తులసీ రామచంద్ర ప్రభు
స్వరూపం
డాక్టర్ తులసీ రామచంద్ర ప్రభు తులసి సీడ్స్ అధిపతి.గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం జగ్గాపురం లో పుట్టారు.కాపు నాయకుడు.మద్రాసు ఐఐటిలో ఫస్ట్ ర్యాంక్‌తో మెకానికల్ ఇంజినీరింగ్ పాసయ్యారు. ప్రతిభ ఉండీ చదువుకోలేకపోయిన వాళ్లకు సహకరించేందుకు 'శ్రీకృష్ణ దేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండర్ ప్రివిలెజ్డ్' సంస్థ పేరిట ఏటా 6500 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నాడు. అట్టపెట్టెల (కరోగేటెడ్ బాక్సెస్) పరిశ్రమను మొదలెట్టి, 'కోస్టల్ ప్యాకేజింగ్' చంద్రాట్రాన్స్‌పోర్టు,'తులసీ సీడ్స్' కంపెనీలకు పైగా అధిపతి అయ్యారు.గతంలో ఈయన ప్రజారాజ్యం తరపున మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పై పోటీచేసి ఓడిపోయారు.
భావాలు
[మార్చు]- ఉద్యోగంలో చేరిపోయి ఉంటే, నాకు అదే ప్రపంచమైపోయేది. జీవితం అక్కడే ముగిసిపోయేది, ఆ ఉద్యోగంలో ఎంత కష్టపడినా నేను ఈ స్థితికి వచ్చే వాడ్నే కాదు. వాస్తవానికి, ఇంతటి విశాల ప్రపంచంలో ఒక దారి మూసుకుపోయినంత మాత్రాన ప్రపంచమే చేజారిపోయినట్లు విషాదంలో కూరుకుపోవలసిన అవసరం లేదు. కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా వేల మార్గాలు కనిపిస్తాయి.
- నిత్యం ఆందోళన పడుతున్న మనిషిన్నేను. కొంతమందికి స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ద్వారా నేనేదో మహాయజ్ఞం చేశానని అనుకోవడం లేదు.మన పిల్లలకు, స్త్రీలకు ఏమైనా భవిష్యత్తూ, భద్రతా ఉన్నాయా? మన బిడ్డలు రేపు ఎక్కడ అత్యాచారాలకు గురవుతారో, ఎక్కడ గొంతు పిసికేయబడతారో, ఎప్పుడు రక్తపు ముద్దలై మన కళ్లముందు కుప్పపడతారో ఏమీ తెలియకుండా పోతోంది. మన అతి పెద్ద బాధ్యత వీటిని నివారించడంలోనే ఉంది.
- పొట్ట పోసుకోవడం కోసం ఎవరూ అంత క ష్టపడక్కర్లేదు. ఏ చిన్న పనితోనైనా బతికేయొచ్చు. నిజంగానే ఏమైనా చేయాల్సి ఉంటే అది దేశం కోసమే. ఎవరికి వాళ్లు డబ్బుల లెక్కల్లోనే సతమతమైపోతున్నారు.డబ్బే సమస్తం అనుకోవడం వల్లే కదా మనిషి మనిషి కాకుండాపోతున్నాడు.