తంజీమ్ హసన్ సాకిబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తంజీమ్ హసన్ సాకిబ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2002-10-20) 2002 అక్టోబరు 20 (వయసు 21)
సిల్హెట్, బంగ్లాదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 145)2023 సెప్టెంబరు 15 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2021–presentSylhet Division
2023-presentSylhet Strikers (స్క్వాడ్ నం. 9)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 1 7
చేసిన పరుగులు 14 44 60
బ్యాటింగు సగటు 14 22.00 10.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 14 33 17
వేసిన బంతులు 47 138 366
వికెట్లు 2 2 11
బౌలింగు సగటు 16.00 43.50 24.27
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/32 2/63 4/36
క్యాచ్‌లు/స్టంపింగులు –/– 1/– 3/–
మూలం: Cricinfo, 21 July 2021

తంజీమ్ హసన్ సాకిబ్ (జననం 2002 అక్టోబరు 20) బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు. [1] అతను 2019 మార్చి 27 న 2018–19 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో బంగ్లాదేశ్ క్రీడా శిఖా ప్రొతిష్ఠాన్ తరపున లిస్ట్ A రంగప్రవేశం చేశాడు [2] 2019 డిసెంబరులో 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. [3] అతను 2020–21 నేషనల్ క్రికెట్ లీగ్‌లో సిల్హెట్ డివిజన్ తరఫున 2021 మార్చి 29 న తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ ఆడాడు. [4] 2021 ఢాకా ప్రీమియర్ డివిజన్ ట్వంటీ20 క్రికెట్ లీగ్‌లో అబాహానీ లిమిటెడ్ తరపున 2021 జూన్ 5 న ట్వంటీ20ల్లో ప్రవేశించాడు.[5]

2021 డిసెంబరులో అతను వెస్టిండీస్‌లో జరిగిన 2022 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. [6] ఆ తర్వాత 2023 ఆసియా కప్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపికయ్యాడు. 2023 ఆసియా కప్‌లో భారత్‌పై 2023 సెప్టెంబరు 15 న వన్‌డేల్లో అడుగుపెట్టాడు.[7]

జీవితం తొలి దశలో[మార్చు]

తంజీమ్ హసన్ 2022 అక్టోబరు 20 న సిల్హెట్‌లోని బాలగంజ్ ఉపజిల్లాలోని తిలకన్‌పూర్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి గౌచ్ అలీ, తల్లి సెలీనా బేగం. అతను ఆదిత్యపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బాలగంజ్ నుండి PEC పరీక్షలో టాలెంట్‌పూల్ స్కాలర్‌షిప్ పొందాడు. ఆ తర్వాత బాలగంజ్ ప్రభుత్వ డీఎన్ మోడల్ హైస్కూల్‌లో చేరాడు. [8]

వివాదం[మార్చు]

2023 సెప్టెంబరులో, తంజీమ్ ఫేస్‌బుక్‌లో మహిళల పట్ల ద్వేషపూరిత పోస్ట్‌లు పెట్టినందుకు గాను, అతనిపై విస్తృతంగా విమర్శలొచ్చాయి.[9] [10] [11] [12] [13]

మూలాలు[మార్చు]

  1. "Tanzim Hasan Sakib". ESPN Cricinfo. Retrieved 27 March 2019.
  2. "34th Match, Dhaka Premier Division Cricket League at Fatullah, Mar 27 2019". ESPN Cricinfo. Retrieved 27 March 2019.
  3. "Media Release : ICC U19 CWC South Africa 2020 : Bangladesh Under 19 Team Announced". Bangladesh Cricket Board. Retrieved 21 December 2019.
  4. "Tier 1, Cox's Bazar, Mar 29 - Apr 1 2021, National Cricket League". ESPN Cricinfo. Retrieved 29 March 2021.
  5. "17th Match, Dhaka, Jun 5 2021, Dhaka Premier Division Twenty20 Cricket League". ESPN Cricinfo. Retrieved 5 June 2021.
  6. "Bangladesh announce squad for U19 Asia Cup 2021 and U19 WC 2022". The Business Standard. Retrieved 7 December 2021.
  7. "অভিষেক ম্যাচের দ্বিতীয় বলেই তানজিমের সাফল্য". Jugantor (in ఇంగ్లీష్). Retrieved 2023-09-17.
  8. "নিজ শহর সিলেটে সিক্ত হলেন সাকিব". মানবজমিন. Retrieved 2023-09-19.
  9. AFP (2023-09-18). "Pacer Tanzim Hasan under fire over misogynist remarks". Prothomalo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-18.
  10. "Bangladeshi bowler Tanzim Hasan Sakib under fire over misogynist remarks". Arab News (in ఇంగ్లీష్). 2023-09-18. Retrieved 2023-09-18.
  11. "তানজিম সাকিবের পোস্ট আইসিসির নীতির সঙ্গে সাংঘর্ষিক". RTV Online (in ఇంగ్లీష్). Retrieved 2023-09-18.
  12. "তানজিম সাকিবের পুরনো ফেসবুক পোস্ট ভাইরাল". dbcnews.tv (in ఇంగ్లీష్). Retrieved 2023-09-18.
  13. Prabhu, Anuj Nitin (2023-09-18). "Bangladesh's Tanzim Hasan Sakib in deep trouble for his offensive comments on women". www.sportskeeda.com (in Indian English). Retrieved 2023-09-18.