తాళ్ళపాక చినతిరుమలాచార్యుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాళ్ళపాక చిన తిరుమలాచార్యుడు (1488-1562) తాళ్ళపాక అన్నమాచార్యుని మనుమడు, తాళ్ళపాక పెదతిరుమలాచార్యుని పుత్రులలో పెద్దవాడు. ఆని తమ్ముళ్ళు అన్నయ్య, తిరువెంగళప్ప, చిన్నన్న (చిన తిరువెంగళనాథుడు), కోనేటి వెంకటనాథుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

చినతిరుమలాచార్యుడు తన తాత తండ్రులు ఆరంభించిన స్వామి కైంకర్యం కార్యక్రమాలను కొనసాగించాడు. అతనికి తన తాత అన్నమాచార్యుడే బ్రహ్మోపదేశం చేసినట్లు తెలుస్తుంది. అతను తన పదహావర యేటనే సంకీర్తన రచన నారంభించినట్లు అతని సంకీర్తనల వల్ల తెలుస్తుంది. [2] అతని సంకీర్తనలో " నా వయసున తాటికి జంపిన కౌసస్యనందన రాఘవా" అని ఉండుటచే శ్రీరాముడు తాటకిని జంపిన వయసున కీర్తనల రచనలు చేసాడని చెప్పవచ్చు. ఇతను తాత తండ్రుల వలెనే శృంగార, ఆధ్యాత్మ సంకీర్తనలు రచించి ఉత్తమ పదకవిగా నిరూపించుకున్నాడు. అతను సంస్కృతాంధ్ర భాషల్లో మహాకవి మాత్రమే కాక అష్ట భాషాదండకం రచింది అష్ట భాషా చక్రవర్తి అని బిరుదు పొంది ప్రసిద్దుడయ్యాడు. అతను అన్నమాచార్యుడు రచిందిన సంకీర్తన లక్షణాన్ని తెలుగు చేసిన పండితుడు.

అతను తాత అన్నమాచార్యుని అనేక సంకీర్తనల్లో ప్రస్తుతించ్వాడు. తనకు బ్రహ్మోపదేశం జరిగాక కొంతకాలం తాత జీవించినట్లు తెలుస్తుంది. ఇతని సంకీర్తనల వల్ల ఇతను అపారమైన గురుభక్తి సంపన్నుడని విశదమవుతుంది. తాత తండ్రుల వలెనే భగవద్భక్తి ముఖ్యమని నమ్మినవాడు. రాజాశ్రయాన్ని కోరలేదు. ఎగువ, దిగువ తిరుపతుల్లో గల దేవతలకు అనేక కైంకర్యాలు జరిపించినట్లు శాసనాధారున్నాయి.

శాసనాధారాలు, కీర్తనలు ఆధారంగా అతను మత ప్రచారమునకు, సంకీర్తన ప్రచారమునకు చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు మొదలగు ప్రాంతములను సందర్శించినట్లు తెలియుచున్నది.

మూలాలు[మార్చు]

  1. Gangappa, S. (1992). Annamacharya Pramukha Vaggeyakarulu : Tulanatmaka Parisilanamu (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. చిన తిరుమాచార్యుని ఆధా. సం. సం. 16. ప.1