తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం | |
---|---|
తెలంగాణ ప్రభుత్వ లోగో | |
ప్రభుత్వ సంస్థ అవలోకనం | |
స్థాపనం | 29 డిసెంబరు 2017 |
అధికార పరిధి | తెలంగాణ |
ప్రధాన కార్యాలయం | తెలంగాణ సచివాలయం, హైదరాబాదు |
Minister responsible | మల్లు భట్టివిక్రమార్క, (తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి) |
మాతృ శాఖ | తెలంగాణ ఆర్థిక శాఖ |
వెబ్‌సైటు | |
అధికారిక వెబ్సైటు |
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖకు చెందిన ఒక విభాగం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు అందించాల్సిన పన్నుల వాటా, గ్రాంట్లను రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేయడానికి ఈ సంఘం ఏర్పాటుచేయబడింది.[1]
ప్రారంభం
[మార్చు]2017 డిసెంబరు 29న ప్రభుత్వం ఈ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేసింది.[2]
విధులు
[మార్చు]- రాష్ట్రంలోని పంచాయతీల ఆర్థిక వనరులను పెంచేందుకు తగిన సిఫారసులు చేయడం
- రాష్ట్రవ్యాప్తంగా సమర్ధవంతమైన అభివృద్ధి కార్యకలాపాల కోసం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మరిన్ని ఆర్థిక వనరులను అందజేయడానికి అవసరమైన చర్యలను సూచించడం
అయితే, ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలన్న నియమమేదిలేదు. ప్రభుత్వ విచక్షణాధికారం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు.
పరిపాలన
[మార్చు]2017 డిసెంబరు 29న మాజీ మంత్రి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గొడిశెల రాజేశం గౌడ్ ఆర్థిక సంఘ తొలి చైర్మన్‌గానూ, రంగారెడ్డి జిల్లా కొత్తపల్లికి చెందిన రిటైర్డు జడ్పీ సిఇఓ మొండ్యాగు చెన్నయ్య కురమ సభ్యుడిగా నియమించబడ్డారు.[3][4]
2023 జూలై 6న మాజీ ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డి ఈ సంఘ చైర్మన్‌గానూ, గోసుల శ్రీనివాస్ యాదవ్, మొహమ్మద్ సలీంలు సభ్యులుగా నియమించబడ్డారు.[5]
సిరిసిల్ల రాజయ్యను 2024 ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.[6] ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా వికారాబాద్ నుంచి మల్కూడ్ రమేష్, సూర్యాపేట నుంచి సంకెపల్లి సుధీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి నెహ్రూనాయక్ మాలోతు నియమితులయ్యారు.
మూలాలు
[మార్చు]- ↑ Reddy, Suhasini (2020-02-05). "Hyderabad: Telangana State Finance Commission held a meeting with the newly elected Mayors on Wednesday". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
- ↑ "G Rajesham Goud to head Telangana State Finance Commission". The New Indian Express. 2017-12-29. Archived from the original on 2018-09-28. Retrieved 2023-07-07.
- ↑ "G Rajesham Goud to head Telangana State Finance Commission". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
- ↑ "రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా రాజేశంగౌడ్". andhrabhoomi.net. Archived from the original on 2022-02-26. Retrieved 2023-07-07.
- ↑ "వివిధ కమిషన్లకు ఛైర్మన్ల నియామకం". EENADU. Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
- ↑ A. B. P. Desam (16 February 2024). "తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య". Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.
బయటి లంకెలు
[మార్చు]- అధికారిక వెబ్సైటు Archived 2023-07-07 at the Wayback Machine