తమసోమా జ్యోతిర్గమయా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తమసోమా జ్యోతిర్గమయా
దర్శకత్వంబడుగు విజయ్ కుమార్
కథబడుగు విజయ్ కుమార్
నిర్మాతతడక రమేష్
తారాగణం
ఛాయాగ్రహణంశ్రావణ్ జి కుమార్
కూర్పుశ్రావణ్ జి కుమార్
సంగీతంమార్క్ కె ప్రశాంత్
నిర్మాణ
సంస్థ
విమల్ క్రియేషన్స్
పంపిణీదార్లుపద్మజ డిస్ట్రిబ్యూషన్
విడుదల తేదీ
29 అక్టోబరు 2021 (2021-10-29)
దేశం భారతదేశం
భాషతెలుగు

తమసోమా జ్యోతిర్గమయా 2021లో విడుదలైన తెలుగు సినిమా. గుణ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై తడక రమేష్ నిర్మించిన ఈ సినిమాకు బడుగు విజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు.[1] బేతి ఆనంద్‌ రాజ్‌, శ్రావణి శెట్టి, రోహిణి అరెట్టి, వేణు పొల్సాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021, అక్టోబరు 29న విడుదలయింది.[2]

చిత్ర నిర్మాణం

[మార్చు]

'తమసోమా జ్యోతిర్గమయ' సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు ఎన్ శంకర్ విడుదల చేయగా, ప్రచార చిత్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసింది.[3] ఈ సినిమా పోస్టర్ &ట్రైలర్‌ను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశాడు.[4]

నటీనటులు

[మార్చు]
  • బేతి ఆనంద్‌ రాజ్‌
  • శ్రావణి శెట్టి
  • వేణు పోల్సాని
  • రోహిణి అరెట్టి
  • రామకృష్ణ ఆర్
  • జనార్దన్ వి
  • సుధాకర్ రెడ్డి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • సమర్పణ: గుణ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • బ్యానర్: విమల్ క్రియేషన్స్
  • నిర్మాత: తడక రమేష్[5]
  • కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ఆర్ట్, దర్శకత్వం: బడుగు విజయ్ కుమార్
  • సంగీతం: మార్క్ కె ప్రశాంత్
  • సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: శ్రావణ్ జి కుమార్
  • సహా నిర్మాత: జాడి సాయి కార్తీక్ గౌడ్
  • పాటలు: పెద్దింటి అశోక్ కుమార్, ప్రశాంత్ బి.జె, సాయిచరణ్, తాళ్ళపాక అన్నమాచార్య

పాటలు

[మార్చు]

తమసోమా జ్యోతిర్గమయా సినిమాకు మార్క్ కె ప్రశాంత్ సంగీతనందించాడు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నువ్వొక్క చలనం"    3:39
2. "అయ్యాయో ఏమయో"    2:55

విడుదల, స్పందన

[మార్చు]

ఈ సినిమా 2021, అక్టోబరు 29న విడుదలయింది. ''తమసోమా జ్యోతిర్గమయ సినిమా చేనేత కళాకారులపై గౌరవాన్ని పెంచే చిత్రమని, కుమార్ పాత్రలో నటించిన ఆనంద్ రాజ్ అనుభవమున్న నటుడిగా పాత్రను నడిపించాడని, శ్రావణ్ తన కెమెరాతో చక్కటి విజువల్స్ ఇచ్చాడని, విజయ్ దర్శకత్వ ప్రతిభ, సంగీత దర్శకుడు ప్రశాంత్ అందించిన సంగీతం సినిమాకు బలాన్ని చేకూర్చింది'' అని ఈనాడు పత్రిక పేర్కొన్నది.[2]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (11 November 2020). "A love story where the heroes are weavers". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
  2. 2.0 2.1 "Movie review: 'తమసోమా జ్యోతిర్గమయ'- మరో 'మల్లేశం'గా నిలిచిందా?". ETV Bharat News. 2021-10-29. Archived from the original on 2021-10-29. Retrieved 2021-10-29.
  3. ETV Bharat News (26 December 2020). "సినిమాను విడుదల చేసిన మంత్రి సబితా". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
  4. Eenadu (14 October 2021). "నేత కార్మికుల జీవితకథ.. 'తమసోమా జ్యోతిర్గమయా'". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
  5. Telangana Today (8 December 2020). "'There is more to weavers than suicides and migrations'". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.

బయటి లింకులు

[మార్చు]