Jump to content

తాడపట్ల రత్నాబాయి

వికీపీడియా నుండి
తడపట్ల రత్నాబాయి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2008 ఏప్రిల్ 15 – 2014 ఏప్రిల్ 14
నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్

శాసనసభ సభ్యురాలు
పదవీ కాలం
1972 – 1978
ముందు చోడి మల్లిఖార్జున
తరువాత గొర్ల ప్రకాశ రావు
నియోజకవర్గం రంపచోడవరం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం

గిరిజన సహకార సంస్థ చైర్‌పర్సన్
పదవీ కాలం
2005 – 2007

వ్యక్తిగత వివరాలు

జననం 1946 డిసెంబరు 31
రంపచోడవరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2026 ఫిబ్రవరి 15
రంపచోడవరం
జాతీయత భారతీయురాలు India
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సత్యనారాయణ పెద్దిరెడ్డి
సంతానం అమర్ మిత్రా
అరుణ్ మిత్రా
నివాసం న్యూఢిల్లీ, భారతదేశం (అధికారిక)

రంపచోడవరం, ఆంధ్రప్రదేశ్ , భారతదేశం
వృత్తి రాజకీయ నాయకురాలు, సామాజిక సేవకురాలు
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైట్
మూలం [1]

తడపట్ల రత్నాబాయి (1946 డిసెంబరు 31 - 2026 ఫిబ్రవరి 15), భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ్యకు ఎన్నికయ్యింది. ఆమె సభలో క్రియాశీలక సభ్యురాలు. ఆమె వరకట్న మరణాల నుండి శాస్త్ర సాంకేతిక రంగాల వరకు అన్ని అంశాలపై కూడా సభలో తన అభిప్రాయాలను వెల్లడించింది.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె 2005 నుండి 20076 వరకు గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లో చైర్ పర్సన్ గా తన సేవలనందించింది.[2] కార్పొరేషన్ నిర్వహించడానికి కష్టమైన తరుణంలో ఆమె పునరుద్ధరించడానికి విశేష కృషి చేసింది.[3][4] గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ కు వ్యాట్ నుండి తప్పించడానికి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డిని ఒప్పించడంలో ఆమె విజయం సాధించింది. ఈ చర్య 4.5 మిలియన్ల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చింది.[5] ఆమె రాజీవ్ గాంధీ సంక్షేమ సంఘం, రంపచోడవరం నకు వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఈ సంస్థ లాభాపేక్ష లేని గిరిజన సంక్షేమం కోసం నిర్దేశించబడింది. ఆమె ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ్యురాలిగా యల్లవరం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై 1972 నుండి 1978 వరకు అన సేవలనందించింది.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • ఏప్రిల్ 2008:: రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక.
  • 2008 ఆగస్టు - 2009 మే: గ్రామీణాభివృద్ధి కమిటీ సభ్యురాలు
  • 2008 ఆగస్టు: గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కన్సల్టేటివ్ కమిటీ సభ్యురాలు
  • 2009 ఆగస్టు: ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ ల కమిటీ సభ్యురాలు.
  • 2010 : మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్‌పోర్టు డవలెప్‌మెంటు అథారిటీ సభ్యురాలు
  • 1972-78: ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభ్యురాలు.
  • 2014 - 2020: ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యురాలు.

మూలాలు

[మార్చు]

తడపట్ల రత్నాబాయి 79 ఏళ్ల వయసులో 2026 ఫిబ్రవరి 15న రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.[6][7]

మూలాలు

[మార్చు]
  1. "Questions put by Hon' Member of Parliament, Smt. T Ratna Bai". "Government of India". Archived from the original on 29 జూలై 2011. Retrieved 16 June 2011.
  2. "Board members of the Girijan Co-Operative Corporation". GCC, Visakhapatnam. Archived from the original on 24 ఆగస్టు 2007. Retrieved 24 ఏప్రిల్ 2018.
  3. "GCC achieves Rs 112-crore sales turnover". The Hindu. Archived from the original on 2012-09-21. Retrieved Jan 27, 2005.
  4. "About Girijan Corporation". Ministry of Tibal Welfare, Andhra Pradesh, India. Archived from the original on 2005-01-28. Retrieved 2018-04-24.
  5. "GCC hails VAT exemption". Chennai, India: The Hindu. December 18, 2005. Archived from the original on 2008-01-05. Retrieved 2018-04-24.
  6. "మాజీ ఎంపీˆ రత్నాబాయి మృతి". Eenadu. 16 February 2026. Archived from the original on 17 February 2026. Retrieved 17 February 2026.
  7. "కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రత్నాబాయి కన్నుమూత". ABP Desam. 16 February 2026. Archived from the original on 17 February 2026. Retrieved 17 February 2026.

బయటి లింకులు

[మార్చు]