తిరుమలై తిరుపతి యాత్ర
తిరుమలై తిరుపతి యాత్ర | |
కృతికర్త: | ఎన్. వి. లక్ష్మీనరసింహారావు |
---|---|
అంకితం: | వేంకటేశ్వరుడు, తిరుమల |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | తిరుమల, తిరుపతి యాత్ర |
ప్రచురణ: | |
విడుదల: | 1919, 1923 |
తెలుగునాట యాత్రా సాహిత్యం కొంత తక్కువగానే వచ్చిందని చెప్పుకోవాలి. 19వ శతాబ్ది తొలినాళ్లలోనే యేనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర రచించినా అది వెలుగులోకి రావడానికి చాలా కాలమే పట్టింది. ఆపైన కూడా కొంతవరకూ ఆ లోటు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 1920దశకంలో తిరుమల యాత్ర చేసి ఆ యాత్రను తిరుమలై తిరుపతి యాత్ర గ్రంథంగా మలచిన ఎస్.వి.లక్ష్మీనారాయణరావు సాహిత్యకృషి అపురూపమైనదే. ఆనాటి తిరుమల యాత్ర ఎలా ఉండేదో, నాటి సాంఘిక జీవనమెలా సాగేదో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది
రచన నేపథ్యం
[మార్చు]1920 దశకంలో తిరుమల తిరుపతి యాత్ర సాగించిన ఎస్.వి.లక్ష్మీనారాయణ ఆ అనుభవాలను ఈ గ్రంథ రూపంలోకి మలిచారు. తిరుమల ఆలయాన్ని సంప్రదాయ మహంతులు పాక్షికంగా పరిపాలిస్తున్న రోజులవి. ఆ నేపథ్యంలో తిరుమల మహంతులకు సంబంధించిన హథీరాంజీ మఠం వారు ఈ గ్రంథముద్రణకు సహకరించారు.
విషయాలు
[మార్చు]తిరుపతి చేరుకున్న దగ్గరనుంచి మొదలుకొని తిరుపతిలో యాత్రికుల సదుపాయాలు, కింద నుంచి ఆ రోజుల్లో కొండపైకి తీసుకువెళ్ళే డోలీల వారు, అలిపిరి వద్ద పోలీసు ఠాణాలు, యాత్రికులకు ఉపకరించే చలివేంద్రాలు, బావులు, దేవాలయాల వివరాలు, చూడాల్సిన ప్రాంతాలను మొదలుకొని ఎన్నెన్నో వివరాలు అందించారు. ఆ రోజుల్లో తిరుమల యాత్ర చేయదలచిన వారికి దిక్సూచిలా, ఇతరులకు యాత్రానుభవం కలిగించేదిగా ఉపయోగించే పుస్తకమిది.
విషయసూచిక
[మార్చు]1. అధ్యాయము
[మార్చు]- తిరుపతి
- యాత్రికుల నాదరించువారు
- సత్రములు
- శ్రీ కపిలతీర్థము
- డోలి, మూటలవాండ్రు
- కొండమార్గము
- అలిపిరి, ఠాణాలు
- చలివెంద్రలు, బావులు
- శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి గుడి
- శ్రీ భాష్యకార్లవారి గుడి
- అలిపిరి గోపురం
- గాలిగోపురం
- సారెపెట్టెలు
- పంచములు మొదలగువారు
2. అధ్యాయము
[మార్చు]- తిరుమల
- వృషభాచలము
- అంజనాచలము
- శేషాచలము
- వెంకటాచలము
- శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం
- వెయ్యికాళ్ల మంటపం
- శ్రీహత్తీరాంజి మఠం
- శ్రీచిన్నజియ్యంగార్లవారి మఠం
- అధికారివారితోట
- మైసూరు గవర్నెంటివారి సత్రము
- దేవస్థానపు సత్రము
- శృంగగిరి స్వాములవారి మఠము
- గోసాయిమంటపము
- హిందుస్తాన్ రామాంజకూటము
- వ్యాసరాయ స్వాములవారి మఠము
- అర్చకుల యిండ్లు
- రాతి తేరు
- శ్రీవుత్తరాది స్వాములవారి మఠము
- శ్రీపరకాళ స్వాములవారి మఠము
- రధము
- దివాణము
- వాహన మంటపము
- బజారు
- తీర్థగట్టసందు
- శ్రీవరాహస్వామివారి దేవస్తానము
- ఘంటా మంటపము
- పోలీసు స్టేషను
- శ్రీపెద్దజియ్యంగార్లవారి మఠము
- ఆచార్యపురుషులు
- మంగలకట్ట
- డిస్పెన్సరి
- భోజనము
- హోటల్
3. అధ్యాయము
[మార్చు]- శ్రీవారి దర్శనము
- శుద్ధి
- తోమాల సేవ
- కొలువు
- అర్చన
- ధర్మదర్శనము
- అర్చన
- రాత్రి దర్శనము
- యేకాంతసేవ
- గురువారము
- శుక్రవారము
4. అధ్యాయము
[మార్చు]- ప్రసాదము
- పరఖామణి
- పక్షదిట్టం
- శ్రవణనక్షత్రదిట్టము
- రోహిణి
- ఆరుద్ర
- పునర్వసునక్షత్రం
- చిత్తానక్షత్రం
- ద్వాదశివుత్సవము
- వసంతోత్సవము
- శ్రీవారి బ్రహ్మోత్సవము
- నవరాత్రి వుత్సవము
- ధనుర్మాసము
- అధ్యయనోత్సవము
- రథసప్తమి
6. అధ్యాయము
[మార్చు]- ఆర్జితము :- ఉత్సవములు
- బ్రహ్మోత్సవము
- వసంతోత్సవము
- కల్యాణోత్సవము
- ఇతర వాహనములు
- శేవలు :
- అమంత్రణోత్సవము
- పూలంగిశేవ
- పులికాపుసేవ
- పూరాతిరుప్పావడ
- అరతిరుప్పావడ
- కోవిలాళ్వారు తిరుమంజనం
- సహస్రకలశాభిషేకము
7. అధ్యాయము
[మార్చు]- ఆర్జితనివేదన
- చెరుపులు
- పళ్లు
- నిత్య హారతి
- నిత్య అర్చన
- శ్రీపాదచందనము
- శ్రీపాదరేణువు
- షరాబు
- ముడుపు
- చంద్రగిరి రస్తా
- తిరుమల అంగడివాండ్రు
- కోతులు
- శాసనములు
- భావులు తులసిపుష్పం
- ఉగ్రాణము
- జ్వరగాలి
- నీటివసతి
- బంగళా
- తరిగొండ వెంగమ్మ
- శానిటేసన్
- శ్రీగోవిందరాజస్వామివారి దేవస్థానం
- శ్రీరామస్వామివారి దేవస్థానం
- శ్రీపద్మావతిఅమ్మవారి దేవస్థానం
- తిరుమల అడవి
- వాహనములు
- శివలింగం
- దేవతలు
- ముద్రమండపము
8. అధ్యాయము
[మార్చు]- తీర్ధములు
- శ్రీస్వామిపుష్కరిణి
- శ్రీవైకుంఠతీర్థము
- పాండవతీర్థము
- జాబాలితీర్థము
- వరాహతీర్థము
- కుమారధారతీర్థము
- చక్రతీర్థము
- ఆకాశగంగ
- పాపవినాశనము
- ఘోణతీర్థము
- రామకృష్ణతీర్థము
9. అధ్యాయము
[మార్చు]- చరిత్ర
ప్రాధాన్యత
[మార్చు]తిరుమలై తిరుపతి యాత్ర 1920ల కాలంలోని తిరుమల యాత్రాచరిత్ర కావడంతో దీనికి చాలా చారిత్రిక ప్రాధాన్యత ఉంది. దీనివల్ల ఆ రోజుల్లో సాంఘిక జీవనం, తిరుమల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి. కొండపైన ఆ కాలంలో సాగిన సేవలు, నిబంధనలు వంటివీ, ఆనాడు ప్రాచుర్యంలో ఉన్న సత్రాలు, అప్పట్లో తిరుమలలో ప్రముఖులు వంటివెన్నో ఈ గ్రంథం తెలియపరుస్తుంది.