తెలంగాణ మ‌హిళా యూనివర్సిటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైద‌రాబాదు కోఠిలోని ఉమెన్స్ కాలేజీ

2014 జూన్ 2న నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మ‌హిళా యూనివ‌ర్సిటీ అవ‌స‌ర‌మ‌న్న దిశ‌గా ఆలోచించిన రాష్ట్ర ప్ర‌భుత్వం హైదరాబాదులోని కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం (ఆంగ్లం: Telangana Women's University) గా అప్ గ్రేడ్ చేస్తూ 2022 ఏప్రిల్ 25న ఉత్త‌ర్వులు జారీ చేసింది.[1]

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం ఒకటే ఉన్న కారణంగా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆ యూనివ‌ర్సిటీ ఏపీకే ప‌రిమితం అయింది. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నత విద్యావకాశాలు అంతగా లేకపోవడం వల్ల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకి వెళ్లాల్సి వస్తోంది. దీంతో చాలా కుటుంబాలు అభ్యంతరం తెలపడంతో ఆడపిల్లల కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు కోఠి ఉమెన్స్ కాలేజీని విశ్వ‌విద్యాల‌యంగా మార్చడంతో తెలంగాణలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ అవతరించినట్టయింది. ఇక తెలంగాణలో అమ్మాయిలకు ఉన్నతవిద్యలో అవకాశాలు మెరుగుపడగాయి.[2]

పరిపాలన

[మార్చు]

మ‌హిళా యూనివర్సిటీ తొలి వైస్‌చాన్స్‌లర్‌ (వీసీ) గా ప్రొఫెసర్‌ విజ్జులత 2023 మార్చి 6న బాధ్యతలు స్వీకరించింది.[3][4] విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్‌గా ఆచార్య వారిజా రాణి నియమితులయింది.[5]

ఇవీ చదవండి

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]

అధికారిక వెబ్సైట్

మూలాలు

[మార్చు]
  1. "తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-25. Retrieved 2022-04-25.
  2. Telanganatoday (2022-04-25). "Telangana Govt issues order for first Mahila Viswa Vidyalayam". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-25.
  3. "ఉపాధి మేళాలు.. అధునాతన కోర్సులు". EENADU. 2023-03-07. Archived from the original on 2023-03-07. Retrieved 2023-03-07.
  4. telugu, NT News (2023-03-07). "విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా చేస్తాం". www.ntnews.com. Archived from the original on 2023-03-07. Retrieved 2023-03-07.
  5. telugu, NT News (2023-03-17). "మహిళా యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌గా వారిజారాణి". www.ntnews.com. Archived from the original on 2023-03-17. Retrieved 2023-03-17.