తారా దేశ్‌పాండే
తారా దేశ్‌పాండే | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1975 డిసెంబరు 8
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1996–2002 |
జీవిత భాగస్వామి | డేనియల్ టెన్నెబామ్ (m.2001) |
తల్లిదండ్రులు |
|
తారా దేశ్‌పాండే (జననం 1975 డిసెంబరు 08) భారతీయ నటి, మాజీ మోడల్. ఎం.టీవీ వీజె.[1] ఆమె రచయిత్రి కూడా. ఆమె 1990ల ప్రారంభంలో పార్థ్ తో పాటు వినయ్ జైన్‌తో కలిసి జీ టీవీలో కబ్ క్యోన్ కహాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రసిద్ధిచెందింది.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఆమె ముంబైలో శంకర్, పార్వతీ దేశ్‌పాండే దంపతులకు 1975 డిసెంబర్ 8న జన్మించింది. ఆమె కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువుకుంది.
కెరీర్
[మార్చు]ఆమె పాంటెనే ప్రో-వి షాంపూ, రేమండ్, విప్రో షికాకై, కామే సోప్ వంటి అనేక ఉత్పత్తులకు మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆమె థియేటర్ ఆర్టిస్ట్ గా ముంబై వేదికపై అలిక్ పదంసీ నాటకంలో బేగం సుమ్రూ పాత్రను పోషించింది. ఆ తరువాత ఆమె సుధీర్ మిశ్రా ఇస్ రాత్ కి సుబహ్ నహిన్, కైజాద్ గుస్తాద్ బాంబే బాయ్స్ వంటి పలు ప్రశంసలు పొందిన చిత్రాలలో నటించింది.
ఆమె మొదటి పుస్తకం హార్పర్‌కాలిన్స్ ద్వారా ఫిఫ్టీ అండ్ డన్ తన 23వ యేట ప్రచురించింది. సినిమా ప్రపంచంలోకి రాకముందు ఆమె మోడల్, ఎం.టీవీ వీడియో జాకీ.
ఆమె 2012లో వెస్ట్‌ల్యాండ్ పబ్లిషర్స్ ద్వారా ఎ సెన్స్ ఫర్ స్పైస్: రెసిపీస్ అండ్ స్టోరీస్ ఫ్రమ్ ఎ కొంకణ్ కిచెన్, 2018లో ఇండియన్ సెన్స్ ఆఫ్ సలాడ్ వంటి పుస్తకాలను ప్రచురించింది.[2]
ఆమె తరచూ న్యూయార్క్, ముంబైల మధ్య ప్రయాణిస్తుంటుంది.
వ్యక్తిగతం
[మార్చు]ఆమె ఒక అమెరికన్ పౌరుడు డేనియల్ టెన్నెబామ్ ని వివాహం చేసుకుని, 2001లో బోస్టన్‌లో స్థిరపడింది. ఆమె భర్త హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో గ్రాడ్యుయేట్. ఆమె ప్రస్తుతం క్యాటరింగ్ ఏజెన్సీని నడుపుతున్నది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
1996 | ఇస్ రాత్ కి సుబహ్ నహిన్ | పూజ | |
1998 | బడా దిన్ | నందిని షోమ్ | |
1998 | బాంబే బాయ్స్ | డాలీ | |
2000 | తపిష్ | నమ్రత | |
2001 | స్టైల్ | నిక్కీ మల్హోత్రా | |
2002 | ఎన్‌కౌంటర్: ది కిల్లింగ్ | కిరణ్ జయవంత్ | |
2002 | డైంజర్ | ఉన్నతి |
మూలాలు
[మార్చు]- ↑ Deshpande, Tara (2022-01-08). "Gerson Da Cunha told me theatre is a great education. I understand it now: Tara Deshpande". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-03-12.
- ↑ Tennebaum, Tara Deshpande (2018-01-29). Indian Sense of Salad (in ఇంగ్లీష్). EBURY Press. ISBN 978-0-14-344025-3.