తరగని ఇంధన వనరుల దినోత్సవం
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తరగని ఇంధన వనరుల దినోత్సవంను ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ జయంతి అయిన ఆగస్టు 20 న జరుపుకుంటారు. బొగ్గు, ఇతర సహజ వనరులు వేగంగా తరిగిపోతున్న కారణంగా ఇంధన పొదుపుపై, సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతపై ఈ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉన్న బొగ్గు, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు సుదీర్ఘకాలం లభించవని భావించిన అప్పటి భారత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తరగని ఇంధన వనరుల అభివృద్ధికి, వినియోగానికి కృషి చేశారు. తరగని ఇంధన వనరుల అభివృద్ధికి కృషి చేసిన రాజీవ్ గాంధీని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 20 న తరగని ఇంధన వనరుల దినోత్సవమును జరుపుకుంటారు. ఈ దినోత్సవమును హిందీలో "రాజీవ్‌గాంధీ అక్షయ ఊర్జాదివస్" అని, ఆంగ్లంలో "రాజీవ్ గాంధీ రెన్యూవబుల్ ఎనర్జీ డే" అని అంటారు.