హథీరాంజీ మఠం
| సంత్ హాతీరాం బావాజీ మఠం | |
|---|---|
| [[File: | |
ఆంధ్రప్రదేశ్ లోని ప్రదేశం | |
| భౌగోళికాంశాలు: | 13°40′59″N 79°20′49″E / 13.68306°N 79.34694°E |
| పేరు | |
| ఇతర పేర్లు: | హాతీరాం బావాజీ మఠం |
| స్థానిక పేరు: | Shri Hathiram Bhavaji Swamy Temple హాతీరాం బావాజీ స్వామి వారి దేవాలయం |
| స్థానం | |
| దేశం: | భారతదేశం |
| రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా: | తిరుపతి |
| ప్రదేశం: | తిరుపతి ఏడు కొండలపైన |
| నిర్మాణశైలి, సంస్కృతి | |
| ప్రధానదైవం: | హాతీరాం బావాజీ స్వామి |
| నిర్మాణ శైలి: | దక్షిణ భారతదేశం |
| చరిత్ర | |
| కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | వంద ఏళ్ళ చరిత్ర |
| నిర్మాత: | ఉత్తర భారత దేశానికి చెందిన హాతీరాం బావాజీ సాధువు |
హాథీరాంజీ మఠం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, తిరుపతి లో వేంకటేశ్వర స్వామి భక్తుడైన హథీరాం బాలాజీ అనే భక్తుని తో పేరు మఠం ఉంది. ఈ మఠం తిరుమల ఆలయ నిర్వహణకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయక మునుపు హాథీరాం బావాజీ మఠం 1843 నుంచి 1932 వరకు ఆలయాన్ని నిర్వహించారు.[1][2][3] ఈ మఠానికి సంబంధించిన భూములు తిరుపతి చుట్టుపక్కల ఉన్నాయి. ఈ భూముల విషయమై పలుమార్లు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.[4]
మఠం
[మార్చు]తిరుమల ప్రధాన ఆలయానికి ఆగ్నేయంలో ఎత్తైన ప్రదేశంలో హాతీరామ్ బావాజీ స్థాపించిన ఆశ్రమమే 'హాతీరాం బావాజీ మఠం' గా అవతరించింది. ఆయన 'సజీవ సమాధి' ద్వారా ప్రభువు లో లీనమైపోయాడు. హాతీరాం బావాజీ మఠానికి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక ఎకరాల భూములు, ఇతర ఆస్తులు ఉన్నాయి. మఠం సంరక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంది.ప్రతి రోజు హాతీరాం బావాజీ మఠం నుండే స్వామివారి పూజకు నైవేద్యం పంపడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి గోర్ బంజారా భక్తులు ప్రధాన ఆలయానికి చేరువలోనే ఉన్న హాతీరాం బావాజీ మఠాన్ని ముందుగా దర్శించిన తరువాతనే బాలాజీ దర్శనం చేస్తారు. బావాజీ బాలాజీ నుండి దర్శించుకునే భక్తులు ముందుగా తనను దర్శించుకునే వరాన్ని పొందాడని వారి నమ్మకం. బావాజీ, బాలాజీతోనే పాచికలాడిన పరమ భక్తుడని, ఆయన వారి పూర్వీకుడని వారి నమ్మకం. మఠంలో మహంతుల దీవెనలు తీసుకొని బాలాజీ దర్శనానికి వెళ్తారు. అందువల్ల భారతదేశం నలుమూలల నుండి బంజారా భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించుకోవడం జరుగుతుంది
చిత్రమాలిక
[మార్చు]-
హాతిరామ్ బావాజీ మఠం ముఖ ద్వారం
-
బాబా మఠం పురాతన తలుపు
-
సిథీల వ్యవస్థలో ఉన్న మఠం
-
హాతిరామ్ బావాజీ మఠంలోని శిల్ప కళా దృశ్యం
చరిత్ర
[మార్చు]తిరుమలలో జియ్యంగారి మఠం, ఉత్తరాది మఠం, బైరాగి మఠం, శృంగేరి మఠం లాంటి అనేక మఠాలు ఉన్నా హథీరాంజీ మఠం ప్రత్యేకమైంది. మిగత మఠాలు ఏదైనా ఒక కులానికో, ఆధ్యాత్మిక సాంప్రదాయానికి చెందిన వారికి మాత్రమే ఆశ్రయం కల్పిస్తే హథీరాంజీ మఠం లో బంజారాల సుగలి సేవకులు ఎవరికైనా సేవలు అందించే దిశసాగా. ఇక్కడికి ముఖ్యంగా ఉత్తరాది తండా లు నుంచి వచ్చే భక్తులే ఎక్కువగా ఉండేవారు పూర్వం పరంపర గా వస్తున్న ఆచారాలను బంజారా వేషధారణ నృత్యాలతో ఆరాధన చేసేవారు ఇంత వైభవంగా జరిగిన పూజ పునస్కారాలు ఈరోజు స్వామివారికి పూజ చేయాలంటే హతిరాంబాజి ఆలయం నందు అభిషేకం ప్రారంభిస్తారు ఎంత గత చరిత్రలో దేవాలయం లో బంజారాలకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ బాలాజీ బాలాజీ గోవిందా గోవిందా హరి గోవిందా హరి గోవిందా వెంకటాపతియే నమః వెంకటేశ్వర స్వామి భక్తుడు ప్రథమ భక్తుడుగా కలిసి ఉన్న హాథిరాం బావాజీ వారికి ఎంతో అరుదైన గౌరవాన్ని ఇచ్చిన మహా విష్ణు అవుతారా ఆయనతో పాచికల ఆడుతూ స్వామివారితో స్నేహం బంధాన్ని భక్తి శ్రద్ధలతో పూజించడం ఎంతో మహా భక్తుడుగా వెలిసిన హాథిరాం బావాజీ మఠానికి దర్శించమని స్వయంగా శ్రీవారి చెప్పడం జరిగింది ఇంత గొప్ప చరిత్ర కలిగి ఉన్న హాథిరాం బావా శ్రీవారికి నిత్యం శ్రీవారితో పాచికులాడేవరు కానీ మహావిష్ణువుతానంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా హాథిరాం బాబాజీ ఆలయం నిర్మాణం ఉంది అక్కడ భక్తులు చేరుకోవాలని స్వయంగా వెంకటేశ్వర స్వామి నా మిత్రుడు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన బంజారా బిడ్డ శ్రీ హాథిరాం బావాజీ మఠంలో ఆశ్రయించాలని కోరడం జరిగింది [5]
దాదాపు 596 సంవత్సరాలు కాలం లో 19 శతాబ్దాల నాటి ఈ యొక్క చరిత్రను చూపించాలని ఒక భక్తుడు ఒక బంజారా బిడ్డ మారుమూల ప్రాంతం తాండ నుంచి వచ్చి హాథిరాం బావాజీ భక్తుడుగా ఎన్నో భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించడం అక్కడ వచ్చే భక్తులకు అన్నదానం తో పాటు భోగ్ బండారు పూజ స్వామివారికి ఎంతో ఇష్టమైన నృత్యం వేషధారణం అలాంటివి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి స్వామి వారి ఆలయ నిర్మాణం చేయాలని కోరడం జరిగింది ఆయన పేరు బుక్య శివ నాయక్ 34 తండ్రి పేరు వకీల్ నాయక్ తల్లి పేరు శాంతమ్మ వారి ద్వితీయ కుమారుడు ఎంతో సేవ సాంప్రదాయాలను బంజారాలకు ఉనికిని ఆ యొక్క స్వామి వారి యొక్క భక్తి భావంతో బంజారాల ఆరాధ్య దేవుడు ఒక భావించే భక్తులు కొరకై ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానితోపాటు ఆలయ నిర్మాణం చేయాలి అనే తపన కలిగిన వ్యక్తి మొట్టమొదటిగా సృష్టిలోనే హతిరాంబాజి ఆలయం నిర్మాణం చేయడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా నిరూపించడం బంజారా జాతికి అరుదైన సానుభూతిని దక్కిందని ఈనాటి పెద్దలు చెప్పడం జరిగింది శ్రీ స్వామి హాథిరాం బాబాజీ వారికి ఎన్నో వేల ఆస్తులున్న 12వ శతాబ్దం కాలం నాటి నుంచి ఇప్పటివరకు ఆలయం ఎందుకు నిర్మాణం చేయలేదని అధికారులను ప్రశ్నించడంతో ఆలయాన్ని నిర్మాణం చేయకూడదని తిరస్కరించడం జరిగిందని తెలిపారు బంజారా కులానికి చెందినవారినికీ ఆలయం నిర్మాణం చేయకూడదని మఠానికి సంబంధించిన అధికారులు తేల్చి చెప్పడంతో బాగోదేవానికి గురి కావడం జరిగింది. ఇంత చరిత్రలో నిలిచిపోయే ఆలయం నిర్మాణం చేయడానికి అందరూ సహకరించాలని కొన ఆడాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "After temples, mutts are 'losing' jewelry". newindianexpress.com. ఇండియన్ ఎక్స్ ప్రెస్. Retrieved 1 October 2016.[permanent dead link]
- ↑ Staff, Reporter. "Hathiramji Mutt gets back its land". thehindu.com. Kasturi and Sons. Retrieved 1 October 2016.
- ↑ "వివాదాలకు నిలయంగా హథీరాంజీ మఠం... ఆందోళన బాటలో సాధువులు". telugu.webdunia.com. Retrieved 1 October 2016.
- ↑ "తిరుపతిలోని హథీరాంజీ మఠం భూములను ప్రభుత్వం పరిరక్షించాలి". prabhanews.com. ఆంధ్రప్రభ. Retrieved 1 October 2016.[permanent dead link]
- ↑
{{cite book}}: Empty citation (help) - ↑ Vasanatha, P. "Mahants Of Hathiramji Mutt 1843 1933". shodhganga.inflibnet.ac.in. Sri Venkateswara University. Retrieved 27 September 2016.