Jump to content

తెడ్డుమూతి కొంగ

వికీపీడియా నుండి

తెడ్డుమూతి కొంగ
రాయల్ స్పూన్‌బిల్
Scientific classification
Phylum:
కార్డేటా
Class:
Order:
పెలికానిఫార్మ్స్
Family:
థ్రెస్కార్నిథిడే
Genus:
ప్లాటాలియా
Species:
పి. రెజియా
Binomial name
ప్లాటాలియా రెజియా
గౌల్డ్, 1838

తెడ్డుమూతి కొంగ (ఆంగ్లం: స్పూన్‌బిల్‌) అనేది కొంగ జాతికి చెందిన పక్షి. వీటికి పొడవాటి కాళ్లు ఉంటాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప మిగతా అన్ని ఖండాల్లోనూ దీని ఉనికి ఉంది. ఇవి ప్లాటేలియా జాతికి చెందినవి. దీనికి గ్రీకులో "వెడల్పైనది" అని అర్థం. ఇది వాటి విలక్షణమైన ముక్కు ఆకారాన్ని సూచిస్తుంది. సాధారణంగా ఆరు రకాలుగా గుర్తించబడినప్పటికీ, వర్గీకరణలో వీటన్నిటినీ ఒకే ప్రజాతిలో చూపించినప్పటికీ, కొన్నిసార్లు వాటిని మూడు వేర్వేరు ప్రజాతులలో చూపించడం కూడా కద్దు.[2]

తెడ్డుమూతి కొంగల ముక్కులు పెద్దవిగా, చదునైనవిగా, గరిటెలాంటి ఆకారంలో ఉంటాయి. అవి లోతు తక్కువ ఉండే నీటిలో తిరుగుతూ, పాక్షికంగా తెరిచిన తమ ముక్కులను ఒక వైపు నుండి మరొక వైపుకు ఊపుతూ నీటిలోని ఆహారాన్ని పట్టుకుంటాయి. ఏదైనా చిన్న జీవి ముక్కు లోపలి భాగాన్ని తాకిన క్షణంలో అది మూసుకుపోతుంది. తెడ్డుమూతి కొంగలు సాధారణంగా ఉప్పు కంటే మంచినీటిని ఇష్టపడతాయి. కానీ రెండింటిలోనూ కనిపిస్తాయి. అవి ప్రతిరోజూ చాలా గంటలు ఆహారం కోసం వెతుకుతాయి.[3]

వివరణ

[మార్చు]

తెడ్డుమూతి కొంగలను, ఐబీస్‌ పక్షులనూ వాటి ముక్కు ఆకారంలో ఉన్న తేడాల వల్ల తేలికగా గుర్తించవచ్చు[4]. తెడ్డుమూతి కొంగల ముక్కు ఆకారం పొడవుగా, చదునుగా, చివర వెడల్పుగా ఉంటుంది. శ్వాస తీసుకునే రంధ్రాలు ముక్కు వెనక భాగంలో ఉంటాయి. తద్వారా అది ముక్కును నీటిలో ముంచి ఆహారం వెతుకుతున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడం సాధ్యమవుతుంది. అయితే, ఆహారం వెతుకుతున్నప్పుడు. వీటి కళ్ళు, ఒక వస్తువును ఒకే సమయంలో రెండు కళ్ళ తోటీ చూసేలా (బైనాక్యులర్ విజన్[గమనిక 1]) అమరి ఉన్నాయి. స్పర్శేంద్రియాలు కూడా ముఖ్యమే ఐబిస్‌ల మాదిరిగానే, తెడ్డుమూతి కొంగలకు కూడా ముక్కు చుట్టూ, కళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై బేర్ ప్యాచ్‌లు ఉంటాయి.[5]

సంతానోత్పత్తి

[మార్చు]

తెడ్డుమూతి కొంగలు ఏకస్వామ్య జీవులు. ఇవి చెట్లు లేదా రెల్లు పడకలలో గూడు కట్టుకుంటాయి, తరచుగా ఐబిస్‌లు లేదా హెరాన్‌లతో కలిసి గూడు కట్టుకుంటాయి. మగ పక్షి గూడు కట్టుకునే పదార్థాలను సేకరిస్తుంది. ఎక్కువగా కర్రలను, రెల్లును, కొన్నిసార్లు పాత గూడు నుండి తెస్తాయి. ఆడ పక్షి వాటిని పెద్ద, లోతు లేని గిన్నె లాగా నేస్తుంది. వివిధ జాతుల పక్షులు నేసే గూడు ఆకారం, నిర్మాణ సమగ్రతలో తేడాలుంటాయి.[6]

ఆడ పక్షి దాదాపు మూడు మృదువైన, అండాకారపు తెల్లటి గుడ్లను పెడుతుంది. ఆడ, మగ పక్షులు రెండూ కలిసి గుడ్లను పొదుగుతాయి. ఇవి గుడ్లను అన్నిటిని కలిపి కాకుండా ఒక్కొక్కటిగా పొదుగుతాయి. అప్పుడే పొదిగిన పిల్లలు గుడ్డిగా ఉంటాయి. పుట్టిన వెంటనే తమను తాము చూసుకోలేవు. తల్లిదండ్రులు పిల్లలకు పాక్షికంగా తినే ప్రక్రియ ద్వారా ఆహారం అందిస్తారు. కొత్తగా పొదిగిన పిల్లల ముక్కులు పొట్టిగా, నిటారుగా ఉంటాయి. అవి పరిపక్వం చెందుతున్నప్పుడు మాత్రమే విలక్షణమైన గరిటె లాంటి ఆకారాన్ని పొందుతాయి. గూడును విడిచిపెట్టిన తర్వాత కూడా పిల్ల పక్షులకు వాటి తల్లిదండ్రులు ఆహారం ఇవ్వడం కొన్ని వారాల పాటు కొనసాగుతుంది. వీటిలో భ్రూణ మరణాలకు ప్రధాన కారణం వేటాడటం కాదు, ఆకలి.

జాతులు

[మార్చు]

వీటి ఆరు జాతులు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి.[7]

ప్లాటేలియా జాతులు
సాధారణ, శాస్త్రీయ నామాలు బొమ్మలు వివరణ ఆవాసం
యూరేషియన్ స్పూన్‌బిల్

(ప్లాటాలేయా ల్యూకోరోడియా)

పెద్ద, చిన్న పక్షులు రెండూ తెల్లగా ఉంటాయి. వీటి రెక్కల చివరలు, కాళ్ళు, ముక్కులు నల్లగా ఉంటాయి. సాధారణంగా రెల్లు పడకలలో, ఇతర పక్షులు లేని చోట నివాసం ఏర్పరచుకుంటాయి. ఆఫ్రికా ఈశాన్య ప్రాంతం నుండి, యూరోప్ లోని బ్రిటిష్ దీవుల వరకు, తూర్పున జపాన్ వరకు ఈ పక్షి కనిపిస్తుంది.
బ్లాక్ ఫేస్డ్ స్పూన్‌బిల్

(ప్లాటేలియా మైనర్)

యురేషియన్ స్పూన్‌బిల్స్‌తో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఆగ్నేసియా: తైవాన్, చైనా, కొరియా, జపాన్
ఆఫ్రికన్ స్పూన్‌బిల్

(ప్లాటేలియా అల్‌బా)

యూరేసియన్ స్పూన్‌బిల్‌కు సాదృశ్యం ఉన్న పెద్ద తెలుపు జాతి, దీనికి గులాబీ రంగు ముఖం, సాధారణంగా పాలిపోయిన (లేత) ముక్కు ఉంటాయి. ఆహారంలో కీటకాలు, ఇతర చిన్న జీవులను తింటుంది. ఇది చెట్లు, కలువలు లేదా రాళ్లలో గూడు పెడుతుంది. ఆఫ్రికా, మడగాస్కర్
రాయల్ స్పూన్‌బిల్

(ప్లాటేలియా రీజియా)

ఇవి నల్లటి ముఖం కలిగిన పెద్ద తెల్లటి తెడ్డుమూతి కొంగలు. ఆగ్నేయ ఆస్ట్రేలియాలో సాధారణంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు న్యూజిలాండ్, న్యూ గినియా, ఇండోనేషియా, పసిఫిక్ దీవులలో కూడా కనిపిస్తుంది.
ఎల్లో-బిల్డ్ స్పూన్‌బిల్

(ప్లాటేలియా ఫ్లేవిప్స్)

ఇవి పసుపు రంగు ముక్కుతో ఉన్న తెల్లటి తెడ్డుమూతి కొంగలు. ఆగ్నేయ ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది
రోజేట్ స్పూన్‌బిల్

(ప్లాటాలియా అజాజా)

పెద్ద పక్షులకు గులాబీ రంగు రెక్కలు ఉంటాయి. దక్షిణ అమెరికా, కరేబియన్, ఆగ్నేయ అమెరికాలో కనిపిస్తాయి.

మూలాలు

[మార్చు]
  1. BirdLife International (2012). "Platalea regia". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.
  2. Mayr, Ernst; Cottrell, G. William, eds. (1979). Check-List of Birds of the World. Vol. 1 (2nd ed.). Cambridge, Massachusetts: Museum of Comparative Zoology. p. 266.
  3. Ramirez, J.L.; Miyaki, C.Y.; Del Lama, S.N. (2013). "Molecular phylogeny of Threskiornithidae (Aves: Pelecaniformes) based on nuclear and mitochondrial DNA" (PDF). Genetics and Molecular Research. 12 (3): 2740–2750. doi:10.4238/2013.July.30.11. PMID 23979898. Archived from the original (PDF) on 2024-09-23. Retrieved 2025-11-20.
  4. Chesser, R.Terry; Yeung, Carol K.L.; Yao, Cheng-Te; Tians, Xiu-Hua; Li Shou-Hsien (2010). "Molecular phylogeny of the spoonbills (Aves: Threskiornithidae) based on mitochondrial DNA". Zootaxa. 2603 (2603): 53–60. doi:10.11646/zootaxa.2603.1.2. ISSN 1175-5326.
  5. Mayr, Ernst; Cottrell, G. William, eds. (1979). Check-List of Birds of the World. Vol. 1 (2nd ed.). Cambridge, Massachusetts: Museum of Comparative Zoology. p. 266.
  6. Chesser, R.Terry; Yeung, Carol K.L.; Yao, Cheng-Te; Tians, Xiu-Hua; Li Shou-Hsien (2010). "Molecular phylogeny of the spoonbills (Aves: Threskiornithidae) based on mitochondrial DNA". Zootaxa. 2603 (2603): 53–60. doi:10.11646/zootaxa.2603.1.2. ISSN 1175-5326.
  7. Gill, Frank; Donsker, David; Rasmussen, Pamela, eds. (July 2021). "Ibis, spoonbills, herons, Hamerkop, Shoebill, pelicans". IOC World Bird List Version 11.2. International Ornithologists' Union. Retrieved 12 August 2021.


ఉల్లేఖన లోపం: "గమనిక" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="గమనిక"/> ట్యాగు కనబడలేదు