తందట్టి
Appearance
తందట్టి | |
---|---|
దర్శకత్వం | రామ్ సంగయ్య |
రచన | రామ్ సంగయ్య |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మహేష్ ముత్తుస్వామి |
కూర్పు | శివానందీశ్వరం |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ | ప్రిన్స్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 23 జూన్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తమిళ్ |
తందట్టి 2023లో తమిళంలో విడుదలైన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్, వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకు రామ్ సంగయ్య దర్శకత్వం వహించాడు. పశుపతి రామస్వామి, రోహిణి, వివేక్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 23న థియేటర్లలో విడుదలై[1], జులై 14 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తమిళ్, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3][4]
కథ
[మార్చు]పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసే వీరసుబ్రమణియన్ (పశుపతి) పది రోజుల్లో రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సెల్వరాజ్ బామ్మ (రోహిణీ) కనిపించకుండా పోతుంది. ఆమెను వెతికి పట్టుకునే బాధ్యతను వీర సుబ్రమణియన్‌కు అప్పగిస్తారు. ఈక్రమంలో కానిస్టేబుల్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అతను బామ్మను కనిపెట్టాడా ? లేదా? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- పశుపతి రామస్వామి
- రోహిణి
- వివేక్ ప్రసన్న
- అమ్ము అభిరామి
- పూవిత
- దీపా శంకర్
- జానకి
- సెమ్మలర్ అన్నం
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
- నిర్మాత: ఎస్. లక్ష్మణ్ కుమార్, వెంకటేష్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ సంగయ్య
- సంగీతం: కె.ఎస్ సుందరమూర్తి
- సినిమాటోగ్రఫీ: మహేష్ ముత్తుస్వామి
- ఆర్ట్ డైరెక్టర్: వీరమణి గణేశన్
మూలాలు
[మార్చు]- ↑ "Thandatti gets a release date". Cinema Express (in ఇంగ్లీష్). Archived from the original on 25 May 2023. Retrieved 18 June 2023.
- ↑ "Pasupathi and Abirami starrer 'Thandatti' set for its OTT premiere". The Times of India. 12 July 2023. Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
- ↑ Eenadu (11 July 2023). "ఓటీటీలో 'తందట్టి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
- ↑ Namasthe Telangana (12 July 2023). "ఓటీటీలోకి రీసెంట్ తమిళ్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.