తెరలో తెర (నాటకం)
స్వరూపం
తెరలో తెర | |
కృతికర్త: | కొర్రపాటి గంగాధరరావు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు, శ్రీ సత్యనారాయణ బుక్ డిపో, రాజమహేంద్రవరం (శ్రీ కొండపల్లి ముద్రాశాల) |
విడుదల: | ఫిబ్రవరి, 1957 |
పేజీలు: | 114 |
తెరలో తెర కొర్రపాటి గంగాధరరావు రాసిన సాంఘీక నాటకం. మనసులో తెరలులో తెరలు లేకుండా ఉన్నదున్నట్లుగా మనసా, వాచా ప్రవర్తిస్తే ఎటువంటి ఇబ్బందులు రావు అనేది ఈ నాటక కథాశంతో ఈ నాటకం రాయబడింది.[1]
కథానేపథ్యం
[మార్చు]కుటుంబంలోని వ్యక్తులందరూ పూర్తిగా వాళ్ళవాళ్ళ అభిలాషలు బైటపెట్టకుండా స్వప్రయోజనాన్ని సాధిద్దామని అనుకుంటుంటారు.
పాత్రలు
[మార్చు]- సుధాకరం (ఒక నాటక రచయిత, సుందరరామయ్య గారి కుటుంబ స్నేహితుడు)
- సుందరరామయ్య (సంవన్నడు 55ఏళ్ళు)
- మూర్తి (సుందరరామయ్య కొడుకు 22ఏళ్ళు)
- లలిత (సుందరరామయ్య కూతురు 19ఏళ్ళు)
- రాము (మూర్తి, లలితల స్నేహితుడు 22ఏళ్ళు)
- డాక్టరు (సుందరరామయ్య కుటుబం డాక్టరు 24ఏళ్ళు)
- సుఖదేవ్ (17ఏళ్ళ పిల్లవాడు)
- డ్రైవర్
ఇతర వివరాలు
[మార్చు]- ఈ నాటకం తొలిసారిగా బాపట్లలోని కళావని నాటక సంస్థచే ప్రదర్శించబడింది. ఈ ప్రదర్శనలో గంగాధరరావు, సింగరాజు నాగభూషణం, ఎన్.ఎన్. ప్రసాద్, డా. ఎస్.వి. చలపతిరావు, ఎన్.కె. శర్మ, డి.వి. కృష్ణమార్తి, సరోజిని నటించారు.
మూలాలు
[మార్చు]- ↑ మనసు పొరలను విప్పిన తెరలో తెర, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 10 సెప్టెంబరు 2018, పుట.2