తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ
Jump to navigation
Jump to search
స్థాపన | 2014 |
---|---|
రకం | తెలంగాణ ప్రభుత్వ సంస్థ |
కేంద్రీకరణ | గిరిజనుల ఉపాధి |
కార్యస్థానం |
తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ అనేది తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులకు ఉపాధి అవకాశాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న గిరిజనులను దళారి వ్యాపారస్తుల నుంచి కాపాడే లక్ష్యంగా ఏర్పాటైన ఈ గిరిజన సహకార సంస్థకు 2022 మార్చి 31న రమావత్ వాల్యానాయక్ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1]
చరిత్ర
[మార్చు]ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్ధ (జిసిసి) ప్రారంభించబడింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఏర్పాటయింది.
విధులు
[మార్చు]- గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం
- కొనుగోలు చేసిన అటవీ ఉత్పత్తులకు ‘బ్రాండింగ్’ కల్పించి, వాటిని మార్కెట్‌లో విక్రయిచడం
చైర్మన్లు
[మార్చు]- ధరావత్ గాంధీనాయక్ (2017 జూన్ 12 - 2022, మార్చి 30)[2]
- రమావత్ వాల్యానాయక్ (2022 మార్చి 31 - ప్రస్తుతం)
ఫలితాలు
[మార్చు]- 2018-19 సంవత్సరానికి 250 కోట్ల రూపాయల టర్నోవర్ లక్ష్యానికి 238 కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించింది.
- 2019-20 సంవత్సరానికి 400 కోట్ల రూపాయల టర్నోవర్ లక్ష్యానికి పెట్టుకోగా 2019 డిసెంబరు చివరి వరకే 200 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (1 April 2022). "జీసీసీ చైర్మన్‌గా రమావత్ వల్యా నాయక్" (in ఇంగ్లీష్). Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
- ↑ telugu, NT News (2021-06-02). "ఉద్యమ బీజాలు…నేటి తేజాలు". Namasthe Telangana. Archived from the original on 2021-06-02. Retrieved 2022-04-01.
- ↑ "లక్ష్యాలను సాధించిన గిరిజన సహకార సంస్థ". andhrabhoomi.net. Archived from the original on 2020-09-20. Retrieved 2022-04-01.