తర్సామీ సింగ్ సైనీ
Appearance
తర్సామీ సింగ్ సైనీ | |
---|---|
ఇతర పేర్లు | జానీ జీ తాజ్ గ్రూప్ స్టీరియో నేషన్ |
జననం | కోవెంట్రీ, వెస్ట్ మిడ్ ల్యాండ్స్, యునైటెడ్ కింగ్డమ్ | 1967 మే 23
మరణం | 29 ఏప్రిల్ 2022 (54 సంవత్సరాలు) |
వృత్తి | గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు |
క్రియాశీల కాలం | 1989–2022 |
వెబ్‌సైటు | http://stereonation.net/ |
తర్సామీ సింగ్ సైనీ భారతదేశానికి చెందిన గాయకుడు. ఆయన 1989లో 'హిట్ ది డెక్' ఆల్బమ్‌తో గాయకుడిగా అరంగ్రేటం చేశాడు. తాజ్ అనంతరం తుమ్ బిన్, కోయి మిల్ గయా, రేస్, బట్లా హౌజ్ సినిమాలో పాటలు పాడాడు.
తర్సామీ సింగ్ సైనీ 90వ దశకం హిట్ సాంగ్స్‌కు పేరుగాంచిన పాప్ బ్యాండ్ స్టీరియో నేషన్‌కు ప్రధాన గాయకుడు. ఆయన ప్యార్ హో గయా, నాచేంగే సారి రాత్, గల్లాన్ గోరియన్ వంటి 90వ దశకం హిట్ సాంగ్స్ తో సృష్టించాడు. తాజ్ ‘కోయి మిల్ గయా’తో పాటు ‘తుమ్ బిన్’ (2001), ‘రేస్’, ‘గెస్ట్ ఇన్ లండన్ (2017), ‘బాట్లా హౌస్’ (2019) సహా పలు సినిమాల్లో పాటలు పాడాడు.
ప్రైవేట్ ఆల్బమ్స్
[మార్చు]- హిట్ ది డెక్ (1989)
- ది రీమిక్స్ ఆల్బమ్ (1990)
- వైబ్స్ (1991)
- బ్యాక్ టు మై రూట్స్ (1992)
- నా నుండి మీ వరకు (1993)
- స్పిరిట్స్ ఆఫ్ రిథమ్ (1994)
- న్యూ డాన్ (1995)
- నేను వేచి ఉన్నాను (1996)
- జంబో (1998)
- నషా (1999)
- స్లేవ్ II ఫ్యూజన్ [ఓహ్ లైలా] (2000)
- తాజ్మానియా (2002)
- కేఫ్ ముంబై [అప్నా సంగీత్] (2003/2004)
- జవానీ ఆన్ ది రాక్స్ (2008)
- రివైండ్ సెలెక్తా (2009)
- ట్విస్ట్ & షౌట్ (2010)
- దేశీ & యు నో ఇట్ (2012)
సినిమాల్లో పడిన పాటలు
[మార్చు]- తుమ్ బిన్ (2001, పాట: దరూ విచ్ ప్యార్)
- కోయి. . . మిల్ గయా (2003, పాట: ఇట్స్ మ్యాజిక్)
- రేస్ (2008, పాట: ముజ్పే తో జాదూ)
- ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆఫ్టర్ లైఫ్ (2010)
- డైరీ ఆఫ్ ఎ బటర్‌ఫ్లై (2012)
- మిస్టర్ భట్టి ఆన్ చుట్టి (2012)
- లండన్‌లో అతిథి (2017)
- బాట్లా హౌస్ (2019)
మరణం
[మార్చు]తర్సామీ సింగ్ సైనీ హెర్నియా వ్యాధితో బాధపడుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2022 ఏప్రిల్ 29న యూకేలోని లండన్‌లో మరణించాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (30 April 2022). "ప్రముఖ సింగర్ కన్నుమూత.. కరోనా కారణంగా చికిత్స ఆలస్యం !". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
- ↑ Zee News Telugu (30 April 2022). "ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ తాజ్ కన్నుమూత!". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
- ↑ Nava Telangana. "ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ కన్నుమూత." NavaTelangana. Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
బాహ్య లంకెలు
[మార్చు]- Official Stereo Nation website Archived 2020-11-01 at the Wayback Machine
- A summary of Taz's career
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో తర్సామీ సింగ్ సైనీ పేజీ as Taz
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో తర్సామీ సింగ్ సైనీ పేజీ as Taz Stereo Nation