమూహం వారి పేరు యొక్క ఉపయోగానికి సంబంధించి మేధోసంపత్తి ఉల్లంఘన కోసం చట్టపరమైన చర్య తీసుకుంబ్టామని బెదిరిస్తే బ్యాండ్ ఒక కొత్త పేరును ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. వివిధ అవకాశాలను ప్రతిపాదించి పరీక్షించారు, వాటిలో గ్లాస్సర్, మాగస్, M1 కొన్ని, కాని అన్ని తిరస్కరించబడ్డాయి. చివరికి, పోర్త్నోయ్ తండ్రి డ్రీం ధియేటర్ అనే పేరు సూచించారు, ఇది అతను మోంటిరే, కాలిఫోర్నియాలోని నడిపిన ఒక చిన్న థియేటర్ యొక్క పేరు. ఇది అందరికీ నచ్చగా దీనితోనె కొనసాగారు.

వెన్ డ్రిం అండ్ డే యునైట్[మార్చు]

వారి కొత్త పేరు, బ్యాండ్ స్థిరత్వంతో డ్రీం ధియేటర్ న్యూయార్క్, పొరుగు రాష్ట్రాల్లో మరిన్ని ఎక్కువ ప్రదర్శనలు చేస్తూ అదే సమయంలో కొత్త సంగీత రచనలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంగా MCA యొక్క విభాగం మెకానిక్ రికార్డ్స్ యొక్క దృష్టిని ఆకర్షించింది. డ్రీం థియేటర్ 1988 జూన్ 23న మెకానిక్ తో తమ మొదటి రికార్డు ఒప్పందం కుదుర్చుకొని వారి తొలి ఆల్బం రికార్డ్ చెయ్యడం ప్రారంభించింది. బృందం ఆల్బాన్ని గ్లదివ్నే, పెన్సిల్వేనియాలో కజెం విక్టరీ స్టూడియోస్ లో రికార్డ్ చేశారు. ప్రాథమిక పాటల రికార్డింగులు 10 రోజులు పట్టాయి, ఆల్బము మొత్తము అవ్వడానికి మూడు వారాలు పట్టింది.

1985లో వెన్ డ్రిం అండ్ డే యునైట్ విడుదల అయినప్పుడు, బృంద సభ్యులు ఊహించినత ఘనస్వాగతము రాలేదు. మెకానిక్ వారు తమ ఒప్పందం సంతకం చెయ్యక ముందు డ్రీం ధియేటర్ కి చేసిన చాలా ఆర్థిక వాగ్దానాలు ఉల్లంఘించారు, కాబట్టి బ్యాండ్ న్యూ యార్క్ సిటీ చుట్టూ ప్రదేశాలలోనే వాళ్ళ కర్యక్రమాలను పరిమితం చేయ్యవలసి వచ్చింది.

సంగీత శైలి[మార్చు]

"ఆల్ మ్యుసిక్" యొక్క స్టీఫెన్ థామస్ ఎర్లెవైన్ ఒక "ప్రోగ్రెసివ్ రాక్, పోస్ట్-హలేన్ మెటల్ యొక్క సంక్లిష్టమైన మిశ్రమం"గా డ్రీం ధియేటర్ యొక్క సంగీతాన్ని వివరించారు. బ్యాండ్ ప్రోగ్రెసివ్ మెటల్ కళా ప్రక్రియ యొక్క ప్రారంభ మూలపురుషులలో ఒకరుగా పేరు కెక్కింది. బృంద నిర్మాణ సభ్యులు జాన్ పెట్రుచ్చి, జాన్ మ్యుంగ్ల సంగీత శైలిలో, రష్, యెస్, పింక్ ఫ్లాయిడ్ వంటి ప్రోగ్రెసివ్ రాక్ బ్యాండ్ల నుంచి, ఐరన్ మైడెన్, జుడాస్ ప్రీస్ట్ వంటి హెవీ మెటల్ బ్యాండ్లనుంచి, వివిధ స్పీడ్ మెటల్ బ్యాండ్లు, ఆ రోజుల్లో ప్రసిద్ధి కలిగిన గ్లాం మెటల్ నుండి బలమైన ప్రభావాలు కలిగి ఉన్నాయి.

బృంద సభ్యులు[మార్చు]

కాలక్రమం[మార్చు]

సంగీత జాబితా[మార్చు]

Studio albums

మూలాలు[మార్చు]

  1. This was referenced in the documentary "The Score so Far", on the second disc of the స్కోర్ DVD.
  2. పొర్ట్నాయ్, మైక్ (2003). "ది మెజెస్టి డెమోస్ 1985-1986" [CD Liner Notes]. New York: Ytsejam Records.

బయటి లంకెలు[మార్చు]