తుంగ గడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తుంగ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
సై. రొటండస్
Binomial name
సైపరస్ రొటండస్

తుంగ (Nut grass) ఒక రకమైన గడ్డి. ఈ గడ్డితో మన పల్లెలలో ఇంటి పైకప్పుగా వేసుకుంటారు. నేల మీద కూర్చొనడానికి అవసరమైన చాపలు తుంగ గడ్డితో చేసినవి మెత్తగా ఉంటాయి.

చరిత్ర

[మార్చు]

తుంగ గడ్డి అనేది శాశ్వత గడ్డి లాంటి మొక్క, ఇది సాధారణంగా 10 - 30 సెం.మీ పొడవు పెరుగుతుంది, కానీ కొన్నిసార్లు 75 సెం.మీ, వరకు పెరుగుతుంది . ఈ గడ్డి వెచ్చని సమశీతోష్ణస్థితి నందు పెరుగుదల . ప్రపంచములో దక్షిణ ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్, అమెరికా యొక్క ఉష్ణమండల మండలాలకు వరకు వ్యాపించింది. తూర్పు ఉత్తర అమెరికాలో రహదారుల ప్రక్కన , ఇసుక భూములు ,సాగు భూములలో కనబడతాయి. దీనికి కావాల్సిన ఉష్ణోగ్రతలు 24 - 32 ° c పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇది బాగా పెరుగుతుంది, 10 - 45 ° c ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది కానీ . -5 ° c లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతల ఉంటే మొక్క పెరగదు. సంవత్సర సగటు వర్ష పాతం 500 - 3,000 మిమీ. 300 - 4,200 మిమీ ఉన్నా పెరగగలదు . తేమ తో ఉన్న ఇసుక నెలలో పెరగగలదు. అయితే ఇది ఉష్ణమండలంలో వ్యవసాయ భూమి యొక్క కలుపు, ఇక్కడ అది మూలాల వద్ద వ్యాపిస్తుంది , ఇది ప్రపంచంలోనే అత్యంత నష్టపరిచే కలుపు మొక్కలలో ఒకటిగా పరిగణించబడుతుంది, ఈ గడ్డిని పెంచడములో వారి దేశాలలో ప్రభుత్వ చట్టములకు, నియమావళి కి లోబడి ఉంటుంది.[1]


ఉపయోగములు [2]

[మార్చు]

రోటండస్ ఆగ్నేయాసియాలో నుంచి, గత 2000 సంవత్సరాల్లో ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించిందని భావిస్తున్నారు. దీనిని ఆఫ్రికా ( నైలు లోయ), చైనా, తూర్పు మధ్యధరాలోని పురాతన ప్రజలు ఆహారం గా స్వీకరించే వారు . సుగంధ ద్రవ్యాలుగా , వైద్య రంగములో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ జాతి మొట్టమొదట 500 AD లో ఒక చైనీస్ వైద్య పుస్తకంలో ఉన్నది . ఈ జాతిని కొత్త ప్రదేశములకు ప్రవేశపెట్టే పద్ధతి మానవ కార్యకలాపాలకు సంబంధించినది. విత్తనాలు, దుంపలు , బురద, వ్యవసాయ యంత్రాలు, పశుగ్రాసం, పచ్చిక బయళ్ళు పంట విత్తనాలలో కలుషితంగా ప్రవేశపెట్టవచ్చు. అమెరికా లో ఇది 1800 లలో అనుకోకుండా ప్రవేశపెట్టబడిందని భావిస్తారు. 1880 ల నుండి, ఈ జాతి వెస్టిండీస్‌లోని ద్వీపాలలో చేసిన వాటిలో ఉన్నది.

ఈ మొక్క యొక్క మూల చాలా సంవత్సరాలుగా చైనాలో  సాంప్రదాయ మందుగా ,  భారతీయ ఆయుర్వేద మందు  ఈ మొక్క అనేక వ్యాధుల చికిత్సల నివారణలో ,  చర్మ సంరక్షణకు ,జీర్ణవ్యవస్థకు, మూర్ఛలు, అతిసార నిరోధక లక్షణం, , అధిక రక్తపోటును తగ్గించడములో , శరీర బరువు తగ్గడములో , తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉండడం , రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

దుష్ప్రభావం

[మార్చు]

తుంగ గడ్డిని ముందుగా తీసుకోవడములో మలబద్ధకం , వాత దోషములకు సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది.[3]

   

మూలాలు

[మార్చు]
  1. "Cyperus rotundus - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2020-09-26. Retrieved 2020-11-09.
  2. "Nut Grass facts and health benefits" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-09.
  3. Anupama (2015-08-08). "Nutgrass (Cyperus rotundus) Information, Uses and Side-effects". bimbima (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-09.


మూలాలు

[మార్చు]