తారమతి బరాదారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తారమతి బరాదారి
సాధారణ సమాచారం
రకంకార్వన్ స్టేషను
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ,భారత దేశము
భౌగోళికాంశాలు17°22′34″N 78°22′41″E / 17.376080°N 78.378117°E / 17.376080; 78.378117
పూర్తి చేయబడినది1880లు

తారమతి బరాదారి హైదరాబాదు లోని చారిత్రాత్మక ప్రదేశం; ఇది ఇబ్రహీంబాగ్ లో ఒక భాగంగా ఉంది. ఇది ఇబ్రహీం కులీ కుతుబ్‌షా రాజ్యంలో నిర్మించిన పర్షియన్ నిర్మాణ శైలిలో కలిగిన కట్టడం. ఈ నిర్మాణ శైలిలో కట్టిన రెండవది గోల్కొండ

చరిత్ర

[మార్చు]

బరాదారి మూసీ నది ఒడ్డున నిర్మించబడింది. ప్రస్తుతం ఈ ప్రదేశం హైదరాబాదు నగరం శివార్లలో ఉంటుంది. పర్యాటక శాఖ ఈ బరాదారిని ఏడవ గోల్కొండ సుల్తాన్ అయిన అబ్దుల్లా కుతుబ్ షా రాజ్యం నాటిదని ఆపాదించారు. ఆయన తనకిష్టమైన వేశ్య అయిన తారామతి పేరు మీద సరాయ్ తారామతి బరదారి అని నామకరణం చేశాడని అంటారు.

కల్పిత కథలు

[మార్చు]

పర్యాటక శాఖ ఈ ప్రదేశాన్ని సుల్తాన్, తారామతిల శృంగార కథల ప్రదేశంగా గుర్తించింది.[1] అబ్దుల్లా కుతుబ్ షా రాజ్య కాలంలో ఒక కథ ప్రాచుర్యంలో ఉండేది.ప్రయాణీకుల కోసం సెరాయ్ లో పాడే తారామతి యొక్క స్వరాన్ని రెండుకిలోమీటర్ల దూరంలో గల గోల్కొండనుండి వినాలని అనుకునేవాడు. ఆమె అద్భుతమైన గాత్రం గాలితో ప్రయాణించి కోటలోని రాజుగారిని చేరేదట. ఈ విషయాన్ని ధృవీకరించుటకు సరైన సాక్ష్యాలు లేవు.

మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ కథలో తారమతి, ప్రేమమతి అనేవారు సోదరీమణులు. వారు అబ్దుల్లా కుతుబ్ షా యొక్క రాజ భవనంలో పవిలియన్, బాల్కనీకి మధ్య త్రాడు కట్టి దానిపై నాట్యమాడేవారని.[2]

కోటకు సుమారు అర మైలు దూరం ఉత్తరం వైపున గల సమాధులలో కుతుబ్ షాహి రాజుల సమాధులు ఉన్నాయి. అక్కడ కుతుబ్ షాహీ రాజుల, రాణులను ఖననం చేసిన స్థలం ఉంది. అచటనే తారమతి, ప్రేమమతి యొక్క సమాధులను కూడా చేర్చారని చెబుతారు.

పునరద్ధరణ

[మార్చు]
తారమతి బరాదరి

తారామతి బరాదారి మంటపం 12 ద్వారాలను, వాయుప్రసరణకు అనుకూలంగా కలిగిన నిర్మాణం. ఇది అత్యంత దేశీయ నిర్మాణ విధానాలతో కూడుకుని ఉంది.[3]

బయటి మంటపంలో ఎయిర్-కూల్ థియేటర్ సౌకర్యం ఉంది. ఇది సుమారు 500 మంది ప్రజలకు సౌకర్యాన్నిస్తుంది. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం సుమారు 1600 మంది ప్రజలకు సౌకర్యాన్నిస్తుంది. బంకేట్ హాల్ 250 మందికి సరిపోయె సామర్థ్యం కలది.[4]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-08-29. Retrieved 2014-10-11.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-08-29. Retrieved 2014-10-11.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-06-15. Retrieved 2014-10-11.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-20. Retrieved 2014-10-11.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]