తెలంగాణ లోకాయుక్త
స్వరూపం
తెలంగాణ లోకాయుక్త | |
---|---|
ఏజెన్సీ అవలోకనం | |
ఏర్పాటు | 2019 |
అధికార పరిధి నిర్మాణం | |
Federal agency | [[ భారతదేశం]] |
కార్యకలాపాల అధికార పరిధి | [[ భారతదేశం]] |
సాధారణ స్వభావం | |
ప్రధాన కార్యాలయం | H.No.5-9-49, బషీర్‌బాగ్ , హైదరాబాద్ . |
ఏజెన్సీ అధికారులు |
|
వెబ్‌సైట్ | |
http://lokayukta.telangana.gov.in/ |
తెలంగాణ లోకాయుక్త రాష్ట్ర స్థాయిలోని అత్యున్నత వ్యక్తుల అవినీతి, అక్రమాలను విచారించే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ. మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేశారు. తెలంగాణ లోకాయుక్త-2020 సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ మార్చి 15, 2020న శాసనసభ తీర్మానం చేసింది.[1] తెలంగాణ లోకాయుక్త డిసెంబర్ 2019లో ఏర్పాటైంది.[2]
లోకాయుక్త నియామకం, పదవీకాలం
[మార్చు]- హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని 'లోకాయుక్త గా నియమిస్తారు. ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ లోకాయుక్తను నియమించి ప్రమాణస్వీకారం చేయిస్తారు.
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన 5 మంది జిల్లా న్యాయమూర్తుల్లో ఒకరిని 'ఉప లోకాయుక్త గా గవర్నర్ నియమిస్తారు.
- లోకాయుక్త పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు. పదవీకాలం అనంతరం తిరిగి ఈ పదవులు పొందడానికి వీరు అనర్హులు.
- లోకాయుక్త పాలనాధిపతి 'రిజిస్టార్ . ప్రత్యేక ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదాలో విచారణ సంచాలకుడు ఉంటాడు. ఇతడికి సహాయకులుగా నలుగురు ఉపసంచాలకులు, ముగ్గురు విచారణాధికారులు ఉంటారు.
- లోకాయుక్తకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, ఉప లోకాయుక్తకు హైకోర్టు ఇతర న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.
- లోకాయుక్త, ఉప లోకాయుక్తలు తమ రాజీనామాను గవర్నర్ కు సమర్పించాలి .[3]
విధులు
[మార్చు]- ప్రభుత్వ అధికార దుర్వినియోగం.
- ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కార్యకలాపాలు.
- బాధితులు ఎవరైనా తమ అభియోగాలను లోకాయుక్త దృష్టికి తీసుకురావచ్చు .
- లోకాయుక్తకు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు, విధులు ఉంటాయి.
- ఆరు సంవత్సరాల్లోపు జరిగిన సంఘటనలను మాత్రమే ఫిర్యాదులుగా స్వీకరిస్తుంది. #లోకాయుక్త ఫిర్యాదులను విచారించి, నివేదికను తయారుచేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని అతడు పనిచేసే శాఖాధికారికి సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసులపై సంబంధిత అధికారి మూడు నెలల్లోగా చర్యలు తీసుకుని ఆ సమాచారాన్ని లోకాయుక్తకు తెలియజేయాలి.
- లోకాయుక్త వివిధ ఫిర్యాదుల ప్రాథమిక విచారణను రహస్యంగా చేయాలి. లోకాయుక్త సిఫారసులు కేవలం సలహా పూర్వకమైనవి. వీటిని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
- లోకాయుక్త నియామకంలో రాష్ట్ర మంత్రి మండలి సలహాలను గవర్నర్ తప్పనిసరిగా పాటించాలి.
చైర్మన్లు
[మార్చు]నెం | పేరు | ఫోటో | పదవి చేపట్టిన తేదీ | పదవి ముగిసిన తేదీ | ఉపలోకాయుక్త పేరు | ఫోటో | |
---|---|---|---|---|---|---|---|
1 | జస్టిస్ సి.వి రాములు [4] | 23.12.2019 | ప్రస్తుతం | జి. నిరంజన్ రావు (వొలిమినేని నిరంజన్ రావు) |
మూలాలు
[మార్చు]- ↑ Vaartha (15 March 2020). "బిల్లులకు శాసనసభ ఆమోదం". Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.
- ↑ Mana Telangana (19 December 2019). "లోకాయుక్త, హక్కుల కమిషన్ ఏర్పాటు". Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.
- ↑ Eenadu (13 June 2021). "లోక్‌పాల్, లోకాయుక్త". Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.
- ↑ The News Minute (20 December 2019). "Former judge Justice CV Ramulu appointed as Telangana Lokayukta" (in ఇంగ్లీష్). Archived from the original on 2 మార్చి 2021. Retrieved 29 August 2021.