Jump to content

టి.ఎన్.శేషగోపాలన్

వికీపీడియా నుండి
మదురై టి.ఎన్.శేషగోపాలన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంమదురై తిరుమలై నంబి శేషగోపాలన్
జననం (1948-09-05) 1948 సెప్టెంబరు 5 (వయసు 76)
నాగపట్నం, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిగాయకుడు
క్రియాశీల కాలం1970–ప్రస్తుతం

మదురై టి.ఎన్.శేషగోపాలన్ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, స్వరకర్త, వీణావాదకుడు, హరికథాకళాకారుడు. [1]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఇతడు 1948, సెప్టెంబరు 5వ తేదీన తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జన్మించాడు.[2] ఇతడు మొదట తన తల్లి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. తరువాత రామనాథపురం సి.ఎస్.శంకరశివన్ వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్.సి., మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో డిగ్రీని సంపాదించాడు. మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో సంగీతం ప్రొఫెసర్‌గా పనిచేశాడు.

సంగీత ప్రస్థానం

[మార్చు]

ఇతడు హరికథా గానంలో నైపుణ్యం సంపాదించాడు. హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్ గురుపరంపరలో ఇతడు సంగీత సాధన చేశాడు. ఇతడు అనేక తిల్లానాలను, భజనలను, నామావళులను, అభంగాలను స్వరపరిచాడు. ఉత్తర భారతదేశపు రాగాలను కూడా ఇతడు ఆలపించాడు. అనేక జుగల్బందీ కచేరీలలో పాల్గొన్నాడు.

విదేశీ పర్యటనలు

[మార్చు]

1984లో ఆస్ట్రేలియాలో జరిగిన అడిలాయిడ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు ఇతడు ఆహ్వానించబడ్డాడు. ఆ పర్యటనలో ఇతడు పెర్త్, అడిలాయిడ్, సిడ్నీ, న్యూజిలాండ్‌లలో తన సంగీత కచేరీలు చేశాడు. 1987లో రష్యాకు భారతదేశపు సాంస్కృతిక రాయబారిగా వెళ్ళాడు. ఇంకా ఇతడు సింగపూర్, మలేసియా, బహ్రయిన్, శ్రీలంక, అమెరికా దేశాలను సందర్శించి అనేక ప్రదర్శనలు ఇచ్చాడు.

సినిమా

[మార్చు]

1983లో కున్నక్కూడి వైద్యనాథన్‌తో కలిసి "తోడిరాగం" అనే తమిళసినిమా నిర్మించాడు. ఆ చిత్రంలో ఇతడు నాయకుడుగా నటించాడు. 2006లో జాంబవన్ అనే తమిళ సినిమాలో ప్రశాంత్ తండ్రిగా నటించాడు.

పురస్కారాలు బిరుదులు

[మార్చు]
  • 2014లో శ్రీకృష్ణ గానసభ వారిచే "హరికథా చూడామణి"
  • 2007లో చౌడయ్య మెమోరియల్ ట్రస్ట్, మైసూరు వారిచే "గాయక శిఖామణి"
  • 2006లో మద్రాసు సంగీత అకాడమీ వారిచే "సంగీత కళానిధి"
  • 2004లో భారత ప్రభుత్వంచే "పద్మభూషణ్ పురస్కారం"[3]
  • 2007లో "సంగీతసాగర"
  • 1993లో శ్రీరంగం శ్రీమద్ అండవన్ స్వామి వారిచే "సులక్షణ గాన విచక్షణ"
  • 2000లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై వారిచే "సంగీత కళాశిఖామణి"
  • 2002లో కుమారగంధర్వ ఫౌండేషన్, ముంబై వారిచే "కుమారగంధర్వ రాష్ట్రీయ సన్మాన్"
  • 2002లో ఇండియన్ ఫైన్ ఆర్ట్స్, టెక్సాస్ వారిచే "నాదబ్రహ్మం"
  • 1964లో "తిరుప్పుగళ్ మణి"
  • 1967లో "గాన భూపతి"
  • కంచి కామకోటి పీఠం జయేంద్ర సరస్వతి స్వామివారిచే "సంగీత కళా సాగరం"
  • 1984లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌చే "కళైమామణి"
  • తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధిచే "ఇసై సెల్వం"
  • 1998లో క్యాన్‌బెర్రా ఆస్ట్రేలియన్ ఫౌండేషన్‌చే "ఇసై కళై వేండన్"

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-28. Retrieved 2021-10-27.
  2. శంకరనారాయణ, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్ట్. p. 88. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2022. Retrieved 4 April 2021.
  3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 21 July 2015.

బయటి లింకులు

[మార్చు]