తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం | |
---|---|
అధికారిక పేరు | తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం |
జరుపుకొనేవారు | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం |
ప్రాముఖ్యత | బాలికా విద్య కోసం కృషి, మహిళా సాధికారత, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాల వృద్ధికి తోడ్పడం. |
ప్రారంభం | 2025 |
జరుపుకొనే రోజు | 03 జనవరి |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని జనవరి 03న తెలంగాణ మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది[1].దానికీ సంబంధించిన జిఓ నెం 9 తేదీ:02-01-2025 న విడుదల చేసింది[2][3].
సావిత్రిబాయి ఫూలే మహారాష్ట్రలోని సతారా జిల్లా నంగావ్ గ్రామంలో 1831 జనవరి 03న జన్మించారు. 1847 లో తన భర్త జ్యోతిబా ఫూలే తో కలిసి బాలికల కోసం మహారాష్ట్ర లోని పూణే జిల్లాలో దేశంలోనే తొలి సారిగా బాలికల పాఠశాలను స్థాపించి బాలికల విద్య కోసం కృషి చేశారు.స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణిగా చరిత్ర పుటల్లో ఎక్కారు. ఒక కవయిత్రిగా స్త్రీపురుషుల సమాన హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు అని చెపుతు అందురు చదవాలి అందరూ సమానంగా బతకాలని ఆమె అన్నారు.ఆమె భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి, ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే సతీమణి. కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి.అమె 1897మార్చి 10 న మరణించారు.
ప్రారంభం
[మార్చు]తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తిసుకొరావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది[4]. సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం[5] ( Women Teachers Day) [6]నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం తేదీ 02 జనవరి 2025 న సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు Official Orders జారీ చేసింది. దీంతో 03 జనవరి 2025 శుక్రవారం రోజున రాష్ట్ర మంతటా తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం (Telangana Women Teachers Day) గా నిర్వహించారు[7]. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 33 జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేసింది[8].
లక్ష్యాలు
[మార్చు]తెలంగాణ రాష్ట్రంలో ఆడ పిల్లలు ఎదుర్కొంటున్న లింగ,వివక్ష,కుల అసమానతల పై అవగాహన కల్పించడం.
ఆడబిడ్డల చదువు పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొవడం.
ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాల వృద్ధికి ప్రజా ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం.
కార్యక్రమాలు
[మార్చు]తెలంగాణ రాష్ట్రంలో విద్యా శాఖలో జనవరి 03న తెలంగాణ మహిళ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించటం[9].భారత దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా జనవరి 03న తెలంగాణ మహిళ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. మహిళలకు, ఆడబిడ్డల చదువు కోసం ఆమె చేసిన విశేష సేవలకు గాను ప్రతి ఏటా జనవరి 03న వారి సేవలు స్మరించుకుంటూ అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో విద్యా శాఖలో యాభై శాతాన్ని మించి మహిళా ఉపాధ్యాయులే ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయల సేవలను గుర్తించి వారికి సన్మానాలు చేసి పాఠశాల, కళాశాల అభివృద్ధి మరింత ప్రోత్సహించి బాలికలు పాఠశాలకు వెళ్లి విద్యాభ్యాసం చేసే విధంగా కృషి చేయడం.పాఠశాల, కళాశాలలో ఈ తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.
మూలాలు
[మార్చు]- ↑ "ts news: ఘనంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం". EENADU. Retrieved 2025-01-03.
- ↑ Rachavelpula, Kausalya (2025-01-02). "Telangana Government Announces January 3 as 'Women Teacher's Day' to Celebrate Savitribai Phule's Legacy". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2025-01-03.
- ↑ ABN (2025-01-03). "Teachers Day: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఈ రోజును." Andhrajyothy Telugu News. Retrieved 2025-01-03.
- ↑ Mahesh (2025-01-02). "ప్రభుత్వం కీలక నిర్ణయం.. జనవరి 3న తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం". www.dishadaily.com. Retrieved 2025-01-03.
- ↑ Babu, Velugu (2025-01-03). "నేడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం". Mana Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-01-03.
- ↑ "Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం". m-telugu.webdunia.com. Retrieved 2025-01-03.
- ↑ "జనవరి 3న మహిళా టీచర్ల దినోత్సవం | Women Teachers Day on January 3: Telangana | Sakshi". sakshi.com. Retrieved 2025-01-03.
- ↑ Velugu, V6 (2025-01-02). "తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం". V6 Velugu. Retrieved 2025-01-03.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ఇకపై ఏటా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం". mytelangana.com (in ఇంగ్లీష్). Retrieved 2025-01-03.