తక్కెళ్ళపాడు (జగ్గయ్యపేట)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తక్కెలపాడు (జగ్గయ్యపేట)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం జగ్గయ్యపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,852
 - పురుషుల సంఖ్య 903
 - స్త్రీల సంఖ్య 949
 - గృహాల సంఖ్య 524
పిన్ కోడ్ 521 175
ఎస్.టి.డి కోడ్ 08654

తక్కెలపాడు, కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 175. యస్.ట్.డీ కోడ్=08654.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం పాలేటి నదీ తీరాన ఉన్నది.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో బలుసుపాడు, గండ్రాయి, దేచుపాలెం, జగ్గయ్యపేట, అన్నవరం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

కోదాడ, నేలకొండపల్లి, వత్సవాయి, చిలుకూరు (నల్గొండ జిల్లా)

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

జగ్గయ్యపేట నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. విజయవాడ రైల్వేస్టేషన్ 84.కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

నారాయణ హైస్కూల్, క్రిష్ణవేణి హైస్కూల్, విజ్నాన్ హైస్కూల్, జగ్గయ్యపేట.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

తక్కెళ్ళపాడు గ్రామ సమీపంలోని పాలేటినది నుండి కాచవరం కెనాల్‌కు నీటిని విడుదలచేయుదురు. [2]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం[మార్చు]

ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, శ్రీ లక్ష్మణ సమేత సీతారామాంజనేయస్వామివారల విగ్రహ ప్రతిష్ఠ మరియు జీవ ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,ఆగష్టు-12వతేదీ శనివారంనాడు ప్రారంభమైనవి. ఈ సందర్భంగా, ఆలయ ప్రాంగణంలో, పుణ్యాహవచనం, హోమాలు నిర్వహించినారు. జీవధ్వజస్థంభాన్ని, సమీపంలో ఉన్న పాలేటినదికి తీసికొని వెళ్ళి, పుణ్యస్నానాలు చేయించినారు. అనంతరం గ్రామంలో ఊరేగించుచూ ఆలయానికి తీసికొని వచ్చినారు. 13వతేదీ ఆదివారం ఉదయం, వేదమంత్రోచ్ఛారణల మధ్య, యంత్రప్రతిష్ఠ, అనంతరం లక్ష్మణ సమేత శ్రీ సీతా రామాంజనేయస్వామివారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించినారు. పిమ్మట, జీవధ్వజస్థంభాన్ని, ఆలయం ఎదురుగా, వేలాదిమంది భక్తుల సమక్షంలో ప్రతిష్ఠించినారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, చుట్టుప్రక్కల గ్రామాలయిన గరికపాడు, రామచంద్రునిపేట, అనుమంచిపల్లి, కాచవరం, అప్పల నర్సాపురం గ్రామాల నుండి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చినారు. గ్రామస్థుల ఆధ్చ్వర్యంలో, విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. ఈ ప్రతిష్ఠా మహోత్సవాలను చూసి తరించడానికి గ్రామానికి విచ్చేసిన బంధుమిత్రుల రాకతో, గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొన్నది. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామములో శ్రీమతి నక్రీ అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. 2017,మే-21న నిర్వహించిన వీరి 101వ జన్మదిన వేడుకలలో, శాసనసభ్యులు శ్రీరాం తాతయ్య పాల్గొని ఈమెను సత్కరించినారు. వీరి మనుమరాలు శ్రీమతి జటావత్ లలిత ఈ గ్రామ సర్పంచి గా పనిచేయుచున్నారు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,852 - పురుషుల సంఖ్య 903 - స్త్రీల సంఖ్య 949 - గృహాల సంఖ్య 524;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1896.[1] ఇందులోపురుషుల సంఖ్య 952, స్త్రీల సంఖ్య 944,గ్రామంలో నివాస గృహాలు 436 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 441 హెక్టారులు.

మూలాలు[మార్చు]

[2]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Takkellapadu". Retrieved 10 June 2016.  External link in |title= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,మే-22; 1వపేజీ. [2] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జులై-2; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,ఆగష్టు-13&14; 1వపేజీ.