తిరుపతి - కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరుపతి - కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది తిరుపతి రైల్వే స్టేషను, కాకినాడ టౌన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]

జోను, డివిజను[మార్చు]

ఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య[మార్చు]

రైలు నంబరు: 07432

తరచుదనం (ఫ్రీక్వెన్సీ)[మార్చు]

ఈ రైలు వారానికి ఒక రోజు (సోమవారం) నడుస్తుంది.

ప్రత్యేక సేవలు[మార్చు]

2016[మార్చు]

ప్రయాణీకుల రద్దీ ననుసరించి రైలు నంబరు: 07432 తిరుపతి - కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 2016, 25 వ జనవరి నుండి 19:00 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.[3] ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైలు 15 కోచ్‌లు కలిగి ఉంటుంది. ఇందులో ఒక ఏసీ టూ టైర్, ఒక ఏసీ త్రీ టైర్, ఎనిమిది స్లీపర్ క్లాస్, రెండు సాధారణ రెండవ తరగతి, ఒక చైర్ కారు, రెండు రెండవ తరగతి లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్‌లు ఉంటాయి.

మూలాలు[మార్చు]