Jump to content

తెలంగాణ: ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ (పుస్తకం)

వికీపీడియా నుండి
తెలంగాణ: ది స్టేట్ ఆఫ్ అఫైర్స్
రచయిత(లు)ఎం. భరత్ భూషణ్
ఎన్. వేణుగోపాల్
ముఖచిత్రంరమణజీవి
దేశంభారతదేశం
భాషఇంగ్లీష్
విషయంతెలంగాణ ఉద్యమం, ప్రాంతీయవాదం
ప్రచురణ కర్తఏడిఈడి వాల్యూ వెంచర్స్, హైదరాబాద్
ప్రచురించిన తేది
2009 ఆగస్టు
పుటలు210
OCLC460939250

తెలంగాణ: ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనేది ఎం. భరత్ భూషణ్, ఎన్. వేణుగోపాల్ సంపాదకత్వం వహించిన పుస్తకం.[1] తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌లోని హేతుబద్ధతను గురించి వివరించిన పుస్తకమిది.

నేపథ్యం

[మార్చు]

తెలంగాణ ఉద్యమ చరిత్ర, పరిణామాలపై విభిన్న దృక్కోణాలను ఒకచోట చేర్చే నిరాడంబరమైన ప్రయత్నంతో ఈ పుస్తకం వెలువడింది. ప్రాంతీయ వివక్ష, గుర్తింపు, దాని నిర్మాణ సమస్యల గురించి ఈ పుస్తకంలో విశ్లేషించబడింది.

సారాంశం

[మార్చు]

1969 జై తెలంగాణ ఉద్యమం, విభజన కోసం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ఎన్నికల పాత్ర, రాజకీయ అస్తిత్వాలుగా సినీ తారల ఆగమనం, తెలంగాణలోని కళారంగం వంటి అంశాలపై డంకన్ బి. ఫారెస్టర్, ఎన్ వేణుగోపాల్, ఎం భరత్ భూషణ్, డీన్ ఇ. మెక్‌హెన్రీ జూనియర్, కె నరేష్ కుమార్, ఎస్‌వి శ్రీనివాస్, రాధికా రాజమణి మొదలైన వారు రాసిన వ్యాసాలు, పరిశోధన-ఆధారిత రచనలు ఈ సంకలనంలో ఉన్నాయి. వీటితోపాటు పివి నరసింహారావు రాసిన గొల్ల రామవ్వ, అల్లం రాజయ్య రాసిన భూమి అనే చిన్న కథల అనువాదాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.[2]

మూలాలు

[మార్చు]
  1. "The Hindu : Literary Review / Columns : Intimacy of killing". www.hindu.com. Archived from the original on 15 September 2010. Retrieved 17 January 2022. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "The Telegraph - Calcutta (Kolkata) | Opinion | Paperback Pickings". www.telegraphindia.com. Archived from the original on 2012-11-02.