Jump to content

తీవ్రత(లేసర్)

వికీపీడియా నుండి
లేజర్ కాంతి తీవ్రత


ప్రమాణ కాలంలో వైశాల్యానికి అభిలంబంగా ప్రవహించే తరంగ శక్తిని, తీవ్రత అంటారు. సాధారణ కాంతి జనకాల నుండి కాంతి గోళీయ తరంగాగ్రముల రూపంలో అన్ని దిశలకు వ్యాపిస్తుంది.
మీరు 100 వాట్ల విద్యుద్దీపం ఫిలమెంటుని 30 సెం.మీ దూరం నుండి చూస్తున్నపుడు మీ కంటిలోకి వాట్ల కన్నా తక్కువ కాంతి సామర్థము ప్రవేశిస్తుంది.
లేసరు కాంతి చాలా చిన్న ప్రాంతంలోనూ, తక్కువ తరంగ దైర్ఘ్యం తోనూ శక్తిని ఉద్గారిస్తాయి. అందుకే అవి శక్తి వంతమయినవి లేదా అధిక తీవ్రత కలవి.
లేసరును కంటితో చూడడం ప్రమాదకరం. ఒక వాట్ లేసర్ 100 వాట్ల సాధారణ దీపం కన్నా తీవ్రమైనది.
తీవ్రత అనునది లేసర్ యొక్క ప్రత్యేక లక్షణం

లేసర్

[మార్చు]

లేసర్(LASER) అనునది ఒక సంక్షిప్తపదం.("Light Amplification by Stimulated Emission of Radiation") అనగా "ఉత్తేజిత కాంతి ఉద్గారం వలన కాంతి వర్థకము" చెందే ప్రక్రియను సూచిస్తుంది. లేసర్ ప్రత్యేక లక్షణాలున్న ఒక కాంతి జనకం. ఈ ప్రత్యేక లక్షణాలు సాధారణంగా మనం చూసే సూర్యుడు, ఉష్ణోద్గార దీపం, ఏకవర్ణ కాంతి జనకం, సోడియం దీపం వంటి కాంతి జనకలలో ఉండవు.

దీనిని 1954 వ సంవత్సరంలో డా.చార్లెస్.టౌన్స్ మొదటి సారిగా లేసర్ యొక్క శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రతిపాదించారు. 1960 వ సంవత్సరంలో అనేక శాస్త్రజ్ఞుల ప్రయాసలతో "స్పందన లేసర్" రూపొందింది.

లేసర్ కాంతి లక్షణాలు

[మార్చు]

సాధారణ కాంతి జనకానికి, లేసర్ కు మధ్య నాలుగు ప్రధాన తేడాలున్నాయి. 1.సంబద్ధత 2.దిశనీయత 3. ఏకవర్ణీయత 4. తీవ్రత.