తిక్కిరెడ్డిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిక్కిరెడ్డిపాలెం గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

తిక్కిరెడ్డిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
Ganikapudi.jpeg
తిక్కిరెడ్డిపాలెం is located in Andhra Pradesh
తిక్కిరెడ్డిపాలెం
తిక్కిరెడ్డిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°11′04″N 80°19′57″E / 16.1845560°N 80.3324514°E / 16.1845560; 80.3324514
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం ప్రత్తిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522019
ఎస్.టి.డి కోడ్ 0863
వెబ్‌సైటు: www.ganikapudi.in

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల (ఎల్.)[మార్చు]

2017, మార్చి-27న విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలలో, ఈ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు అర్హత సాధించారు.[1]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మర్రి సుబ్బారావు సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు ప్రత్తిపాడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా కొండమూరి శ్రావణి ఎన్నికైనాడు.[2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి దేవాలయ పునఃప్రతిష్ఠామహోత్సవం 2014, ఫిబ్రవరి-24, సోమవారం నాడు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పూజా కార్యక్రమాలలో పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. పునః ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో స్వామివారి విగ్రహం వెనుక భాగంలో 1894 నాటి శిలాఫలకం ఒకటి బయట పడింది.[3]

గ్రామ విశేషాలు[మార్చు]

ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో, ఆధునిక సౌకర్యాలతోకూడిన ఒక మినీ స్టేడియం ఏర్పాటుచేయడానికై, ఈ గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఎదురుగా, సర్వే నం. 172/2 లో ఉన్న 4.06 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, స్థానిక అధికారులు, ప్రభుత్వ అనుమతికై ప్రతిపాదనలు పంపినారు.[4]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2017,మార్చ్-28; 2వపేజీ.
  2. ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2013,డిసెంబరు-17; 3వపేజీ.
  3. ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,ఫిబ్రవరి-25; 1వపేజీ.
  4. ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2017,మార్చ్-28; 1వపేజీ.