Jump to content

తంజావూర్ కె.పి.శివానందం

వికీపీడియా నుండి
తంజావూర్ కె.పి.శివానందం
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంతంజావూర్ కె.పి.శివానందం
జననం(1917-03-01)1917 మార్చి 1
మరణం2003 జూలై 30(2003-07-30) (వయసు 86)
చెన్నై, భారతదేశం
వృత్తివైణికుడు

తంజావూర్ కె.పి.శివానందం(1917-2003) ఒక కర్ణాటక సంగీత వైణికుడు[1].

విశేషాలు

[మార్చు]

ఇతడు 1917, మార్చి 1న ఒక సంగీతకారుల కుటుంబంలో జన్మించాడు[2] ఇతడు తంజావూరు సంగీత చతుష్టయంగా పేరుపొందిన చిన్నయ్య, పొన్నయ్య, శివానందం, వడివేలుల ఏడవ తరానికి చెందిన విద్వాంసుడు. ఇతడు తొలుత తన తండ్రి తంజావూర్ పొన్నయ్య పిళ్ళై వద్ద, పందనల్లూర్ మీనాక్షిసుందరం పిళ్ళైల వద్ద సంగీతం, భరతనాట్యం నేర్చుకున్నాడు. తరువాత ఇతడు గోమతి శంకర అయ్యర్, దేశమంగళం సుబ్రహ్మణ్య అయ్యర్‌ల వద్ద వీణావాదనలో శిక్షణ తీసుకున్నాడు. ఇతడు వీణ గురువుగా అనేక సంగీత కళాశాలలలో పనిచేశాడు. శ్రీలంకలోని ఒక సంగీతకళాశాలకు ప్రిన్సిపాల్‌గా కూడా సేవలను అందించాడు. అన్నామలై విశ్వవిద్యాలయం లలితకళల విభాగానికి డీన్‌గా పనిచేసి 1992లో పదవీ విరమణ చేశాడు. ఇతడు అనేక పుస్తకాలను ప్రచురించాడు. సి.డి.లను విడుదల చేశాడు. మరుగున పడివున్న అనేక పదాలను, కీర్తనలను, రాగమాలికలను, జావళులను పరిష్కరించి వెలుగులోకి తీసుకువచ్చాడు.

ఇతడు తన రెండవ భార్య శారదా శివానందంతో కలిసి జంటగా అనేక కచేరీలు చేశాడు.[3]

ఇతడు సంగీతరంగంలో చేసిన కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. అన్నామలై విశ్వవిద్యాలయం ఇతనికి వీణలో "సంగీత విభూషణ" బిరుదును ప్రదానం చేసింది. "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" ఇతడిని కళైమామణి పురస్కారంతో సత్కరించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1980లో అవార్డును ప్రకటించింది. మద్రాసు సంగీత అకాడమీ ఇతడిని సంగీత కళానిధి పురస్కారంతో గౌరవించింది. శ్రీకృష్ణ గానసభ నుండి "సంగీత చూడామణి" బిరుదును పొందాడు.

ఇతడు 2003, జూలై 30వ తేదీన తన 86వ యేట చెన్నైలో మరణించాడు.[2],[4] ఇతనికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. web master. "Tanajavur K.P. Sivanandam". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 26 March 2021.[permanent dead link]
  2. 2.0 2.1 web master. "Tanjore K. P. Sivanandam Birthdays & Anniversaries". srutimag.blogspot.com/2018/03/tanjore-k-p-sivanandam.html. Sruti Magazine. Retrieved 26 March 2021.
  3. లలితా సుబ్రహ్మణ్యన్. "My Guru". రసికప్రియ. Rasigapriya School of Music. Retrieved 26 March 2021.
  4. web master. "Veena vidwan K.P. Sivanandam passes away". KutcheriBuzz. Retrieved 26 March 2021.