సి.వి రాములు
జస్టిస్ సి.వి రాములు | |||
పదవీ కాలం 20 డిసెంబర్ 2019 – ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1949 ఫిబ్రవరి 20 ఆచన్‌పల్లి గ్రామం, బోధన్ మండలం , నిజామాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
పూర్వ విద్యార్థి | మరాట్వాడా యూనివర్సిటీ |
జస్టిస్ చింతపంటి వెంకట రాములు తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి. ఆయన 2019లో తొలి తెలంగాణ లోకాయుక్త గా నియమితుడై డిసెంబర్ 23, 2019న భాద్యతలు చేపట్టాడు.[1][2][3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]సీవీ రాములు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం, ఆచన్‌పల్లి గ్రామంలో 20 ఫిబ్రవరి 1949న జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు శంకర్‌నగర్, బోధన్‌లో, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిజామాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసి 1978లో మహారాష్ట్రలోని యశ్వంత్ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.[4]
వృత్తి జీవితం
[మార్చు]సీవీ రాములు 10 ఆగష్టు 1978న న్యాయవాదిగా ఎన్‌రోల్ చేసుకొని హైకోర్టు న్యాయవాది సి.ఆనంద్ దగ్గర జూనియర్‌గా చేరాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో 24ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. సీవీ రాములు కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి 13 ఏళ్ల పాటు స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశాడు. జస్టిస్ సీవీ రాములు 2002 డిసెంబర్ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడై, 24 జూన్ 2004న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై 19 ఫిబ్రవరి 2011న పదవి విరమణ చేశాడు.[5] జస్టిస్ సీవీ రాములు తెలంగాణ రాష్ట్ర తొలి లోకాయుక్తగా నియమితుడై డిసెంబర్ 23, 2019న భాద్యతలు చేపట్టాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (20 December 2019). "Retired HC judge CV Ramulu named Telangana Lokayukta". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
- ↑ Deccan Chronicle (20 December 2019). "Hyderabad: Justice CV Ramulu is Lokayukta" (in ఇంగ్లీష్). Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
- ↑ V6 Velugu (23 December 2019). "లోకాయుక్తగా జస్టిస్ సివి రాములు - Justice CV Ramulu sworn in as Lokayukta" (in ఇంగ్లీష్). Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (20 December 2019). "లోకాయుక్తగా జస్టిస్ సీవీ రాములు". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
- ↑ TSHC (2021). "THE HON'BLE SRI JUSTICE C.V. RAMULU". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
- ↑ తెలంగాణ మాస పత్రిక (2019). "లోకాయుక్తగా జస్టిస్ రాములు ప్రమాణస్వీకారం". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
- ↑ Andrajyothy (20 December 2019). "లోకాయుక్తగా జస్టిస్ రాములు". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.