Jump to content

తిరువీధుల మెరసీ దేవదేవుడు

వికీపీడియా నుండి
తిరువీధుల మెరసీ దేవదేవుడూ... కీర్తన రచయిత అన్నమయ్య

తిరువీధుల మెరసీ దేవదేవుడు కర్ణాటక సంగీత వాగ్గేయకారుడైన అన్నమాచార్య రచించిన కీర్తన. ఇది శ్రీరాగంలో పాడావచ్చును.

కీర్తన

[మార్చు]

పల్లవి :

తిరువీధుల మెరసీ దేవదేవుడు

గరిమల మించిన సింగారముల తోడను | | తిరువీధుల మెరసీ | |


చరణం 1 :

తిరుదండెల పై నేగీ దేవు డిదే తొలినాడు

సిరులు రెండవనాడు శేషుని మీద

మురిపేన మూడోనాడు ముత్యాలపందిరి క్రింద

పొరి నాలుగోనాడు పువ్వుకోవిల లోను | | తిరువీధుల మెరసీ | |


చరణం 2 :

గక్కన ఐదవనాడు గరుడుని మీద

ఎక్కెను ఆరవనాడు యేనుగు మీద

చొక్కమై ఏడవనాడు సూర్యప్రభలోనను

యిక్కువ తేరును గుర్ర మెనిమిదో నాడు | | తిరువీధుల మెరసీ | |


చరణం 3 :

కనకపుటందలము కదిసి తొమ్మిదోనాడు

పెనచి పదోనాడు పెండ్లి పీట

ఎనసి శ్రీ వేంకటేశు డింతి అలమేల్మంగతో

వనితల నడుమను వాహనాల మీదను | | తిరువీధుల మెరసీ | |

విశేషాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. అన్నమాచార్య సంకీత్రనా త్రిశతి (310 సంకీర్తనలు), సంకలనం : గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2008.

బయటి లింకులు

[మార్చు]