Jump to content

తకిట తదిమి తకిట తదిమి తందాన

వికీపీడియా నుండి

తకిట తదిమి తకిట తదిమి తందాన అనే ఈ పాట 1983లో విడుదలైన సాగర సంగమం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రచయిత వేటూరి సుందరరామ్మూర్తి కలం నుండి జాలువారింది. దీనిని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేయగా ఇళయరాజా స్వరపరచారు. దీనిలో కమలహాసన్ అద్భుతంగా తన నృత్యంతో అలరించారు. దీనికి దర్శకత్వం కె. విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు.

పాట నేపథ్యం

[మార్చు]

బాలకృష్ణ (కమల్) కు తోడుగా నిలచిన మాధవి (జయప్రద) పై అతనికి ప్రేమ మొదలౌతుంది కాని మాధవికి చిన్నప్పుడే పెళ్ళవుతుంది. ఆమె భర్త తిరిగి వస్తాడు. దాంతో బాలకృష్ణ దాదాపు దేశదిమ్మరి, తాగుబోతు అవుతాడు. మాధవి కూతురు (శైలజ)కు బాలకృష్ణ గురువౌతాడు. నాట్యకళ గొప్పతనం గురించి ఆమెకు తెలియజేస్తాడు. ఆపై ఆమె నాట్య ప్రదర్శన పోటీలో ఆమె నర్తిస్తుంది. అప్పటికే బాలకృష్ణ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ విషయం తెలుసుకున్న మాధవి అతడిని చూడడానికి వస్తుంది. ఆ సందర్భంలో ఈ పాతను కథానాయకుడు బావి మీద వేసిన సన్నటి కర్ర మీద నాట్యం చేస్తున్నట్లుగా చిత్రీకరించారు. పాటలో మధ్యలో మాధవి నుదుటి మీద కుంకుమబొట్టు వర్షానికి తడిసికారిపోతుండగా చూసిన బాలకృష్ణ అది కరగకుండా తన చేయి అడ్డు పెడతాడు. తద్వారా మాధవి వైవాహిక జీవితానికి ఎటువంటి సమస్యలు రాకూడదని బాలకృష్ణ మనోవేదనను తెలియజేస్తుంది. ఇది దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ ప్రతిభకు ఒక నిదర్శనం. అలాగే కమల్ హసన్ నృత్య విన్యాసాలు చూపరులను బాగా అలరిస్తాయి.

పాటలోని సాహిత్యం

[మార్చు]

పల్లవి

తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన ||తకిట||
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన || తడబడు||
శృతిని లయని ఒకటి చేసి
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన||తకిట||

మూలాలు

[మార్చు]
  1. యూట్యూబ్ లో పాట వీడియో