తాతా చరిత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాతా చరిత్రము కొమండూరి శఠకోపాచార్యులు రచించిన జీవిత చరిత్ర. ఇది 1936లో ముద్రించబడింది.

విఖ్యాత పారిశ్రామిక వేత్త జంషెడ్జీ టాటా జీవిత చరిత్ర గ్రంథమిది. దూరదృష్టీ, సాహసం, వ్యాపారవేతృత కలగలిసిన జంషెడ్జీ టాటా భారతదేశంలో స్వాతంత్ర్య పూర్వపు పారిశ్రామికవేత్తల్లో దిగ్గజం. భారతదేశంలో అతిపెద్ద బహుళ ఉత్పత్తుల తయారీ సంస్థ అయిన టాటా ఇండస్ట్రీస్‌ను నెలకొల్పినది జంషెడ్జీ టాటానే. ఆయనను భారతీయ పారిశ్రామిక పితామహునిగా గుర్తిస్తారు. అటువంటి వ్యక్తి జీవితచరిత్ర కావడంతో దేశ వాణిజ్య అభివృద్ధికి, పారిశ్రామిక వృద్ధికీ ఇది మరో దర్పణంలా నిలుస్తుంది. టాటా అనే పదాన్నే మరో ఉచ్చారణతో గ్రంథంలో తాతా అని వ్యవహరించారు. పుస్తకం పేరు కూడా తాతా చరిత్రము కావడం గమనార్హం.

విషయ సూచిక

[మార్చు]
  • పార్సీలు
  • జంషెడ్జి బాల్యము
  • వ్యాపారారంభము
  • వస్త్రపరిశ్రమ - ఎంప్రెసుమిల్లు
  • వస్త్రపరిశ్రమ - స్వదేశీ అడ్వాన్సుమిల్లులు
  • కొన్ని వ్యాపారసమస్యలు, ప్రత్తిపంట
  • నౌకా వ్యాపారము
  • కార్మిక సమస్య
  • బట్టలపన్ను
  • పట్టుపరిశ్రమ
  • పౌరసేవ
  • విజ్ఞానవర్ధనము
  • లోహయంత్రశాల
  • జంషెడ్‌పురము
  • జలవిద్యుచ్ఛక్తి
  • అంత్యదశ
  • ఇతర తాతా సంస్థలు
  • తాతా స్వభావము
  • ముఖ్యవృత్తాంతములు

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: