Jump to content

తుపాకి రంగడు

వికీపీడియా నుండి
తుపాకి రంగడు
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆమంచర్ల శేషగిరిరావు
నిర్మాణం సి.హెచ్.ఎన్.వర్మ
తారాగణం ఉదయకుమార్,
జయంతి,
విజయలలిత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం,
మాస్టర్ వేణు
గీతరచన శ్రీశ్రీ
సంభాషణలు శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ విజయనిర్మలా పిక్చర్స్
భాష తెలుగు

తుపాకి రంగడు 1970, డిసెంబరు 18వ తేదీన విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ సినిమాలో ఉదయకుమార్ ద్విపాత్రాభినయం చేశాడు.

నటీనటులు

[మార్చు]
  • ఉదయకుమార్ - భైరవుడు, రంగన్న
  • జయంతి - శాంత
  • విజయలలిత
  • బాలకృష్ణ
  • నరసింహరాజు
  • నాగప్ప
  • రాజానంద్
  • ఎ.ఎల్.ఎ.నాయుడు
  • రమ
  • విజయప్రభ
  • ఢిల్లీ బబిత
  • శ్యాం మొదలైనవారు.

సాంకేతికవర్గం

[మార్చు]

చిత్రకథ

[మార్చు]

భైరవుడు తాను చేయని ఖూనీ నేరానికి జైలు పాలయ్యాడు. శిక్షాకాలంలో భార్య చనిపోయింది. కొడుకు తప్పిపోయాడు. జైలు నుండి విడుదలయ్యాక భైరవుడు తుపాకీ ధరించాడు. తనకా దుస్థితిని కల్పించిన సమాజంపై దాడి సాగించాడు. అనుచరులను పోగుచేసుకున్నాడు. కాలం గడిచింది. గంగన్న అనే ఆసామి వద్ద రంగన్న అనే విశ్వాసపాత్రుడైన నౌకరున్నాడు. అతడు బలాఢ్యుడు, ఉత్తముడు. గంగన్న రెండవభార్య తమ్ముడు భుజంగం ఈ రంగడిని హతమార్చడానికి ప్రయత్నాలు సాగించాడు. అతడికి గంగన్న మొదటి భార్య కూతురు శాంతను వివాహమాడి గంగన్న ఆస్తిని కాజేయాలన్న తలంపు ఉంది. శాంత రంగడికి మనసిచ్చింది. రంగడిపై ఏదో నేరం మోపి అతడిని గంగన్న ఇంటి నుండి తరిమేస్తాడు భుజంగం. ఇంతలో రంగడు భైరవుని స్థావరం చేరుకుంటాడు. ఆ యిద్దరూ తండ్రీ కొడుకులని తెలిసిపోతుంది. భైరవుడు మారిపోయాడు. తుపాకీతో వెళ్లి శాంతకు బలవంతపు పెళ్లిని ఆపి తనవెంట తీసుకువచ్చి కోడలిగా చేసుకుంటాడు. వారి జీవితం హాయిగా సాగి పోతూ ఉంటుంది. కానీ భుజంగం భైరవుని నుండి చీలిపోయిన ముఠాతో చేతులు కలిపి రంగడిపై దాడులు సాగించాడు. భైరవుని చంపి, రంగడి కొడుకును ఎత్తుకు పోతాడు భుజంగం. ఉగ్రుడైన రంగడు తుపాకీ ధరించి తుపాకి రంగడిగా మారతాడు. తన తండ్రిని చంపినవారిపై పగసాధిస్తాడు.