Jump to content

వైఫల్యం

వికీపీడియా నుండి
(తప్పడము నుండి దారిమార్పు చెందింది)
ఫ్రాన్స్ లోని మోంట్ పర్నాస్సే వద్ద శిధిలావస్థలో రైలు (1895).

వైఫల్యమును ఆంగ్లంలో ఫెల్యూర్ అంటారు. వైఫల్యంను విఫలం, భంగం, విచ్చిత్తి, తప్పడం, అపజయం అని కూడా అంటారు. అనుకున్న పని లేదా బృహత్కార్యం యొక్క నిర్దిష్ట లక్ష్యంను పూర్తి చేయలేక పోతే దానిని వైఫల్యం అంటారు. వైఫల్యం చెందినప్పుడు పొందవలసిన ఫలితాన్ని కోల్పోతారు. వైఫల్యానికి వ్యతిరేకం విజయం.

వాణిజ్య వైఫల్యం

[మార్చు]

సాధారణంగా వాణిజ్య వైఫల్యం అర్థం వాణిజ్య సంస్థ లేదా కంపెనీ తన లక్ష్యాలను సాధించలేకపోవడం అంటే తన నిర్దిష్ట లక్ష్యాన్ని చేరలేక విఫలం చెందడం. వాణిజ్య సంస్థ నిర్దిష్ట లక్ష్యాలను చేరలేకపోవడం వలన డబ్బు కోల్పోవచ్చు.


ఉత్పత్తి వైఫల్యం

[మార్చు]

ఉత్పత్తి వైఫల్యం అనగా తయారైన ఉత్పత్తులను అమ్మడంలో వైఫల్యం చెందడం. ఒక సంస్థలో తయారైన వస్తువులతో వినియోదారులు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ సంస్థ యొక్క ఉత్పత్తులను కొనరు. అందువలన వస్తువు తయారు చేసే సామర్థ్యం ఉన్నా వాటిని అమ్ముకునే విషయంలో వైఫల్యం చెందుతారు. ఈ విధంగా తయారైన ఉత్పత్తులను అమ్ముకోలేకపోవడాన్ని ఉత్పత్తి వైఫల్యం అంటారు.


పరీక్షలు

[మార్చు]

వ్యక్తులు తమకు పెట్టిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడాన్ని విజయవంతం అవడం అంటారు. పరీక్షలో విజయం సాధించలేకపోవడాన్ని వైఫల్యం చెందడం లేదా ఫెయిల్ అవడం అంటారు.


ఇవి కూడా చూడండి

[మార్చు]

తప్పు

విజయం

బయటి లింకులు

[మార్చు]

[[::en:Failure]] [[::ar:فشل]] [[::de:Versagen]] [[::fr:Échec]] [[::it:Guasto]] [[::he:כישלון]] [[::ja:故障]] [[::pt:Fracasso]] [[::ksh:Lėtsche (Donn)]] [[::ru:Неудача]] [[::simple:Failure]] [[::tl:Pagkabigo]] [[::uk:Фейл]]

"https://te.wikipedia.org/w/index.php?title=వైఫల్యం&oldid=3850865" నుండి వెలికితీశారు