తులసి గౌడ
తులసిగౌడ | |
---|---|
జననం | 1944 అంకోలా తాలూకా హొన్నాలి గ్రామం కర్ణాటక, |
నివాస ప్రాంతం | కర్ణాటక |
వృత్తి | అటవీ సంరక్షణ |
ఉద్యోగం | అటవీశాఖ కూలీ |
ప్రసిద్ధి | పద్మశ్రీ గ్రహీత, వృక్షమాత |
జీతం | రూపాయి పావలా |
భార్య / భర్త | గోవింద గౌడ |
తండ్రి | నారాయణ |
తల్లి | నీల |
తులసి గౌడ కర్ణాటకలోని అంకోలా తాలూకా హొన్నాలి గ్రామానికి చెందిన భారతీయ పర్యావరణవేత్త. ఆమె 30,000 మొక్కలకు పైగా నాటారు అటవీ శాఖ నర్సరీలను నిర్వహిస్తారు. పాఠశాల విద్య ఏమాత్రం లేనప్పటికీ, పర్యావరణ పరిరక్షణకు ఆమె ఎనలేని కృషి చేసింది. ఆమె చేసిన కృషిని భారత ప్రభుత్వం వివిధ సంస్థలు సత్కరించాయి. ఆమె 26 జనవరి 2020 న భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరింప బడినారు.[1][2]
బాల్యం
[మార్చు]1944 లో కర్ణాటక రాష్ట్రం అకోలా జిల్లా హోన్నల్లి గ్రామానికి చెందిన నారాయణ, నీల దంపతులకు తులసి గౌడ్ కు జన్మించారు. ఈమె హుళక్కి తెగకు చెందిన వారు. పేదరికంతో పాటు రెండేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఆమె చదువు సంధ్యలకు ఆర్ధిక వెసులు బాటు లేకవోవడంతో తల్లితో కలిసి కూలిపనులు చేసేది. గోవిందే గౌడతో వివాహం అయినది కానీ చిన్న వయసులోనే భర్తను కోల్పోయి వితంతువు అయ్యింది.
పర్యావరణ పరిరక్షణ
[మార్చు]రోజుకు రూపాయి పావలా కూలీతో విత్తన సంరక్షణ శాఖలో తులసి విత్తనాలు, మొక్కల సంరక్షన భాద్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఆమెకు పర్యావరణం పట్ల ప్రేమ కలిగింది. జీతం కోసమే కాకుండా నలుగురి మేలుకోసం మొక్కలు పెంచాలనే నిర్ణయం అప్పుడే తీసుకున్నారావిడ.
విధి నిర్వహణ
[మార్చు]అటవీ శాఖ అధికారి ఎల్లప్ప రెడ్డి వద్ద సహాయకురాలిగా పనిచేసే వారు.అటవీ శాఖ వారి మొక్కలను హోన్నాలి, దోమ, హెగూర్, కుట్టు, వజ్రహల్లి, డోంగ్రీ, కల్లేశ్వర, అడగోర్, అగసూర్, సిరుగుంజీ, ఎల్లోగాడిలలో ఖాళీ భూములలో నాటారు.తులసి గౌడ. ఒంటరితనాన్ని దూరం చే సుకోవటం కోసం, మొక్కలకు చేరువైంది. ఆమెలోని ఉత్సాహాన్ని చూసి, అటవీశాఖ వారు ఆమెకు వనమాలి ఉద్యోగం ఇచ్చారు. మొక్కలను తన బిడ్డల్లా చూసుకుంటూ, అంకిత భావంతో పనిచేశారు తులసి. మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోసి సంరక్షించటమే కాకుండా, ఆ మొక్కలోని గుణాలు, మొక్క పేరుకు సంబంధించిన జ్ఞానం పెంచుకున్నారు. ఎవరు వచ్చి, ఏ మొక్క గురించి ప్రశ్నించినా తడుముకోకుండా, విసుగు లేకుండా, ఆనందంగా ఆ వివరాలు చెబుతారు తులసి గౌడ. టేకు మొక్కలతో తన ప్రయాణం ప్రారంభించిన తులసి గౌడ, పనస వంటి అనేక పెద్ద పెద్ద మొక్కలు కూడా నాటి, అవి పెరిగి, ఫలాలనిస్తుంటే, తనకు మనుమలు పుట్టినంత ఆనందిస్తారు.
ఒక్క ఏటే 30 వేల మొక్కలు
[మార్చు]అటవీ ప్రాంతం, గ్రామాలు, పాఠశాల ప్రాంగణాలు, కొండప్రాంతాలలో ఆమె ఒకే సంవత్సరంలో 30 వేల పైగా మొక్కలు నాటారు. ఇలా సంవత్సరానికి ముప్పై వేల మొక్కల లక్ష్యాన్ని ఆమె చేరుకుంటూ వుండే వాారు.
ప్రాచుర్యం
[మార్చు]- 300 లకు పైగా రకాల అడవి చెట్ల సమాచారం తెలిసిన శాస్త్రవేత్తగా ఆమెకు పేరొచ్చింది
- అడవుల విజ్ఞాన సర్వస్వం గా ఆమెను పిలుస్తారు.
- 'వృక్ష దేవి' అని స్థానికులు పిలుస్తారు
పురస్కారాలు
[మార్చు]- రాజ్యోత్సవ పురస్కారం
- కేంద్ర ప్రభుత్వ ప్రియదర్శిని వృక్షమిత్ర పురస్కారం.
- పద్మశ్రీ అవార్డు : భారత ప్రభుత్వం 71గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2020 సంవత్సరానికి గానూ నాలుగవ అత్యున్నత పురస్కారం ఈమెకు ప్రకటించారు.
- కవితా స్మారక పురస్కారం
- హోచ్ హోన్నయ్య సమాజ సేవా పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ 10TV (9 November 2021). "కాళ్లకు చెప్పులు కూడా లేని పద్మ శ్రీ అవార్డు గ్రహీత తులసీ గౌడ" (in telugu). Archived from the original on 9 నవంబరు 2021. Retrieved 9 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "వృక్ష ప్రేమి తులసిగౌడ కన్నుమూత | Padma Shri Awardee And Tribal Environmental Activist Tulasi Gowda Dies At 86 In Ankola | Sakshi". www.sakshi.com. Retrieved 2024-12-18.
బయటి లంకెలు
[మార్చు]- సాక్షి తెలుగు పత్రికలో తులసి గౌడ వివరాలు
- మెగా మైండ్స్ ఇండియన్స్ పత్రికలో
- అటవీ విజ్ఞాన సర్వస్వం అంటూ ఈనాడు విడియో
- 2020 పద్మ అవార్డు ప్రకటన వార్త
- తులసి గౌడకు అభినందన హిందుపత్రిక లో 9 నవంబర్ర 2013 నాటి వార్త ఆర్కైవ్
- పంచ పద్మాలు సాక్షి పత్రికలో
- గుర్తింపు విషయం హిందూ పత్రిక 2011 జూన్ 2 వ తారీఖు నాటిది
- ఎడారిలో పచ్చదనం పండిస్తున్న నానమ్మ అంటూ కన్నడ ప్రభ పత్రికలో ఆర్టికల్
- వృక్షమాతకు పద్మశ్రీ అవార్డు అంటూ పబ్లిక్ టీవి లో ఆర్టికల్
- కన్నడ ప్రజావాణి పత్రికలో తులసి గౌడ అవార్డు సంగతులు ఇతరుల వార్తలతో కలిపి