తెలంగాణ రాష్ట్ర గెస్ట్‌హౌజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాష్ట్ర గెస్ట్‌హౌజ్
సాధారణ సమాచారం
పట్టణం లేదా నగరంహైదరాబాదు, తెలంగాణ
దేశంభారతదేశం
నిర్మాణ ప్రారంభం2004
వ్యయం₹8.1 కోట్లు
క్లయింట్తెలంగాణ రాష్ట్రం
సాంకేతిక విషయములు
పరిమాణం2 ఎకరాలు
నేల వైశాల్యం25,500 చదరపు అడుగులు

తెలంగాణ రాష్ట్ర గెస్ట్‌హౌజ్ తెలంగాణ రాష్ట్ర అధికారిక అతిథిగృహం. హైదరాబాదులోని పంజగుట్టలో ఈ గృహం తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయమైన ప్రగతి భవన్ లో భాగంగా ఉంది.[1] ప్రస్తుతం ఇది ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం (భద్రత) గా మార్చబడింది.

చరిత్ర[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉండేది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ క్యాంప్ కార్యాలయం నిర్మించబడింది. తొలిసారిగా వై.యస్. రాజశేఖరరెడ్డి 2005 నుండి 2009లో మరణించేవరకు ఐదేళ్లపాటు ఇందులోనే ఉన్నాడు.[2]

క్యాంప్ ఆఫీస్[మార్చు]

సిఎం క్యాంప్ కార్యాలయంలో రెండు అంతస్తుల ప్రాంగణంలో కార్యాలయం, నివాసం ఉన్నాయి. 25,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో 2-ఎకరాల (8,100 మీ 2)లో విస్తరించి ఉంది. వాస్తు ప్రకారం నిర్మించబడిన ఈ భవనానికి తూర్పు, ఉత్తర దిశలలో రోడ్లు ఉన్నాయి. ఈ భవన ప్రాంగణంలో 2007లో ప్రాంగణంలో 2,500 చదరపు అడుగుల (230 మీ 2)లో 1.15 కోట్ల వ్యయంతో ఒక థియేటర్ నిర్మించబడింది. దీనిలో అత్యాధునిక రికార్డింగ్, ఆన్‌లైన్ ఎడిటింగ్ పరికరాలు ఉన్నాయి.

నివసించిన ముఖ్యమంత్రులు[మార్చు]

రాష్ట్ర విభజన తరువాత[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ క్యాంప్ కార్యాలయం తెలంగాణ ముఖ్యమంత్రి నివాసంగా మారింది. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇవ్వబడింది.[3]

  • కె. చంద్రశేఖర్ రావు (22 జూన్ 2014 - 2015)[4]

ప్రస్తుతం[మార్చు]

ప్రస్తుతం దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి అతిథిగృహంగా ఉపయోగిస్తున్నారు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "CM to shift to camp office today after vastu changes - The Times of India". timesofindia.indiatimes.com. Retrieved 31 August 2019.
  2. "CM to move into Camp home". deccanchronicle.com. Deccan Chronicle. 7 డిసెంబరు 2010. Archived from the original on 8 డిసెంబరు 2010. Retrieved 31 ఆగస్టు 2019.
  3. "Telangana CM K Chandrasekhar Rao chooses to stay at camp office". deccanchronicle.com. Retrieved 31 August 2019.
  4. "KCR moves in to Begumpet camp office - The Times of India". timesofindia.indiatimes.com. Retrieved 31 August 2019.