తాడిపర్తి సుశీలారాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడిపర్తి సుశీలారాణి
జననండిసెంబర్ 18, 1938
గుంటూరు జిల్లా
ప్రసిద్ధిరంగస్థల నటీమణి, హరికథ కళాకారిణి

తాడిపర్తి సుశీలారాణి ప్రముఖ రంగస్థల నటి, హరికథ కళాకారిణి.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

సుశీలారాణి 1938, డిసెంబర్ 18న గుంటూరు జిల్లాలో జన్మించారు. శ్రీమతి కొల్లా తాయారమ్మ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

స్కూల్ వార్షికోత్సవంలో ప్రదర్శించిన ధ్రువ విజయం నాటకంలో నటించారు. ప్రముఖ రంగస్థల నటి మార్టూరు సుబ్బులు ప్రోత్సాహంతో నాటకరంగంలోకి ప్రవేశించారు. కన్నెగంటి నాసరయ్య, వాలి సుబ్బారావు (రాణిరుద్రమ) వంటి ప్రముఖ దర్శకుల నాటకాలలో నటించారు. అయితే ఎక్కువకాలం నాటకరంగంలో ఉండలేకపోయారు. ఉప్పలపాటి లక్ష్మీనారాయణ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు.

హరికథా ప్రస్థానం

[మార్చు]

10 సంవత్సరాల వయసునుండే గుప్తా వద్ద హరికథలో శిక్షణ పొందారు. ఎన్నో వందల హరికథా ప్రదర్శనలు ఇచ్చారు. బూర్గుల రామకృష్ణారావు, జమ్మలమడుగు మాధవరాయశర్మ, పాతూరి మధుసూదనశాస్త్రి, జాషువా మొదలైనవారు సుశీలారాణి హరికథలను మెచ్చుకున్నారు.

గానం చేసిన కథలు

[మార్చు]
  1. సుభద్రా పరిణయం
  2. విజయ ముద్రిక
  3. శ్రీ కృష్ణరాయభారం
  4. చంద్రహాస
  5. మార్కండేయ చరిత్ర
  6. మహాభారతం సంపూర్ణం
  7. గాంధీజీ
  8. సుభాష్ చంద్రబోస్

సన్మానాలు - బిరుదులు

[మార్చు]

సన్మానాలు

  1. 1954లో మద్రాస్ వి.పి. హాలులో బంగారు పతకం
  2. 1956లో జెమ్ షడ్ పూర్ లో ఆంధ్రసంఘంచే కనకాభిషేకం, సువర్ణ ఘంటాకంకణం
  3. 1965లో తాడేపల్లిగూడెంలో పసల సూర్యచంద్రరావు, పెద్దంట సూర్యనారాయణ దీక్షిత్ లచే ఉత్తమ కథకురాలుగా సన్మానం
  4. 1996లో వీరగంధం కళాకేంద్ర హరికథా వాగ్గేయకారుల ఉత్సవాలలో సన్మానం

బిరుదులు

  1. మధుర మంజులవాణి
  2. హరి కథాగాన సరస్వతి
  3. కళాప్రవీణ 1 (983లో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ)

మూలాలు

[మార్చు]
  • తాడిపర్తి సుశీలారాణి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 336.