Jump to content

వర్గం:హరికథా కళాకారులు

వికీపీడియా నుండి

శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారి కాలములో ప్రముఖ హరికథా భాగవతులు శ్రీ చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ వారి శిష్యులు శ్రీ కోటేశ్వరరావు భాగవతార్,పద్మనాభం గ్రామంలో శ్రీ సామవేదం సీతారామయ్య అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించి, తన జీవితములో సుమారు 5000 విడికథలను, 1200 సంపూర్ణ హరికథా గానములు చేసి దేశ విదేశములలో లెక్కలేనన్ని సన్మానములు పొంది 'హరికథా సుధాకర'గా బిరుదుపొందినారు.

భారత చరిత్రలో హరికథలో నాటి భారత రాష్ట్రపతి అయిన శ్రీ వి.వి.గిరి గారి సమక్షంలో ఢిల్లీలో, ఆయన భవనంలో నెలరోజులపాటు గానం చేసి సన్మానించబడ్డ ఘనుడు.

వారికి ముగ్గురు కుమారులు సన్యాశిరావు, సీతారామారావు, సాయిరామ్, కుమార్తె పద్మావతి.

వారికి శిష్యులు : కాళ్ళ నిర్మల, గొల్లపూడి కళ్యాణి (కరాటే కళ్యాణి), సుధారాణి, రాధాదేవి, ఉమ, జానకి, సత్యవతి ... ఇంకా ఎందరో....