గిరిజన సహకార సంస్ధ (జిసిసి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గిరిజనుల ధింసా నృత్యం

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వారిని దళారి వ్యాపారస్తుల నుంచి కాపాడే లక్ష్యంగా ఏర్పాటైన రాజ్యాంగబద్ద సంస్థ గిరిజన సహకార సంస్థ ( జిసిసి ). ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ (జిసిసి)ను 1956లో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. ఈ సంస్థకు ప్రస్తుతం టి.బాబురావు నాయుడు వైస్ చైర్మెన్, మేనేజింగు డైరెక్టర్. రాష్ట్రంలో జిసిసికి ఏడు డివిజనల్ కార్యాలయాలు ఉన్నాయి. సంస్థ పరిధిలో 25 గిరిజన ప్రాథమిక పరపతి సహకార సంఘాలున్నాయి.

గిరిజనుల నుంచి సేకరించిన తేనె, చింతపండు, నరమామిడి వంటి దాదాపు 26 రకాల చిన్న తరహా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం, విక్రయించడం, ప్రాసెసింగు చేసి ఆ ఉత్పత్తులను మార్కెట్లో వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకురావడం వంటి బాధ్యతను గిరిజన సహకార సంస్థ నిర్వహిస్తుంది. సేకరించిన అటవీ, ఇతర ఫలసాయ ఉత్పత్తులను నిల్వ వుంచేందుకు జిసిసికి రాష్ట్రంలో 70 నిల్వ కేంద్రాలు ఉన్నాయి. సేకరించిన ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకోచ్చేందుకు గాను రాష్ట్రంలో జిసిసి ఆధ్వర్యంలో ఏడు పారిశ్రామిక సముదాయాలు నడుస్తున్నాయి. వీటిలో తయారు చేయబడ్డ పసుపు, కుంకుమ, తేనె, షరబత్, షాంపూలు, సబ్బులు, కాఫీ పొడి వంటి 27 ఉత్పత్తులను రిటైల్ గా ప్రత్యేక ఔట్ లెట్లు, సూపర్ బజార్లు, రైతు బజార్లు, ఆన్ లైన్ల విక్రయాల ద్వారా విక్రయిస్తుంది.

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 5500 ఆవాసాల్లో 891 డి.ఆర్.డిపోలను జిసిసి నిర్వహిస్తుంది. వీటి ద్వారా గిరిజనులకు సబ్సిడీ నిత్యావసరాలు జిసిసి సిబ్బంది పంపిణీ చేస్తారు. విశాఖ జిల్లాలో అరకు, చింతపల్లి ప్రాంతాల్లో గిరిజనులు పండించే కాఫీ గింజలను జిసిసి కొనుగోలు చేస్తుంది. వాటిని ఈ వేలం ద్వారా అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించడంతో పాటు అరకు వ్యాలీ, వైశాఖి కాఫీ బ్రాండుల పేరుతో బహిరంగ మార్కెట్లో వినియోగదార్లకి విక్రయిస్తుంది. గిరిజన సహకార సంస్థ గత ఏడాది 1400 మెట్రిక్ టన్నుల కాఫీని గిరిజనుల నుంచి సేకరించి విక్రయాలు జరపడంతో పాటు గిరిజనులకు గిట్టుబాటు ధరను కల్పించింది.

మూలాలు[మార్చు]