Jump to content

తిప్పతీగ

వికీపీడియా నుండి

తిప్పతీగ
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
టి. కార్డిఫోలియా
Binomial name
టీనోస్పోరా కార్డిఫోలియా
(Thunb.) Miers
తిప్పతీగ.

తిప్పతీగ లేదా తిప్పతీగె (లాటిన్ Tinospora cordifolia) ఒక విధమైన ఔషధ మొక్క.[1]

తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. తిప్పతీగను కషాయంలా చేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. తిప్పతీగలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.


1. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు. అలాగే శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది.


2. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే చాలు... అజీర్తి సమస్య పోతుంది.


3. తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్‌గా పని చేస్తుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు.


4. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.


5. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. కీళ్లవ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడొచ్చు. ఆ పాలలో కాస్త అల్లం కలుపుకుని కూడా తాగొచ్చు.


6. తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి.

7. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారుచేసిన మందులను వాడకూడదు.

8. తిప్పతీగను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఈ తిప్పతీగ ఆకులు ,రెమ్మలలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. 20 నుంచి 30 మిల్లీ లీటర్ల తిప్పతీగల కషాయాన్ని తీసుకొని అందులో అల్లం పొడి లేదా పాలు వేసి తాగితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఈ తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల అజిర్తి సమస్యలను తగ్గిస్తుంది.

9. ఫ్రీ రాడికల్స్ బారిన పడకుండా ఈ తిప్పతీగ ఈ తిప్పతీగను తీసుకోవడం ద్వారా,మధుమేహాన్ని తగ్గిస్తుంది.రక్తంలోచక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

Thippa theega Side Effects: తిప్పతీగని అధికంగా తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యుల సమక్షంలో మాత్రమే తిప్పతీగను ఉపయోగించాలి. గర్భవతులు, పాలిచ్చే తల్లులు ఈ తిప్పతీగలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. అతిగా తింటే ఏదైనా విషమే.

గుణరత్న విశేషము నుండి

[మార్చు]

తిప్పతీగ[2] కారముగ చులకనగ పాకము వలన రుచికరముగ ఆయురారోగ్యవృద్ధికారిగనుండును. మలమునుగట్టి పరచును. ఆగ్నిదీపనమును చేయును. రక్తదోషము, వాంతి, వాతము, భ్రమము, పాండువు, ప్రమేప ̈ాము, రక్తవ ̧లము, శ్లేష్మం, కాస ̈ము, దురద, మేదోరోగము, విస ̈ర్పము, కామిల, కుష ̈ు్టవు, వాతరక్తము, జ్వరము, పిత్తము, క్ర ̃ వి ురోగ వ ు, వీనినిప ̈ ా రింప ̈ జ ే య ు ను. తిప ̈ ్ప తీ గ ను ఫ ̈ ు ృత వ ుతోడ సేవించినవాతమును, బెల్లముతోడ సేవించిన మలబద్ధకమును,పంచదార తో సేవించిన పిత్తమును, తేనెతోడ సేవించిన కఫ ̈మును, ఆముదాముతో సేవించిన ప్రబలమైన వాత రక్తమును, శొంట తోడ సేవించిన ఆమ్ల వ ాత వ ు దాుప ̈శమింప ̈జేయును. దీని ముఖాక ̃ప ̈యోగము జ్వరము స ̈ంప ̈ారించుట, వ ̧త్రాశయము గోదించుటయునునది.

మూలాలు

[మార్చు]
  1. "బ్రౌన్ నిఘంటువులో తిప్పతీగె వివరాలు". Archived from the original on 2016-01-26. Retrieved 2010-12-29.
  2. తిప్పతీగ యొక్క ఉపయొగాలు

thippa theega

"https://te.wikipedia.org/w/index.php?title=తిప్పతీగ&oldid=3979033" నుండి వెలికితీశారు