తు.చ.తప్పకుండా
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (ఏప్రిల్ 2017) |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
తు.చ. తప్పకుండా అనే పదాన్ని కచ్చితంగా లేక ఉన్నది ఉన్నట్లుగా అనే అర్ధం వచ్చేలా లేక ఈ పదాలకు మరింత బలాన్ని చేకూర్చేదిగా ఉపయోగించడం జరుగుతుంది.[1]
తు.చ. తప్పకుండా ఎలా వచ్చింది
[మార్చు]తు.చ. తప్పకుండా అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. సంస్కృత శ్లోకాలు రాసేటప్పుడు పాటించవలసిన నియమాలలో పంక్తికి ఎనిమిది అక్షరాలు ఉండాలనే ఒక నియమం ఉండేది. ఒక్కోసారి ఎనిమిది అక్షరాలు రాయటం కుదరనప్పుడు తు, చ, స్వ, హి, వై వంటి కొన్ని అక్షరాలను ఉంచవచ్చు. ఉదాహరణకు : రామాయ లక్ష్మనశ్చతు
తు.చ. తప్పకుండా తెలుగులోకి ఎలా వచ్చింది
[మార్చు]మన కవులు కొంతమంది సంస్కృత శ్లోకాలను తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు సంస్కృత శ్లోకాలు వ్రాసిన వారు ఉపయోగించిన తు, చ, స్వ, హి, వై వంటి వాటికి సైతం కాని, అనే పదాలను ఉపయోగించి అనువాదం చేశారు. దేవభాష మీది గౌరవంతో తెలుగు కవులు తు, చ వంటి అక్షరాలను సైతం వదలి పెట్టకుండా కచ్చితంగా, ఉన్నది ఉన్నట్లుగా అనువాదం చేయడం వలన ఈనాడు కచ్చితంగా, ఉన్నది ఉన్నట్లుగా అనే పదాలు వాడవలసిన చోట తు.చ. తప్పకుండా అనే పదాం ఉపయోగంలోకి వచ్చింది.
తు.చ. తప్పకుండా కు మరొక వివరణ
[మార్చు]తు.చ. అంటే రామస్తు సీతాన్ దృష్ట్వా. రామశ్చ చకార తు చ అనేవి సంస్కృత భాషలో విశేషాలక్రింద లెక్క. ఇది పాద పూరణ కోసం వాడతారు. ఇవి సంస్కృత వాజ్మయంలోనివి.
తు.చ. ని విడమర్చితే
[మార్చు]'తు' అంటే తుమ్మినా....'చ' అంటే చచ్చినా అని. ఇది పూర్తిగా తెలుగు వ్యావహారిక జానపదము. మన సంప్రదాయం ప్రకారం ఎవరైనా తుమ్మితే అది అశుభం లేదా అపశకునంగా భావించి సదరు చెయ్యబోయే పనిని ఆపివేస్తారు. ఇక ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోయిన తరువాత కొన్ని పనులు అర్థంతరంగా ఆగిపోతాయి. ఇక్కడ మొదటిది (తుమ్ము) మన జీవితములో చాలా సాధారణంగా జరిగే విషయం, అతి స్వల్పమైనది. ఇక రెండవది (మరణం) జీవమే లేనిది, అంటే అతి గరిష్ఠమైనది. ఈ రెండిటిలో ఏది జరిగినా తప్పకుండా ఆ పనిని ముగించుతాను అని అర్థము అనగా ఎన్ని అవాంతరాలు వచ్చినా అనుకున్న పని అయిపోవాలి అనే దృఢ సంకల్ప బలమే 'తప్పకుండా' అనే పదానికి 'తు.చ.' బలము.
మూలాలు
[మార్చు]- ↑ "ఒమిక్రాన్‌తో భయమేల?". EENADU. Retrieved 2022-04-04.