తురగ దేశిరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తురగ దేశిరాజు మానసిక శాస్త్రవేత్త. శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి గ్రహీత[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన మే 26, 1935పిట్టలవేమవరం గ్రామంలో జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బి.ఎస్.సి డిగ్రీని 1954 లో పూర్తి చేశారు. బనారస్ విశ్వవిద్యాలయంలో ఎం.యస్సీని 1056 లో చేసారు. అంధ్రా మెడికల్ కాలేజీలో పి.హెచ్.డి పట్టాను 1964లో పొందారు. ఐన్‌స్టీన్ కాలేజి ఆఫ్ మెడిసన్ లో పోస్టు డాక్టొరల్ రీసెర్చిని 1967 నుండి 1969 ల మధ్య చేశారు.

ఉద్యోగ జీవితం

[మార్చు]

ఈయన విజయనగరం లోని మహారాజా కళాశాలలో అధ్యాపకునిగా 1956 నుండి 1958 మధ్య కాలంలో పనిచేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి ఆఫీసరుగా పరిశోధనలు ప్రారంభించారు. ఈయన 1958 నుండి 1964 వరకు ఆంధ్రా మెడికల్ కళాశాల, విశాఖపట్నంలో పరిశోధనలు కొనసాహించారు. 1961 నుండి 1975 ల మధ్య కాలంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (న్యూఢిల్లీ) లో సీనియర్ రీసెర్చె ఆఫీసరుగా పనిచేసారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ (బెంగళూరు) కు అసిస్టెంట్ డైరక్టరుగా, అసోసియేటు ప్రొఫెసరుగా (1975-76) రాణించారు. న్యూరో ఫిజియాలజీ విభాగానికి ప్రొఫెసర్, విభాగాధిపతిగా కీర్తి గడించారు.

పరిశోధనలు

[మార్చు]

ఈయన మానసిక రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన దేశీయ, విదేశీ పత్రికలలో 185 కు పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు. మెదడు పరిశోధనా రంగంలో ఈయన అపూర్వమైన కృషి చేశారు. చేతనావస్థలోని వివిధ దశలలో వివిధ అంశాలలో సుదీర్ఘ పరిశోధనలు చేశారు. మెదడు పనితీరును విశ్లేషించడంలో, మెదడు నిర్మాణం అధ్యయనం చేయడంలో, మెదడులోని న్యూరాన్స్ యొక్క మెత్తదనాన్ని అభివృద్ధిచేయడంలో విశేష పరిశోధనలు చేశారు. యోగసాధన ద్వారా మెదడుకు కలిగే ప్రతిస్పందన, మెదడు కార్యకలాపాల పెంపుదల మీద ఎంతో కచ్చితమైన అవగాహనను తెలియపరిచారు. "ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ" పత్రికకు సంపాదకులుగా, "న్యూరోలజీ ఇండియా" పత్రికకు సహాయ సంపాదకులుగా ఉండి శాస్త్రవిజ్ఞాన రంగానికి విశేష సేవలందించారు.

వివిధ పదవులు

[మార్చు]

ఆయన నేషనల్ అకాదమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జువాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాల ఫెలోషిప్ గ్రహీత. ఈయన ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చి ఆర్గనైజేషన్: న్యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సొసైటీ ఆఫ్ న్యూరో సైన్స్ ఇన్ ఇండియా, ఇండియన్ అకాడమీ ఆఫ్ యోగా, అసోసియేషన్ ఆఫ్ ఫిజియాలజిస్ట్స్ అండ్ ఫార్మకోలాజిస్ట్స్ ఆఫ్ ఇండియా, ప్రిమిటాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ బయోమెడికల్ సైన్సెస్, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ న్యూరోపాథాలజీ (అమెరికా), సొసైటీ ఆఫ్ బయోమెదికల్ కమ్యూనికేషన్లు మొదలైన సంస్థలకు వివిధ పదవులలో ఉండి తమ అమూల్య సేవలందించారు,

అవార్డులు, రివార్డులు

[మార్చు]
  • 1966 : శకుంతలాదేవి అమీర్ చంద్ రీసెర్చి ప్రైజ్
  • 1971 : గ్లాక్లో ఓరేషన్ గోల్డ్ మెదల్
  • 1980 : శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు
  • 1982 : డాక్టర్ బి.సి.రాయ్ నేషనల్ అవార్డు
  • 1985 : బసంతి దేవి, అమీర్ చంద్ ప్రైజ్
  • 1986 : డాక్టర్ మెనినో డిసౌజా న్యూరోలజీ ఓరేషన్ అవార్డు
  • 1986 : డాక్టర్ హెచ్.జె.మెహతా మెమోరియల్ ఓరేషన్ అవార్డు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]