తూగు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ప్రతి మనిషి ప్రతి రోజు వయసుని బట్టి తక్కువ, ఎక్కువ సమయాలు నిద్రిస్తూ ఉంటాడు. సాధారణంగా తక్కువ వయసు ఉన్నవారు ఎక్కువ సమయం, ఎక్కువ వయసు ఉన్నవారు తక్కువ సమయం నిద్రిస్తూంటారు, నిద్రించటం ఖచ్చితమయిన అవసరం కూడా. మామూలుగా నిద్ర రాక ముందే హాయిగా నిద్రించడానికి తగిన ఏర్పాట్లు చేసుకొని పడుకున్నప్పుడు మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అయితే కొన్ని పరిస్థితులలో సరైన సమయానికి నిద్రించక బలవంతంగా మేల్కొన్ని ఉండటానికి ప్రయత్నించినప్పుడు నిద్ర ఆవహించటం వలన శరీరం ఏదో ఒక వైపు తూగుతుంది. ఈ విధంగా బలవంతంగా మేల్కొన్ని నిద్రలోకి జారుకొని ఒక వైపుకి తూగటాన్నే తూగు లేక తూగుట అంటారు. తూగుతున్న మనిషి నిద్రలోకి జారుకోవడం, తూగిన వెంటనే మళ్ళీ మేల్కొనడం, మళ్ళీ నిద్రలోకి జారుకోవడం, మళ్ళీ మేల్కొనడం ఈ విధంగా అనేక సార్లు జరుగుతుంది.

ప్రమాదాలు[మార్చు]

తూగు వస్తున్నప్పటికి వాహన చోదకులు వాహనాలు నడుపుట వలన ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు డ్రైవర్లు తూగు వస్తదని భావించినప్పుడే ఇతర వాహనాలకు ఇబ్బంది కలుగకుండా బండిని ప్రక్కగా ఆపి ముఖం కడగటం, వీలయినంత వరకు నిద్రించడం చాలా అవసరం.

ఇవి కూడా చూడండి[మార్చు]

నిద్ర

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తూగు&oldid=1973309" నుండి వెలికితీశారు