Jump to content

తిప్పన చిన కృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
తిప్పన చిన కృష్ణారెడ్డి

మాజీ ఎమ్మెల్యే
తరువాత ఏ.లక్ష్మీనారాయణ
నియోజకవర్గం మిర్యాలగూడ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1962 నుండి 1978 వరకు

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానం తిప్పన విజయ సింహారెడ్డి[1]
నివాసం మిర్యాలగూడ
వృత్తి రాజకీయ నాయకుడు
మతం హిందూ

తిప్పన చిన కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మిర్యాలగూడ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

తిప్పన చిన కృష్ణారెడ్డి 1962లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి తన సమీప ప్రత్యర్థి సి.పి.ఎం అభ్యర్థి చల్లా సీతారాంరెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ లోకి అడుగుపెట్టాడు. ఆయన 1967లో సి.పి.ఎం అభ్యర్థి చల్లా సీతారాం రెడ్డి పై రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. తిప్పన చిన కృష్ణారెడ్డి 1972లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సి.పి.ఎం అభ్యర్థి ఎం.సీతరామయ్య పై గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]

పోటీ చేసిన నియోజకవర్గాలు

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ ఫలితం
1962 మిర్యాలగూడ జనరల్ తిప్పన చిన కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ చల్లా సీతారామరెడ్డి సి.పి.ఎం గెలుపు
1967 మిర్యాలగూడ జనరల్ తిప్పన చిన కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ చల్లా సీతారామరెడ్డి సి.పి.ఎం గెలుపు
1972 మిర్యాలగూడ జనరల్ తిప్పన చిన కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ 45692 ఎం.సీతరామయ్య సి.పి.ఎం 20023 25669 గెలుపు

మూలాలు

[మార్చు]
  1. Eenadu (10 November 2023). "తండ్రీ కొడుకులు ఎమ్మెల్యేలు." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  2. Sakshi (27 November 2018). "హ్యాట్రిక్‌.. వీరులు!". Sakshi. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
  3. Sakshi (30 November 2018). "వారసులకు.. నో చాన్స్‌!". Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
  4. Andhrabhoomi (5 November 2018). "రెండు పార్టీల గూడు మిర్యాలగూడ! | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.