తుమ్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాదు లో తుమ్మి మొక్క

తుమ్మి యొక్క వృక్ష శాస్త్రీయ నామం Leucas aspera.

ఇతర భాషలలో పేర్లు

[మార్చు]

హిందీ : చోటాకల్కుస, కన్నడ : తుంబెగిడ, తమిళం : తుంబై, బెంగాలీ : చోటాకల్కుస, మలయాళం : తుంబ

వ్యాప్తి

[మార్చు]

భారతదేశమంతటా, బంజరు భూములలో ఈ మొక్క పెరుగుతోంది.

మొక్క వివరణ

[మార్చు]

ఈ చిన్నమొక్క సాధారణంగా 30 సెం.మీ ఎత్తు పెరుగుతుంది. కాండం నాలుగు పలకాలుగా ఉండి, దానికి సన్నని నూగు ఉంటుంది. ఆకులు సన్నగా కొసుగా పొడవుగా ఉంటాయి. ఆకులు కాండానికి ఇరువైపుల ఎదురెదురుగా ఉంటాయి. సాధారణంగా మూడు, నాల్గు ఆకులు కలిసి గుత్తులుగా ఉంటాయి. పూవ్వులు తెల్లగా సాధారణంగా కొమ్మల చివర్లో గుత్తులుగా వస్తాయి.

ఉపయోగాలు

[మార్చు]

మలబద్ధకమును పోగొట్టే విరేచనకారి, కడుపులో పురుగులను బైటకు కొట్టే లక్షణం కలిగి ఉండే బలవర్థకము. రొమ్ము పడిశమూ, జాండిస్, శరీరమంటలు, ఉబ్బసము, అజీర్ణము అనేక రకాల శరీరపునెప్పులు, పక్షవాతం - రోగాలపై పనిచేస్తుంది. దీనికి ఈ మొక్కను కషాయంగా చేసుకొని తీసుకోవాలి. ఆకుల కషాయం, జ్వరాలకు, తాజా మొక్క రసాన్ని బాహ్యంగా గజ్జి ఉన్న చోట్ల వ్రాస్తే గజ్జి పోతుంది. పూవులను సిరప్ గా చేసి తాగితే జలుబు తగ్గుతుంది.

మూలాలు

[మార్చు]

ఆదిమ గిరిజన వైద్యము

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తుమ్మి&oldid=3878412" నుండి వెలికితీశారు