Jump to content

తనుశ్రీ చక్రవర్తి

వికీపీడియా నుండి
తనుశ్రీ చక్రవర్తి
Tanusree smiling.
జననం1984, ఆగస్టు 6
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుప్రియదర్శిని
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2010-ప్రస్తుతం

తనుశ్రీ చక్రవర్తి (జననం 6 ఆగస్టు 1984) బెంగాలీ మోడల్, సినిమా, టివీ నటి.[1][2][3] జీ బంగ్లా ఛానల్‌లో సంపూర్ణ అనే అందం, జీవనశైలికి సంబంధించిన కార్యక్రమం నిర్వహించింది. తనుశ్రీ చక్రవర్తి 2021లో భారతీయ జనతా పార్టీలో చేరింది,[4][5] 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో శ్యాంపూర్ స్థానం నుండి పోటీచేసి ఓడిపోయింది.[6][7]

జననం, విద్య

[మార్చు]

తనుశ్రీ 1984, ఆగస్టు 6న పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది. కమలా బాలికల ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి, తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం పరిధిలోని బసంతీ దేవి కళాశాలలో పొలిటికల్ సైన్స్ పూర్తిచేసింది.[8]

కెరీర్

[మార్చు]

చదువు పూర్తయ్యాక మోడల్‌గా పనిచేసింది. అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది. ప్రాణ్ పౌడర్ స్పైస్ వాణిజ్య ప్రకటనలో నటించి ప్రసిద్ధి పొందింది.

2011లో వచ్చిన ఊరో చితి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.[8] బెడ్‌రూమ్ (2012), ఒబిషోప్తో నైటీ (2014), విండో కనెక్షన్స్ (2014), బునో హాన్ష్ (2014) మొదలైన బెంగాలీ సినిమాలలో నటించింది.

సినిమాలు

[మార్చు]
  • టానిక్ (2021)
  • నిర్బంధమేర్ జోరా ఖున్ (2020)
  • అంతర్ధాన్ (2020)
  • జాంబిస్తాన్ (2019)
  • హరనో ప్రాప్తి (2019)
  • గుమ్నామి (2019)
  • మైఖేల్ (2018)
  • చావ్లోచిత్రో సర్కస్ (2017)
  • సమంతరాల్ (2017)
  • దుర్గా సోహయ్ (2017)
  • కోల్కటే కొలంబస్ (2016)
  • చోరబలి (2016)
  • క్రాస్ కనెక్షన్ 2 (2015)
  • ఇచ్ఛేమోతిర్ గాప్పో (2015)
  • ఖాద్ (2014)
  • బునో హన్ష్ (2014)
  • విండో కనెక్షన్లు (2014)
  • ఒబిషోప్తో నైటీ (2014)
  • శూన్యో
  • బసంత ఉత్సవ్ (2013)
  • స్వభూమి (2013)
  • చోన్ (2012)
  • కయేక్తి మేయర్ గోల్పో (2012)
  • భలోబాసా ఆఫ్ రూట్ (2012)
  • బెడ్‌రూమ్ (2012)
  • ఉరో చితి (2011)
  • బొందు ఎసో తుమీ (2010)

రియాలిటీ షోలు

[మార్చు]
  • దీదీ నం. 1 (2010) జీ బంగ్లా
  • ఎబర్ జల్షా రాన్నాఘోర్ (2015) స్టార్ జల్షా

మూలాలు

[మార్చు]
  1. 2013 Times of India article—A fragrant autumn for Tanusree Chakraborty
  2. 2014 Times of India article—Men are moderately mad about me: Tanusree Chakraborty
  3. 2014 Times of India article—I was inspired by Shah Rukh Khan in Happy New Year: Tanusree Chakraborty
  4. "Bengali actor Tanusree Chakraborty joins BJP".
  5. "TMC candidate Madan Mitra celebrates Holi with BJP nominees on Hooghly river".
  6. "West Bengal Elections 2021: BJP Candidate Tanushree Chakraborty Campaigns in Shyampur Seat". News18. Retrieved 1 May 2021.
  7. "Shyampur Election Result 2021 LIVE: Shyampur MLA Election Result & Vote Share - Oneindia". www.oneindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-12-03. Retrieved 2022-03-07.
  8. 8.0 8.1 Sanyal, Supratim (12 August 2011). "Interview: Actress Tanusree Chakraborty On Bengali Films Uro Chithi, Bhalobasha Off Route E, Bedroom & her Tollywood Experience". Washington Bangla Radio on Internet. Archived from the original on 14 June 2012. Retrieved 2022-03-07.

బయటి లింకులు

[మార్చు]